పశ్చిమ బెంగాల్‌లో తాము భాజపాతో కాదు, ఆ పార్టీకి మద్దతుగా పనిచేసిన ఎన్నికల సంఘంతో పోరాడామని సీఎం మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. ఈవీఎంల తారుమారు, అధికారుల బదిలీలు, ఓటర్ల తొలగింపు ద్వారా ప్రజాస్వామ్యాన్ని కాలరాశారని మండిపడ్డారు. లెక్కింపులో అవకతవకలు జరిగాయని, 100 స్థానాల్లో తమ గెలుపును కాజేశారని ఆరోపించారు. సీఎం పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తూ, ఇండియా కూటమి బలోపేతానికి కృషి చేస్తానన్నారు. ఎన్నికల అనంతర హింసపై నిజనిర్ధరణకు 10 మందితో కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ఆమె ప్రకటించారు.
![]()




