📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Friday, September 11, 2026
Visitors: 1,765,342  |  372 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుపిల్లలు పుట్టడం లేదని వైద్యులను సంప్రదించిన 26 ఏళ్ల వ్యక్తికి షాక్.. శరీరంలో గర్భాశయం!సెప్టెంబర్ 11, 9/11 దాడులు: ప్రపంచాన్ని మార్చిన విషాదకరమైన రోజుబ్రిక్స్‌ సదస్సుకు దిల్లీ సర్వసన్నద్ధం.. 15 వేల మంది పోలీసులతో భారీ భద్రతఫ్లిప్‌కార్ట్‌ మినిట్స్‌ ప్రత్యేక యాప్‌.. 10 నిమిషాల్లోనే నిత్యావసరాల డెలివరీఈపీఎఫ్‌ ఉపసంహరణలకు మరింత వెసులుబాటు.. వైద్య ఖర్చులకు ఎన్నిసార్లయినా విత్‌డ్రా...Latest Breaking News from PressMeetతాజా వార్తలుపిల్లలు పుట్టడం లేదని వైద్యులను సంప్రదించిన 26 ఏళ్ల వ్యక్తికి షాక్.. శరీరంలో గర్భాశయం!సెప్టెంబర్ 11, 9/11 దాడులు: ప్రపంచాన్ని మార్చిన విషాదకరమైన రోజుబ్రిక్స్‌ సదస్సుకు దిల్లీ సర్వసన్నద్ధం.. 15 వేల మంది పోలీసులతో భారీ భద్రతఫ్లిప్‌కార్ట్‌ మినిట్స్‌ ప్రత్యేక యాప్‌.. 10 నిమిషాల్లోనే నిత్యావసరాల డెలివరీఈపీఎఫ్‌ ఉపసంహరణలకు మరింత వెసులుబాటు.. వైద్య ఖర్చులకు ఎన్నిసార్లయినా విత్‌డ్రా...
Andhra ⚡ AMP

ఎన్ పి ఎస్ క్విట్ ఇండియా AINPSEF తెలంగాణ అధ్యక్షులు మాచన రఘునందన్

June 4, 2025 June 4, 2025 0 Views
SHARE: Share Tweet WhatsApp Telegram

పాత పింఛను పథకం సాధన కోసం ఈ నెల లో ఢిల్లీ లో కార్యక్రమం ఉందని ఏ ఐ ఎన్ పి ఎస్ ఈ ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు మాచన రఘునందన్ తెలిపారు. బుధవారం నాడు ఆయన హైదరాబాద్ లో మాట్లాడుతూ.. బెంగుళూరు లో జరిగిన కార్యక్రమం విజయవంతం అయ్యిందని చెప్పారు.”నో ఎన్ పి ఎస్”,”నో..యూ పి ఎస్”ఓన్లీ ఓ పి ఎస్”, అనే నినాదం తో ఈ నెలలో కొత్త ఢిల్లీ లో కార్యక్రమం ఉందన్నారు. పాత పింఛను పథకం పునరుద్ధరణ కోసం తాము చేస్తున్న విన్నపాలు పాలకుల చెవికి ఎక్కడం లేదని రఘునందన్ అవేదన వ్యక్తం చేశారు.అందుకే కొత్త ఢిల్లీ లో రామ్ లీల మైదానం లో పెద్ద ఎత్తున “ఎన్ పి ఎస్ క్విట్ ఇండియా” పేరిట బహిరంగ సభ ను నిర్వహించనున్నట్టు మాచన రఘునందన్ చెప్పారు. ఉద్యోగుల వేతనం లో నుంచి భాగస్వామ్య పింఛను పథకం కోసం సేకరిస్తున్న డబ్బు ఎక్కడ దాచారు, ఎంత పొగయ్యింది,అత్యవసర పరిస్థితుల్లో అవసరం ఐతే?! డబ్బు తీసుకునే వెసులుబాటు ఉందా ,లేదా అనే విషయం కూడా తెలియని అగమ్య గోచర పరిస్థితి లో న్యూ పెన్షన్ స్కీమ్ ఉద్యోగులు ఉపాధ్యాయులు ఉన్నారని రఘునందన్ అభిప్రాయ పడ్డారు. అందుకే దేశ వ్యాప్తంగా సి పి ఎస్ శ్రేణులు అబాలీష్ సి పి ఎస్ అని ముక్త కంఠంతో ఘోషిస్తున్నారని మాచన రఘునందన్ అన్నారు. పాత పింఛను పథకం సాధించే వరకు విశ్రమించే ప్రసక్తే లేదని రఘునందన్ స్పష్టం చేశారు.

Loading

 Save as PDF

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com
error: Content is protected !!