పంజాబ్‌లోని పాటియాలా జిల్లా రాజ్‌పురా సమీపంలో జరిగిన భారీ పేలుడు కలకలం రేపింది. ఢిల్లీ-రాజ్‌పురా రైల్వే ట్రాక్ సమీపంలోని ఖాళీ ప్రదేశంలో జరిగిన ఈ ఘటనలో ఓ అనుమానిత వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు, బాంబు స్క్వాడ్ ఘటనా స్థలం నుండి ఒక సిమ్ కార్డును స్వాధీనం చేసుకున్నాయి. ఎస్ఎస్‌పీ వరుణ్ శర్మ ఆధ్వర్యంలో ఫోరెన్సిక్ బృందాలు నమూనాలను సేకరించాయి. ఇది ప్రమాదమా లేక ఉగ్రవాద కుట్ర ఉందా అనే కోణంలో భద్రతా సంస్థలు దర్యాప్తును ముమ్మరం చేశాయి.
![]()




