📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Friday, June 12, 2026
Visitors: 1,030,252  |  363 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుచీకటి బతుకుల్లో వెలుగుల కోసం.. ప్రధానికి రక్తాక్షరాల లేఖలు!బడికి వెళ్లాల్సిన బాల్యం.. బానిసత్వంలో మగ్గాలా?హౌస్‌వైఫ్ కాదు ‘దేశ నిర్మాత’: గృహిణుల సేవలకు సుప్రీంకోర్టు గౌరవంజమ్మూకశ్మీర్: అడవుల్లో ఉగ్రవాదుల కాంక్రీట్ బంకర్లు.. పేల్చివేసిన భద్రతా బలగాలుఅమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు: ‘హర్మూజ్ జలసంధి’ మూసివేత.. కుప్పకూలిన మార్కెట్లుLatest Breaking News from PressMeetతాజా వార్తలుచీకటి బతుకుల్లో వెలుగుల కోసం.. ప్రధానికి రక్తాక్షరాల లేఖలు!బడికి వెళ్లాల్సిన బాల్యం.. బానిసత్వంలో మగ్గాలా?హౌస్‌వైఫ్ కాదు ‘దేశ నిర్మాత’: గృహిణుల సేవలకు సుప్రీంకోర్టు గౌరవంజమ్మూకశ్మీర్: అడవుల్లో ఉగ్రవాదుల కాంక్రీట్ బంకర్లు.. పేల్చివేసిన భద్రతా బలగాలుఅమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు: ‘హర్మూజ్ జలసంధి’ మూసివేత.. కుప్పకూలిన మార్కెట్లు
Crime ⚡ AMP

గురుకుల పాఠశాలలో బాలికపై లైంగిక వేధింపులు

August 13, 2024 August 13, 2024 0 Views
SHARE: Share Tweet WhatsApp Telegram

జనగామ జిల్లా పాలకుర్తిలోని గురుకుల పాఠశాలలో క్యాటరింగ్ వర్కర్ గా పనిచేస్తున్న ఓ వ్యక్తి బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మండల కేంద్రంలోనీ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో చదువుకుంటున్న బాలికపై క్యాటరింగ్ వర్కర్ నిత్యం లైంగికంగా వేధించడంతో ఆ మైనర్ బాలిక సెలవులకు ఇంటికి వెళ్లి తిరిగి పాఠశాలకు రాకపోవడంతో విషయం బయటకు వచ్చింది. పాఠశాలకు ఎందుకు వెళ్లడం లేదని బాలిక తల్లిదండ్రులు ప్రశ్నించగా గురుకుల పాఠశాలలో క్యాటరింగ్ వర్కర్ గా పనిచేస్తున్న వ్యక్తి లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని బాలిక తల్లిదండ్రులకు వివరించింది. దీంతో బాలిక తల్లిదండ్రులు గురుకుల పాఠశాలకు వచ్చి గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ తో పాటు క్లాస్ టీచర్ ను ప్రశ్నించగా నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారని తమకి ఏమి తెలియదు అంటూ దాటవేశారని తెలిపారు. దీంతో వేధింపులకు పాల్పడిన క్యాటరింగ్ వర్కర్ పై పాలకుర్తి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై పోలీసులను వివరణ కోరగా మైనర్ బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!