📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Sunday, October 4, 2026
Visitors: 21,527  |  577 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుఎవరెస్ట్ జీలకర్ర పొడి రీకాల్.. బేకరీ లైసెన్స్ రద్దు: ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ కొరడాసింగపూర్‌లో ‘FirstDate’ ప్రభుత్వ ఉద్యోగుల కోసం డేటింగ్ యాప్..‘నాకు 55 ఏళ్లు.. ఎన్నికల్లో పోటీ చేస్తానో లేదో తెలియదు’ : అక్బరుద్దీన్‌ ఒవైసీకాక్‌పిట్ హీరో కెప్టెన్ స్మిత్ మచ్ఛార్‌కు సలాం: రూ. కోటి నజరానా ప్రకటించిన మ్యాన్‌కైండ్ ఫార్మానెస్లే ‘డైరీ వైట్నర్’ నాసిరకం: ల్యాబ్ పరీక్షల్లో ఫెయిల్.. సురక్షితం కాదన్న ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐLatest Breaking News from PressMeetతాజా వార్తలుఎవరెస్ట్ జీలకర్ర పొడి రీకాల్.. బేకరీ లైసెన్స్ రద్దు: ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ కొరడాసింగపూర్‌లో ‘FirstDate’ ప్రభుత్వ ఉద్యోగుల కోసం డేటింగ్ యాప్..‘నాకు 55 ఏళ్లు.. ఎన్నికల్లో పోటీ చేస్తానో లేదో తెలియదు’ : అక్బరుద్దీన్‌ ఒవైసీకాక్‌పిట్ హీరో కెప్టెన్ స్మిత్ మచ్ఛార్‌కు సలాం: రూ. కోటి నజరానా ప్రకటించిన మ్యాన్‌కైండ్ ఫార్మానెస్లే ‘డైరీ వైట్నర్’ నాసిరకం: ల్యాబ్ పరీక్షల్లో ఫెయిల్.. సురక్షితం కాదన్న ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ
Telangana ⚡ AMP

‘నాకు 55 ఏళ్లు.. ఎన్నికల్లో పోటీ చేస్తానో లేదో తెలియదు’ : అక్బరుద్దీన్‌ ఒవైసీ

October 4, 2026 14 hr ago 0 Views
SHARE: Share Tweet WhatsApp Telegram

అక్బరుద్దీన్‌ ఒవైసీ కీలక వ్యాఖ్యలు.. మక్కాలోనే కన్నుమూయాలనేది నా కోరిక

హైదరాబాద్‌: మజ్లిస్‌ శాసనసభాపక్ష నేత, చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఒవైసీ ఎన్నికల్లో తన భవిష్యత్‌ పోటీపై కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు 55 ఏళ్లు వచ్చాయని, తాను ముసలివాడినయ్యానని, ఇకపై ఎన్నికల్లో పోటీ చేస్తానో లేదో తెలియదని అన్నారు. బహుశా పోటీ చేయకపోవచ్చని వ్యాఖ్యానించారు.

పాతబస్తీలోని బండ్లగూడలో ఉన్న బారిస్టర్‌ ఫాతిమా ఒవైసీ ఎడ్యుకేషనల్‌ క్యాంపస్‌ (కేజీ నుంచి పీజీ)లో శుక్రవారం రాత్రి నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఒవైసీ విద్యాసంస్థల్లో ఇంటర్‌ పూర్తి చేసిన విద్యార్థులకు ధ్రువపత్రాల పంపిణీ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు.

‘12వ తరగతి వరకే చదివా.. సిగ్గుపడను’

తాను 12వ తరగతి వరకే చదువుకున్నానని చెప్పుకోవడానికి ఎలాంటి సిగ్గుపడనని అక్బరుద్దీన్‌ ఒవైసీ అన్నారు. విద్యాసంస్థలను నిర్మించడంలో తాను చేసిన కృషిని ప్రస్తావిస్తూ.. ఒవైసీ విద్యాసంస్థల భవనాలను ఆకాశాన్నంటే స్థాయిలో నిర్మించానని పేర్కొన్నారు.

తన పరువుతో కొందరు ఆటలాడుతున్నారని, ఇబ్బందులు సృష్టించేందుకు కుయుక్తులు పన్నుతున్నారని ఆరోపించారు. అయితే ఎవరిముందూ తలవంచే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

‘ఈ దేశం అందరిదీ’

ఈ దేశం అందరిదీ అని, ప్రతి ఒక్కరికీ సమాన హక్కులు ఉన్నాయని అక్బరుద్దీన్‌ ఒవైసీ అన్నారు. తాను ఉన్నా లేకపోయినా ఒవైసీ విద్యాసంస్థల భవనాల్లో తన గళం శాశ్వతంగా నిలిచిపోతుందని వ్యాఖ్యానించారు.

అన్నీ వదిలేసి మక్కాలోనే ఉండాలని ఉందని, అక్కడే కన్నుమూయాలన్నది తన కోరిక అని ఆయన భావోద్వేగంతో పేర్కొన్నారు. ఆయన వ్యాఖ్యలు కార్యక్రమంలో చర్చనీయాంశంగా మారాయి.

Loading

 Save as PDF

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com
error: Content is protected !!