📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Friday, September 11, 2026
Visitors: 1,773,630  |  704 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుకాగ్నిజెంట్‌లో ఫ్రెషర్లకు మ్యాపింగ్ ఉద్యోగాలుపిల్లలు పుట్టడం లేదని వైద్యులను సంప్రదించిన 26 ఏళ్ల వ్యక్తికి షాక్.. శరీరంలో గర్భాశయం!సెప్టెంబర్ 11, 9/11 దాడులు: ప్రపంచాన్ని మార్చిన విషాదకరమైన రోజుబ్రిక్స్‌ సదస్సుకు దిల్లీ సర్వసన్నద్ధం.. 15 వేల మంది పోలీసులతో భారీ భద్రతఫ్లిప్‌కార్ట్‌ మినిట్స్‌ ప్రత్యేక యాప్‌.. 10 నిమిషాల్లోనే నిత్యావసరాల డెలివరీLatest Breaking News from PressMeetతాజా వార్తలుకాగ్నిజెంట్‌లో ఫ్రెషర్లకు మ్యాపింగ్ ఉద్యోగాలుపిల్లలు పుట్టడం లేదని వైద్యులను సంప్రదించిన 26 ఏళ్ల వ్యక్తికి షాక్.. శరీరంలో గర్భాశయం!సెప్టెంబర్ 11, 9/11 దాడులు: ప్రపంచాన్ని మార్చిన విషాదకరమైన రోజుబ్రిక్స్‌ సదస్సుకు దిల్లీ సర్వసన్నద్ధం.. 15 వేల మంది పోలీసులతో భారీ భద్రతఫ్లిప్‌కార్ట్‌ మినిట్స్‌ ప్రత్యేక యాప్‌.. 10 నిమిషాల్లోనే నిత్యావసరాల డెలివరీ
Editorial ⚡ AMP

బతకడం కోసం అమెరికాకు – బతుకు పోరాటంలో .. చచ్చిపోతున్నారు !

February 7, 2025 February 7, 2025 0 Views
SHARE: Share Tweet WhatsApp Telegram

అమెరికా లో అక్రమంగా ప్రవేశించేవారిలో ఎక్కువ మంది వెళ్ళేది… “గాడిద మార్గం”
ఎల్ బుర్రో అనే స్పానిష్ మాటకు అర్థం గాడిద .గాడిదలా బరువులు మోసుకొంటూ అడ్డదిడ్డంగా వెళ్లడం అనే భావాన్నుంచి ఇది పుట్టింది. గాడిద మార్గం రహదారి కాదు .ఎన్నెన్నో దొంగ మార్గాలు .ఇందులో ఒకటి… దరియెన్ ఖాళీ స్థలం .అతి భయంకరమయిన కీకారణ్యం .. చిత్తడి నేల.పొడవు 97 కిలోమీటర్లు .పనామా… కొలంబియా మధ్య వుంది.విష పాములు , చిరుతలు, విష కీటకాలు ఇక్కడ లెక్కకు మించి ఉంటాయి .ఎప్పుడూ వర్షం .. దానితో పాటే ఎండ .. వేడి .. చెమటలు కారి పోతాయి .

అసలు సమస్య ఇక్కడ వున్న డ్రగ్ మాఫియా లతో .ఆడవాసన కనబడితే వదిలిపెట్టరు .ఈ మార్గం లో వెళ్లేవారికి ఏజెంట్స్ ముందుగానే కండోమ్లు ఇస్తారు .డ్రగ్ కేటుగాళ్లతో సంభోగానికి ఒప్పుకోవాలి .లేకపోతె చిత్ర హింసలు పెట్టి రేప్ చేసి చంపేస్తారు .ఇవన్నీ లేకుండా ముందుగానే ఒప్పుకొంటే ప్రాణం దక్కుతుంది .ఎయిడ్స్ సోకకుండా రబ్బరు తొడుగు .వారు అడిగితే చేతిలో ఉన్న డబ్బు మొత్తం ఇచ్చేయాలి .

రోజుకు ఒక చిన్న బ్రెడ్ ముక్క .. రెండు బిస్కెట్లు .తాగు నీరు పెద్దగా అందుబాటులో ఉండదు . దరియెన్ గాప్ ప్రయాణం వారం నుంచి 15 రోజులు పడుతుంది .అదేంటి కేవలం 97 కిలోమీటర్స్ కదా?.. అనుకొంటున్నారా ?కొండలు గుట్టలు .. బురద .. చెట్లు చేమలు .. పాములు .. దోమలు .. అడుగు తీసి అడుగు వెయ్యాలనుంటే నరకం .అక్కడ ఖాయిలా పడితే అంతే సంగతి .ఖాయిలా మనిషిని అక్కడే వదిలేసి బృందం ముందుకు వెళ్ళిపోతుంది .అంటే అక్కడే తిండి లేకుండా చచ్చి పోతారు .జనాలు వెళుతుంటే దారిలో శవాలు ఆస్తి పంజరాలు కనిపిస్తాయి.ఇంతటి దారుణమయిన మార్గం లో ఎవరు వెళుతారు అనుకొంటున్నారా ?2023 లో మొత్తం అయిదు లక్షల మంది వెళ్లారు . అంతకు ముందు సంవత్సరం కంటే ఇది డబల్ .

విమానం లో ఎక్కించినా బేడీలు ఎందుకు ? భయం .. బయపెట్టడం .” మా దేశానికి అక్రమమార్గం లో వస్తే పర్యవసానాలు ఇలా ఉంటాయి!” అని అందరికీ హెచ్చరిక .సైకలాజికల్ వార్నింగ్ .అందుకే అమృత్సర్ ప్రయాణీకుల సంకెళ్ళ వీడియో ను వారి ప్రభుత్వం అధికారికంగా పెట్టింది .” దరియెన్ గ్యాప్ లో ఎన్నో కష్టాలు పడి మా దేశం లో దూరినా .. పట్టుకొంటాము. చీకటి గదుల్లో బందిస్తాము . అవమానకర రీతిలో చేతులకు కాళ్లకు బేడీలు వేసి గెంటేస్తాము “అని వారు అధికారికంగా చెబుతున్నారు . { గెంటేస్తాము అనే మాట వారు వాడింది }

శిక్షించవచ్చు కదా ?

టైటిల్ 8 సెక్షన్ 1325 .. us కోడ్ ప్రకారం ఆ దేశం లో అక్రమమగా చొరబడితే రెండేళ్లు జైలు .. రెండు లక్షల యాభై వేల డాలర్స్ అపరాధం .ఇప్పుడు గెంటివేయబడ్డ వారు ఇటీవలే వెళ్ళినవారు . వీరిలో చాలా మంది బోర్డర్ లోనే పట్టుబడి ఇన్నాళ్లు జైళ్లలో ఉన్నవాళ్లే . ఆస్తి మొత్తం అమ్మి ఏజెంట్స్ కు అప్పచెప్పి అమెరికా లో చొరబడి … అప్పుడే పట్టుబడితే వారి దగ్గర ఏమి ఉంటుంది ? ఇరవై లక్షలు కట్టగలరా ? అందుకే పంపేస్తున్నారు.ఇది వరకే అక్కడ చొరబడి కాస్తో కూస్తో డబ్బు సంపాదించిన వారితో ఎలా వ్యవహరిస్తారో చూడాలి .

విద్యార్థుల సంగతి ఏంటి ?
స్టడీ వీసా పై వెళ్లిన వారు క్యాంపస్ బయట ఉద్యోగాలు చేయకూడదు .ఇన్నాళ్లు సాగింది .ఇప్పుడు… పట్టుబడిపోతాము అని భయం తో టెక్సాస్ లాంటి చోట్ల ఎవరూ బయట ఉద్యోగాలకు వెళ్లడం లేదు .వీరు వెళ్లినా పార్ట్ టైం ఉద్యోగాలు ఇవ్వడానికి వారు రెడీగా లేరు.పరిస్థితి దారుణంగా వుంది .ఆయనకో షాప్ వుంది . వ్యాపారం వారి కుల వృత్తి . కొడుకును అరవై లక్షల అప్పు చేసి అమెరికా పంపించాడు . అటు పై మరో ఇరవై లక్షల అప్పు . వడ్డీ కట్టలేక మొన్న ఆత్మ హత్య చేసుకొన్నాడు .
కొడుకు బంగారు భవిత కోసం ప్రాణం విడిచిన తండ్రి . ఎవరిదీ పాపం ?

ఇంతజరిగినా జనాలకు ఇప్పటికీ సరైన సమాచారం ఇచ్చేవారు లేరు .”పక్క వాళ్ళు వెళ్లారు .. మనం కూడా వెళ్ళాలి” అనే తపనే .
గాడిద మార్గం లో ప్రాక్సీ మార్గం లో అమెరికా కు పంపే ఏజెంట్స్ కోటీశ్వరులు అయిపోయారు .అమెరికా లో కేసినోలలో ఒక రాత్రి పూట వారు పందెం కాచే డబ్బు చూసి అమెరికా సంపన్నులే కళ్ళు తేలేస్తున్నారు .నాశనం అయిపోతోంది మనోళ్లే .. దోచుకొంటోంది మనోళ్లే ..మొసలి కన్నీరు కురుస్తోంది మనోళ్లే .డాలర్ డ్రమ్స్ కాస్తా… డాలర్ నైట్ మెర్ అయ్యిందిబహుశా మరో రెండేళ్లకు ప్రతిభ వున్నవారికి ఇండియా లో ఫ్లైట్ ఎక్కేముందే గ్రీన్ కార్డు చేతిలో పెట్టి మేళతాళాలతో అమెరికా ఆహ్వానించవచ్చు .

రహదారికు .. అడ్డదారి కి తేడా ఇప్పటికైనా తెలుసుకొంటే అందరూ బాగుపడతారు .
ధన్యవాదములు 🙏
మీ నవీన్ నడిమింటి

Loading

 Save as PDF

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com
error: Content is protected !!