తూర్పుగోదావరి జిల్లా పరిసరాల్లో సంచరిస్తున్న పెద్దపులి తాజాగా పోలవరం అటవీ రేంజ్‌లోకి ప్రవేశించింది. కోరుకొండ నుంచి దేవీపట్నం వైపునకు మళ్లిన పులి, ప్రస్తుతం కొత్తవీధి, బూరుగుబంద గ్రామాల మధ్య ఉన్న కొండ ప్రాంతంలో ఉన్నట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు. పులి కదలికల నేపథ్యంలో గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని, పశువుల కాపరులు అడవిలోకి వెళ్లవద్దని ఇందుకూరు రేంజ్ అధికారి కొండలరావు హెచ్చరించారు. రాత్రి సమయాల్లో పొలాల వద్ద ఉండొద్దని, అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచించడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.
![]()




