భారతీయ రైల్వే చట్టం 1989 సెక్షన్ 141 ప్రకారం, అత్యవసర పరిస్థితుల్లో (ఆరోగ్య సమస్యలు, అగ్ని ప్రమాదం, ప్రాణాపాయం) మాత్రమే అలారం చైన్ లాగాలి. స్టేషన్ మిస్ అవ్వడం లేదా సరదా కోసం చైన్ లాగితే అది నేరంగా పరిగణించబడుతుంది. ఇలా దుర్వినియోగానికి పాల్పడితే ₹1000 జరిమానా లేదా ఒక సంవత్సరం వరకు జైలు శిక్ష, లేదా కొన్నిసార్లు రెండు విధించవచ్చు. ఒక రైలు ఆగిపోవడం వల్ల ఇతర రైళ్ల రాకపోకలకు అంతరాయం కలుగుతుంది కాబట్టి, ఆర్‌పిఎఫ్ (RPF) దీనిని సీరియస్ నేరంగా పరిగణించి కేసులు నమోదు చేస్తుంది.
![]()




