📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Tuesday, May 26, 2026
Visitors: 824,242  |  450 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుతమిళనాడులో మైనర్ బాలిక హత్యాచారం కేసు: నిందితుడికి డబుల్ డెత్ పెనాల్టీవిప్రో (Wipro) మెగా వాక్-ఇన్ డ్రైవ్దేశంలో మరో 100 కొత్త విమానాశ్రయాలు: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుసూర్యాస్త్ర రాకెట్ ప్రయోగం సక్సెస్: స్వదేశీ రక్షణ రంగంలో భారత్ సరికొత్త మైలురాయిఇన్ఫోసిస్ (Infosys BPM) వాక్-ఇన్ డ్రైవ్ Latest Breaking News from PressMeetతాజా వార్తలుతమిళనాడులో మైనర్ బాలిక హత్యాచారం కేసు: నిందితుడికి డబుల్ డెత్ పెనాల్టీవిప్రో (Wipro) మెగా వాక్-ఇన్ డ్రైవ్దేశంలో మరో 100 కొత్త విమానాశ్రయాలు: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుసూర్యాస్త్ర రాకెట్ ప్రయోగం సక్సెస్: స్వదేశీ రక్షణ రంగంలో భారత్ సరికొత్త మైలురాయిఇన్ఫోసిస్ (Infosys BPM) వాక్-ఇన్ డ్రైవ్ 
Andhra ⚡ AMP

ఏపీ ఎంప్లాయిమెంట్ ఆర్డర్-2025: 95% ఉద్యోగాలు స్థానికులకే!

April 8, 2026 April 8, 2026 0 Views
SHARE: Share Tweet WhatsApp Telegram

రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ నియామకాల్లో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. కొత్తగా జారీ చేయనున్న గెజిట్ ప్రకారం, ఇకపై నేరుగా చేపట్టే (Direct Recruitment) అన్ని స్థాయిల ఉద్యోగాలలో 95 శాతం కోటా స్థానికులకు మాత్రమే దక్కుతుంది. మిగిలిన 5 శాతం మాత్రమే స్థానికేతరులకు (Open Category) కేటాయించబడుతుంది. గతంలో జిల్లా స్థాయి పోస్టుల్లో 80:20, జోనల్ స్థాయిలో 70:30 గా ఉన్న నిష్పత్తిని స్థానికులకు మరింత మేలు చేసేలా మార్చారు. ఈ నెల 10న జరిగే కేబినెట్ సమావేశంలో దీనికి అధికారిక ఆమోదం లభించనుంది. దీనివల్ల స్థానిక నిరుద్యోగులకు తమ సొంత జిల్లాల్లోనే ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయి.26 జిల్లాల ప్రాతిపదికన కొత్త గెజిట్రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న జిల్లాలకు అదనంగా మరో రెండు కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో మొత్తం 26 జిల్లాలను ప్రామాణికంగా తీసుకుంటూ కొత్త గెజిట్ నోటిఫికేషన్ కోసం కేంద్రానికి ప్రతిపాదనలు పంపనున్నారు. త్వరలో విడుదల కానున్న ‘జాబ్ క్యాలెండర్’ ఉద్యోగాల నోటిఫికేషన్ నాటికి ఈ గెజిట్ వస్తే, దాని ప్రకారమే నియామకాలు చేపడతారు. స్థానికత నిర్ధారణకు ఇప్పటివరకు ఉమ్మడి 13 జిల్లాలను ప్రామాణికంగా తీసుకోగా, ఇకపై కొత్త జిల్లాలే ప్రాతిపదిక కానున్నాయి.క్యాడర్ల వారీగా పోస్టుల విభజనఉద్యోగుల స్థాయిని బట్టి పోస్టులను మూడు ప్రధాన కేటగిరీలుగా విభజించారు:జిల్లా స్థాయి: జూనియర్ అసిస్టెంట్ మరియు దాని కంటే దిగువ స్థాయి పోస్టులు. సెకండరీ గ్రేడ్ టీచర్లు (SGT), స్కూల్ అసిస్టెంట్లు, గ్రేడ్-2 హెడ్ మాస్టర్ పోస్టులు కూడా జిల్లా క్యాడర్ లోనే ఉంటాయి.జోనల్ స్థాయి: జూనియర్ అసిస్టెంట్ పైన ఉండే సూపరింటెండెంట్ మరియు మొదటి స్థాయి గెజిటెడ్ పోస్టులు.మల్టీ జోన్ స్థాయి: సూపరింటెండెంట్ కంటే పైన ఉండే డిప్యూటీ కలెక్టర్ మరియు తత్సమాన కేటగిరీ పోస్టులు. గతంలో రాష్ట్ర స్థాయి పోస్టులుగా ఉన్నవి ఇకపై మల్టీ జోన్ పోస్టులుగా మారతాయి.స్థానికత (Locality) నిర్ధారణ ఎలా?అభ్యర్థుల స్థానికతను నిర్ణయించేందుకు ‘ఏడేళ్ల నిబంధన’ను ప్రభుత్వం ఖరారు చేసింది:విద్యార్హత ప్రాతిపదిక: ఏదైనా పోస్టుకు నిర్ణయించిన విద్యార్హత (ఉదాహరణకు ఇంటర్) కంటే ముందు వరుసగా ఏడేళ్ల చదువును పరిశీలిస్తారు. ఆ ఏడేళ్లలో ఎక్కడ నాలుగేళ్లు చదివితే ఆ ప్రాంతాన్నే స్థానికంగా నిర్ధారిస్తారు.నివాస ప్రాతిపదిక: విద్యార్హతలు లేని పోస్టులకైతే నివాస ప్రాంతాన్ని తీసుకుంటారు. ఏడేళ్లు ఎక్కడా చదవకపోతే రాష్ట్రంలోని నివాస ప్రాంతాన్ని పరిగణిస్తారు.ప్రత్యేక వెసులుబాటు: అంధత్వం, వినికిడి లోపం ఉన్న వారు ప్రత్యేక పాఠశాలల్లో చదివితే, వారి తల్లిదండ్రుల స్వస్థలాన్ని స్థానికతగా గుర్తిస్తారు.జోన్లు మరియు మల్టీ జోన్ల విభజనరాష్ట్రంలోని 26 జిల్లాలను ఆరు జోన్లు మరియు రెండు మల్టీ జోన్లుగా విభజించారు:

మల్టీ జోన్జోన్పరిధిలోకి వచ్చే జిల్లాలుమల్టీ జోన్-1జోన్-1శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి జోన్-2అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, కాకినాడ, కోనసీమ జోన్-3పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణామల్టీ జోన్-2జోన్-4గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జోన్-5తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్సార్ కడప జోన్-6నంద్యాల, అనంతపురం, కర్నూలు, శ్రీసత్యసాయి

ఉపాధ్యాయుల సర్దుబాటు: ఈ ఏడాది బదిలీలు ఉండవుకొత్త జిల్లాల గెజిట్ అమలు నేపథ్యంలో ఉద్యోగుల సర్దుబాటు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇందుకోసం ‘ఈ-హ్యూమన్ రిసోర్స్ మాస్టర్’ (e-HRM) పోర్టల్‌లో అందరి వివరాలు నమోదు చేస్తున్నారు. ఈ ఏడాది ఉపాధ్యాయులకు సాధారణ బదిలీలు ఉండే అవకాశం లేదు. ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన నియమితులైన టీచర్లను, ప్రస్తుతం ఉన్న కొత్త జిల్లాల ప్రకారం కేవలం సర్దుబాటు (Adjustment) చేస్తారు. ఉద్యోగుల నుండి ఐచ్ఛికాలు (Options) తీసుకుని, సీనియారిటీ ప్రకారం పోస్టులను కేటాయిస్తారు.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!