📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Tuesday, September 22, 2026
Visitors: 4,683  |  493 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుఢిల్లీలో బాలికలపై దారుణాలు.. ఇకనైనా ముందస్తు భద్రత చర్యలు అవసరం : బాలల హక్కుల సంఘంఅమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2026సస్పెండ్ అయిన ఉపాధ్యాయుడికి ‘ఉత్తమ ఉపాధ్యాయ’ అవార్డా? ఏఐయస్బీ ఆగ్రహంపెట్రోల్ బంకుల్లో రూ.2 వేలపై UPI బంద్? అదంతా తప్పుడు ప్రచారమే: IndianOilమహిళలను వేధిస్తే.. తీవ్ర పరిణామాలు తప్పవు: యోగిLatest Breaking News from PressMeetతాజా వార్తలుఢిల్లీలో బాలికలపై దారుణాలు.. ఇకనైనా ముందస్తు భద్రత చర్యలు అవసరం : బాలల హక్కుల సంఘంఅమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2026సస్పెండ్ అయిన ఉపాధ్యాయుడికి ‘ఉత్తమ ఉపాధ్యాయ’ అవార్డా? ఏఐయస్బీ ఆగ్రహంపెట్రోల్ బంకుల్లో రూ.2 వేలపై UPI బంద్? అదంతా తప్పుడు ప్రచారమే: IndianOilమహిళలను వేధిస్తే.. తీవ్ర పరిణామాలు తప్పవు: యోగి
Mancherial ⚡ AMP

సస్పెండ్ అయిన ఉపాధ్యాయుడికి ‘ఉత్తమ ఉపాధ్యాయ’ అవార్డా? ఏఐయస్బీ ఆగ్రహం

September 21, 2026 1 days ago 0 Views
SHARE: Share Tweet WhatsApp Telegram

జిల్లా విద్యాశాఖ తీరుపై ఏఐయస్బీ ఆగ్రహం.. కలెక్టర్‌కు ఫిర్యాదు

మంచిర్యాల ప్రెస్ మీట్ న్యూస్ ప్రతినిధి, సెప్టెంబర్ 21: విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించారనే ఆరోపణలతో గతంలో సస్పెన్షన్‌కు గురైన ఉపాధ్యాయుడికి వేమనపల్లి మండల స్థాయిలో ‘ఉత్తమ ఉపాధ్యాయుడు’ ప్రశంసా పత్రం అందజేయడంపై అఖిల భారత విద్యార్థి బ్లాక్ (ఏఐయస్బీ) మంచిర్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి కనుకుంట్ల సన్నీ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ అంశంపై సోమవారం మంచిర్యాల కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్లకు ఆయన ఫిర్యాదు చేశారు. రెండు సంవత్సరాల క్రితం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో పనిచేసిన సదరు ఉపాధ్యాయుడిపై విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించారనే ఆరోపణలతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సన్నీ గౌడ్ తెలిపారు. ఈ ఘటనపై విద్యాశాఖ విచారణ చేపట్టి ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేసిన అనంతరం వేమనపల్లి మండలం ముల్కలపేటకు బదిలీ చేసినట్లు ఆయన పేర్కొన్నారు.

అయితే ఇటీవల ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా అదే ఉపాధ్యాయుడికి వేమనపల్లి మండల స్థాయిలో ‘ఉత్తమ ఉపాధ్యాయుడు’ ప్రశంసా పత్రం అందజేశారని సన్నీ గౌడ్ ఆరోపించారు. సస్పెన్షన్‌కు గురైన వ్యక్తికి ఈ అవార్డు ఎలా ఇచ్చారో విద్యాశాఖ అధికారులు స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై జిల్లా అధికారులకు సమాచారం లేకుండానే అవార్డు ఇచ్చారా? లేక ఎంపిక వెనుక ఎవరైనా ఉన్నారా? అనే అంశాలపై పూర్తిస్థాయి విచారణ జరపాలని కోరారు.

అవార్డు ఎంపికకు బాధ్యులైన అధికారుల పాత్రపైనా విచారణ జరపాలని ఏఐయస్బీ నాయకులు డిమాండ్ చేశారు. సదరు ఉపాధ్యాయుడిపై, వేమనపల్లి ఎంఈఓపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. విద్యార్థుల భద్రత, పాఠశాలల్లో క్రమశిక్షణ విషయంలో విద్యాశాఖ అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని సన్నీ గౌడ్ అన్నారు. ప్రజావాణిలో చేసిన ఫిర్యాదుపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు.

విచారణ జరిపి చర్యలు తీసుకోకపోతే ఆధారాలతో రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులను కలిసి ఫిర్యాదు చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐయస్బీ నాయకులు పాల్గొన్నారు.

Loading

 Save as PDF

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com
error: Content is protected !!