📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Monday, July 27, 2026
Visitors: 1,533,593  |  681 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుభారత్‌లో ఇన్‌స్టాగ్రామ్‌ బ్యాన్ అవాస్తవం: కేంద్ర ప్రభుత్వం, PIB స్పష్టతఉద్యోగ ప్రకటన: 40 వివిధ రకాల పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి యుపిఎస్సి దరఖాస్తుల ఆహ్వానంనూతన కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి: అదనపు బాధ్యతలు అప్పగించిన కేంద్ర ప్రభుత్వంనీట్ వివాదం వేళ ధర్మేంద్ర ప్రధాన్ ఆవేదన: విద్యాశాఖ పదవికి రాజీనామా చేస్తూ భావోద్వేగ లేఖహనీమూన్ హత్యలు - క్షీణిస్తున్న సాంఘిక విలువలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలుLatest Breaking News from PressMeetతాజా వార్తలుభారత్‌లో ఇన్‌స్టాగ్రామ్‌ బ్యాన్ అవాస్తవం: కేంద్ర ప్రభుత్వం, PIB స్పష్టతఉద్యోగ ప్రకటన: 40 వివిధ రకాల పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి యుపిఎస్సి దరఖాస్తుల ఆహ్వానంనూతన కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి: అదనపు బాధ్యతలు అప్పగించిన కేంద్ర ప్రభుత్వంనీట్ వివాదం వేళ ధర్మేంద్ర ప్రధాన్ ఆవేదన: విద్యాశాఖ పదవికి రాజీనామా చేస్తూ భావోద్వేగ లేఖహనీమూన్ హత్యలు - క్షీణిస్తున్న సాంఘిక విలువలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
Telangana ⚡ AMP

తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా మాజీ ఐఏఎస్ అధికారి కేఎస్ శ్రీనివాసరాజు

July 1, 2024 July 1, 2024 0 Views
SHARE: Share Tweet WhatsApp Telegram

తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా మాజీ ఐఏఎస్ అధికారి కేఎస్ శ్రీనివాసరాజు నియామకం అయ్యారు. ఈ మేర‌కు ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శాంతి కుమారి ఉత్త‌ర్వులు జారీ చేశారు. మౌలిక వ‌స‌తులు, ప్రాజెక్టుల స‌ల‌హాదారుగా శ్రీనివాస‌రాజు నియామ‌కం అయ్యారు.తిరుమల తిరుపతి దేవస్థానం జేఈవోగా సుదీర్ఘకాలంగా పనిచేసిన కేఎస్‌ శ్రీనివాసరాజు వీఆర్‌ఎస్‌ తీసుకున్న సంగ‌తి తెలిసిందే. ఏపీ ఐఏఎస్‌ క్యాడర్‌లో 2001 బ్యాచ్‌కు చెందిన ఆయన 2011లో వైజాగ్‌ డిప్యూటీ కమిషనర్‌గా ఉన్న సమయంలో టీటీడీ జేఈవోగా నియమితులయ్యారు. ఏప్రిల్‌ 20వ తేదీన జేఈవోగా బాధ్యతలు తీసుకుని 2019 జూన్‌ వరకు ప్రభుత్వాలతో సంబంధం లేకుండా ఎనిమిదేళ్ల రెండు నెలలపాటు పనిచేశారు.

నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి, చంద్రబాబు నాయుడు ప్రభుత్వాల్లో జేఈవోగా విధులు నిర్వహించి, టీటీడీలో తనదైన ముద్ర వేశారు.అయితే జగన్‌ ప్రభుత్వం వచ్చాక ఆయన ఇంటర్‌ కేడర్‌పై తెలంగాణ రాష్ర్టానికి వ‌చ్చారు. తెలంగాణ నాలుగేండ్ల పాటు ర‌హ‌దారులు భ‌వ‌నాల శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శిగా విధులు నిర్వ‌ర్తించారు. మార్చి నెలతో డిప్యుటేషన్‌ గడువు ముగియడంతో పొడిగింపునకు క్యాట్‌ను ఆశ్రయించారు. అనుమతి రాకపోవడంతో ఏపీకి రాక తప్పలేదు. గత మే నెలలో ఏపీ సీఎస్‌కు రిపోర్టు చేశారు. టీటీడీ ఈవోగా వచ్చేందుకు తీవ్రస్థాయిలో ప్రయత్నాలు చేసినా కూటమి ప్రభుత్వం శ్యామలరావును ఈవోగా నియమించింది. దీంతో ఈనెల 19వ తేదీన శ్రీనివాసరాజు వీఆర్‌ఎస్‌ కోసం దరఖాస్తు చేసుకున్న నేపథ్యంలో గ‌త వారం ఆమోదం తెలుపుతూ ఏపీ ప్రభుత్వ సీఎస్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!