రాష్ట్రంలో నౌకాశ్రయాలు, విమానాశ్రయాలు వంటి మౌలిక వసతుల (ఇన్‌ఫ్రా) ప్రాజెక్టుల నిర్మాణానికి నిర్దిష్ట కాలపరిమితి విధించి, ఆలోపు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. సచివాలయంలో పెట్టుబడులు, మౌలిక వసతులు, ఆర్టీసీపై నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. మూలపేట, రామాయపట్నం, మచిలీపట్నం పోర్టులు, దగదర్తి, కుప్పం విమానాశ్రయాల పురోగతిపై చర్చించారు. ప్రాజెక్టులను దశాబ్దాల తరబడి జాప్యం చేయడం సరికాదని, ఆర్టీసీని కూడా బలోపేతం చేయాలని సీఎం స్పష్టం చేశారు.
![]()




