హైదరాబాద్ పోలీసులు నిర్వహించిన ‘ఆపరేషన్ ఆక్టోపస్-2.0’లో భారీ సైబర్ మోసాల నెట్‌వర్క్ వెలుగుచూసింది. డిజిటల్ అరెస్ట్, ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న ముఠాలకు సహకరిస్తున్న 32 మంది బ్యాంకు అధికారులు సహా మొత్తం 52 మందిని అరెస్ట్ చేసినట్లు సీపీ సజ్జనార్ తెలిపారు. 9 రాష్ట్రాల్లో ఏకకాలంలో జరిపిన దాడుల్లో రూ.150 కోట్ల మేర అక్రమ లావాదేవీలు జరిగిన 350 మ్యూల్ ఖాతాలను గుర్తించారు. నిబంధనలకు విరుద్ధంగా ఖాతాలు తెరిచిన వివిధ ప్రముఖ బ్యాంకుల మేనేజర్లపై పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నారు.
![]()




