ఛత్తీస్‌గఢ్‌లోని జష్‌పూర్ జిల్లా ఆరా కొండల అటవీ ప్రాంతంలో సోమవారం మధ్యాహ్నం ఒక చార్టర్డ్ విమానం ఘోర ప్రమాదానికి గురైంది. ప్రయాణిస్తున్న సమయంలో అదుపుతప్పి చెట్టును, కొండను ఢీకొట్టడంతో విమానం కుప్పకూలి మంటల్లో చిక్కుకుంది. ఈ ఘటనలో పైలట్, కో-పైలట్ మరణించి ఉండవచ్చని భావిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. విమాన ప్రయాణికుల వివరాలు, ప్రమాద కారణాలపై అధికారులు విచారణ జరుపుతున్నారు.
![]()




