📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Friday, September 18, 2026
Visitors: 10,225  |  562 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలురాజీవ్ యువ వికాసంపై కీలక అప్‌డేట్.. నవంబర్ 19 నుంచి రూ.లక్ష సాయంభారత్‌పై 100 శాతం టారిఫ్‌లకు అమెరికా బిల్లుయూపీఐపై ఛార్జీలు.. ఎవరు చెల్లించాలి?రైల్వే సీజన్ టికెట్ల బుకింగ్‌లో కొత్త సౌకర్యం.. ఇతరుల కోసం కూడా టికెట్ తీసుకోవచ్చుప్రజా విశ్వాసమే న్యాయవ్యవస్థకు నిజమైన సంపద: సీజేఐ జస్టిస్ సూర్యకాంత్Latest Breaking News from PressMeetతాజా వార్తలురాజీవ్ యువ వికాసంపై కీలక అప్‌డేట్.. నవంబర్ 19 నుంచి రూ.లక్ష సాయంభారత్‌పై 100 శాతం టారిఫ్‌లకు అమెరికా బిల్లుయూపీఐపై ఛార్జీలు.. ఎవరు చెల్లించాలి?రైల్వే సీజన్ టికెట్ల బుకింగ్‌లో కొత్త సౌకర్యం.. ఇతరుల కోసం కూడా టికెట్ తీసుకోవచ్చుప్రజా విశ్వాసమే న్యాయవ్యవస్థకు నిజమైన సంపద: సీజేఐ జస్టిస్ సూర్యకాంత్
Editorial ⚡ AMP

స్నేహం ఓ దివ్య ఔషధం: మనసును ఊరడించే తీపి బంధం ‘మైత్రి’

August 2, 2026 August 2, 2026 0 Views
SHARE: Share Tweet WhatsApp Telegram

ప్రపంచంలో అనేక రకాల బంధాలు ఉన్నప్పటికీ, ఏ స్వార్థం లేకుండా, కులమతాల సరిహద్దులు లేకుండా ఏర్పడే ఏకైక పవిత్రమైన బంధం ‘స్నేహం’. ప్రతి సంవత్సరం ఫ్రెండ్‌షిప్ డే, బెస్ట్ ఫ్రెండ్స్ డే వంటి సందర్భాలు వచ్చినప్పుడు మనం మన మిత్రులను ఎంతో ప్రేమగా గుర్తుచేసుకుంటాం. “హి ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్” అని నలుగురిలో గర్వంగా పరిచయం చేస్తాం. అసలు స్నే‘హితుడు’ అనే పదానికి నిజమైన అర్థం.. హితవు చెప్పడం, జీవితంలో సరైన బాట చూపించడం.

తేనెకన్నా తీయనైన అనుభూతి

“స్నేహానికన్నా మిన్నా లోకాన లేదురా” అన్న కవి మాటలు ఊరికే రాలేదు. మనసు పెట్టి వింటే స్నేహం మాధుర్యం తేనెకన్నా తీయగా ఉంటుంది. ‘స్నేహం’ అనే మాటలోనే “చెరో అక్షరం మనం” అనే భావన దాగి ఉందంటే ఈ బంధం ఎంత అద్భుతమైనదో అర్థం చేసుకోవచ్చు. బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం ఇలా ఏ వయసులోనైనా జీవితంలో ఎదురయ్యే తుఫాన్లకు భయపడకుండా కొండంత అండగా వెంట నిలిచేదే నిజమైన దోస్తీ. అందుకే హిందీలో కూడా “దోస్త్ మేరా దోస్త్.. తూ హై మేరీ జాన్” అని ఎంతో మధురంగా వర్ణించారు.

వైరి వర్గాలను కలిపే మైత్రి శక్తి

మైత్రి సత్ఫలితాలు కేవలం వ్యక్తుల మధ్యనే కాదు, రాజకీయంగా, విభిన్న వ్యవస్థలు మరియు దేశాల మధ్య కూడా సానుకూల దృక్పథాన్ని నింపుతాయి. యుద్ధాలు, కలహాలతో సాధించేది ఏమీ లేదని, మైత్రితోనే అసాధ్యాలను సైతం సాధించవచ్చని అనేక చారిత్రక ఉదంతాలు నిరూపించాయి. ఇక కళాశాల రోజుల్లో మంచి సోపతి వల్ల యువతలో నాయకత్వ లక్షణాలు పెంపొందడమే కాకుండా ఆలోచనల్లో పరిణతి పెరుగుతుంది. సజ్జన సాంగత్యం ప్రతి ఒక్కరి వ్యక్తిత్వ వికాసానికి ఎంతగానో దోహదపడుతుంది.

జీవితానికి దిక్సూచి.. విజయానికి బాటలు

జీవితంలో ఏమీ తోచని అగమ్యగోచర పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఒక మంచి స్నేహితుడు మార్గదర్శిగా, దిక్సూచిగా మారి సరైన దారి చూపిస్తాడు. ప్రపంచంలో ఎందరో మహానుభావులు, వ్యాపార దిగ్గజాలు బెస్ట్ ఫ్రెండ్షిప్‌తోనే ఉన్నత లక్ష్యాలను సాధించి విజేతలుగా నిలిచారు.

ఇక యుక్తవయస్సుకు వచ్చిన పిల్లలతో తల్లిదండ్రులు స్నేహితుల్లా మెలిగితే, వారు ఎలాంటి దాపరికం లేకుండా ప్రతి విషయాన్ని భయం లేకుండా పంచుకునే వెసులుబాటు కలుగుతుంది. అంతేకాదు, ఉదయాన్నే చేసే ‘మార్నింగ్ వాక్’ కూడా ఎంతోమంది కొత్త మిత్రులను పరిచయం చేస్తూ, మనసుకు ఆహ్లాదాన్ని అందిస్తుంది.

నిస్తేజాన్ని పోగొట్టే దివ్య ఔషధం

“ఏరా.. ఏం చేస్తున్నావ్? అలా సెంటర్ దాకా వెళ్లి వద్దాం పదా!” అని భుజం తట్టి, డిప్రెషన్ లేదా నిస్తేజంలో ఉన్న మిత్రుడిని బయటకు తెచ్చి స్వేచ్ఛాయుతమైన వాతావరణంలో ఊసులు పంచుకునేలా చేసేది ‘స్నేహం’ అనే దివ్య ఔషధమే. ప్రాణాలను సైతం కాపాడే అమృతం లాంటి ఒక మంచి స్నేహితుడిని కలిగి ఉండటం జీవితంలో లభించే అతిపెద్ద ఆభరణం.

విశ్లేషణ / వ్యాసకర్త:

మాచన రఘునందన్

పౌర సరఫరాల శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్ డిప్యూటీ తాసిల్దార్ & టొబాకో కంట్రోల్ హీరో అవార్డు గ్రహీత.

Loading

 Save as PDF

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com
error: Content is protected !!