📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Wednesday, September 23, 2026
Visitors: 9,386  |  797 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలురిమ్స్‌లో ముగ్గురు శిశువుల మృతి.. ప్రభుత్వ వైఫల్యమే : డా. చుంచు రాజ్ కిరణ్ప్రేమపెళ్లిళ్లను నిషేధిస్తూ గ్రామసభ తీర్మానంతీవ్ర వాయుగుండం.. ఉత్తరాంధ్రకు రెడ్ అలర్ట్తెలంగాణకు భారీ వర్ష సూచన.. 18 జిల్లాలకు రెడ్ అలర్ట్ఢిల్లీలో బాలికలపై దారుణాలు.. ఇకనైనా ముందస్తు భద్రత చర్యలు అవసరం : బాలల హక్కుల సంఘంLatest Breaking News from PressMeetతాజా వార్తలురిమ్స్‌లో ముగ్గురు శిశువుల మృతి.. ప్రభుత్వ వైఫల్యమే : డా. చుంచు రాజ్ కిరణ్ప్రేమపెళ్లిళ్లను నిషేధిస్తూ గ్రామసభ తీర్మానంతీవ్ర వాయుగుండం.. ఉత్తరాంధ్రకు రెడ్ అలర్ట్తెలంగాణకు భారీ వర్ష సూచన.. 18 జిల్లాలకు రెడ్ అలర్ట్ఢిల్లీలో బాలికలపై దారుణాలు.. ఇకనైనా ముందస్తు భద్రత చర్యలు అవసరం : బాలల హక్కుల సంఘం
Adilabad ⚡ AMP

రిమ్స్‌లో ముగ్గురు శిశువుల మృతి.. ప్రభుత్వ వైఫల్యమే : డా. చుంచు రాజ్ కిరణ్

September 23, 2026 14 hr ago 0 Views
SHARE: Share Tweet WhatsApp Telegram

ఘటనపై నిష్పక్షపాత దర్యాప్తు జరపాలి: జనసేన కో-ఆర్డినేటర్ డా. చుంచు రాజ్ కిరణ్

ప్రెస్ మీట్ న్యూస్, మంచిర్యాల, సెప్టెంబర్ 23: ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలోని నవజాత శిశువుల ప్రత్యేక సంరక్షణ విభాగంలో మంటలు చెలరేగి ముగ్గురు పసికందులు మృతి చెందడం అత్యంత విషాదకరమని జనసేన పార్టీ పెద్దపల్లి, ఆదిలాబాద్ పార్లమెంట్ కో-ఆర్డినేటర్ డా. చుంచు రాజ్ కిరణ్ అన్నారు. ఈ ఘటన ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని ఆయన ఆరోపించారు.

ఘటనపై దర్యాప్తును వేగవంతం చేసి బాధిత కుటుంబాలకు తగిన సహాయం అందించాలని, చికిత్స పొందుతున్న చిన్నారులకు మెరుగైన వైద్యం అందించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు రిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన డా. రాజ్ కిరణ్.. రిమ్స్ డైరెక్టర్ డా. జైసింగ్ రాథోడ్, డీఎంఅండ్‌హెచ్‌ఓ డా. సాధన, ప్రోగ్రాం డైరెక్టర్ డా. తిప్పస్వామితో ప్రమాదానికి సంబంధించిన అంశాలపై చర్చించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జీవితాన్ని ప్రారంభించకముందే పసికందులు ప్రాణాలు కోల్పోవడం హృదయ విదారకమన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఇతర చిన్నారులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

ఈ ఘటనను కేవలం ప్రమాదంగా పరిగణించి ముగించకుండా, పూర్తి స్థాయిలో కారణాలను వెలికితీయాలని రాజ్ కిరణ్ కోరారు. ప్రమాదానికి అసలు కారణం ఏమిటి, ఆసుపత్రి నిర్వహణలో లోపాలు ఉన్నాయా, భద్రతా ప్రమాణాలు సక్రమంగా అమలయ్యాయా అనే అంశాలపై నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు.

ముఖ్యంగా ఐసీయూ (ICU), ఎన్‌ఐసీయూ (NICU), ఎస్‌ఎన్‌సీయూ (SNCU) వంటి అత్యంత సున్నితమైన విభాగాల్లో విద్యుత్ వ్యవస్థలు, ఏసీలు, ఫైర్ సేఫ్టీ పరికరాలు, అత్యవసర మార్గాలు, అలారం వ్యవస్థలను క్రమం తప్పకుండా తనిఖీ చేయాలని సూచించారు.

భద్రతా ప్రమాణాల్లో నిర్లక్ష్యం లేదా నిర్వహణ లోపాలు బయటపడితే బాధ్యులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రత్యేక ఫైర్, ఎలక్ట్రికల్ సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ప్రమాదంలో మృతి చెందిన చిన్నారుల కుటుంబాలకు ప్రభుత్వం తగిన ఆర్థిక సహాయం అందించాలని, బాధిత కుటుంబాలకు అవసరమైన వైద్య, ఇతర సహాయాన్ని అందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని రాజ్ కిరణ్ కోరారు.

ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఉమ్మడి ఆదిలాబాద్ ఉపాధ్యక్షుడు ఉడుగు రవితేజతో పాటు నాయకులు వినయ్, రవీందర్, శ్రీనివాస్, వంశీ తదితరులు పాల్గొన్నారు.

Loading

 Save as PDF

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com
error: Content is protected !!