ఇటీవల డిజిటల్ గోల్డ్ కొనుగోళ్లకు మదుపర్లు ఎక్కువగా ఆసక్తి చూపుతుండగా, సెబీ ఈ ఉత్పత్తులపై అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. శనివారం విడుదల చేసిన ప్రకటనలో, డిజిటల్ లేదా ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లలో అందించే గోల్డ్ ఉత్పత్తులు సెబీ నియంత్రణ పరిధిలోకి రావని, వాటిని సెక్యూరిటీలు లేదా కమోడిటీ డెరివేటివ్‌లుగా పరిగణించరాదని స్పష్టం చేసింది. ఇలాంటి పెట్టుబడులు ఆర్థిక నష్టాలకు దారితీయవచ్చని హెచ్చరిస్తూ, మ్యూచువల్ ఫండ్స్ ద్వారా లభించే గోల్డ్ ETFs లేదా ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసీట్స్‌లో పెట్టుబడి పెట్టడం సురక్షితమని సూచించింది.
![]()
