బ్రిటిష్ కాలం నాటి పురాతన చట్టాలకు స్వస్తి పలుకుతూ కేంద్ర ప్రభుత్వం మరొక సంచలన ర సంస్కరణకు శ్రీకారం చుట్టింది. 135 సంవత్సరాల క్రితం 1891లో తీసుకొచ్చిన ‘బ్యాంకర్స్ బుక్స్ ఎవిడెన్స్ యాక్ట్’ (Bankers’ Books Evidence Act, 1891) స్థానంలో నూతనంగా రూపొందించిన ‘బ్యాంకర్స్ బుక్స్ ఎవిడెన్స్ బిల్లు, 2026’ (Bankers’ Books Evidence Bill, 2026) పరిశీలన మరియు ఆమోదం కోసం లోక్‌సభలో సిద్ధమైంది.
డిజిటల్ యుగానికి అనుగుణంగా చట్టబద్ధత
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో ప్రవేశపెట్టిన ఈ బిల్లు, నేటి ఆధునిక డిజిటల్ బ్యాంకింగ్ అవసరాలకు అనుగుణంగా రూపుదిద్దుకుంది. 1891 నాటి చట్టం కేవలం కాగితపు బ్యాంక్ లెడ్జర్ల (Paper Bank Ledgers) కాలానికి అనుగుణంగా ఉండేది. కానీ, సరికొత్త బిల్లు ద్వారా:
- ఎలక్ట్రానిక్ రికార్డులకు గుర్తింపు: డిజిటల్ రూపంలో ఉన్న బ్యాంకింగ్ రికార్డులు, ఆన్‌లైన్ లావాదేవీలు మరియు ఇతర ఆధునిక ఎలక్ట్రానిక్ డేటాను కోర్టుల్లో అధికారిక సాక్ష్యాలుగా (Legal Evidence) సమర్పించేందుకు స్పష్టమైన చట్టపరమైన నిబంధనలను కల్పిస్తున్నారు.
కోర్టు విచారణల్లో వేగం.. బ్యాంకులకు ఊరట
ఈ నూతన చట్టం అమలులోకి రావడం వల్ల బ్యాంకింగ్ మరియు న్యాయ వ్యవస్థల్లో గణనీయమైన మార్పులు రానున్నాయి:
- ఒరిజినల్ రికార్డుల అవసరం లెస్: ప్రతి న్యాయపరమైన కేసు విచారణలో భౌతిక రూపంలో ఉండే ఒరిజినల్ బ్యాంక్ రికార్డులను, భారీ లెడ్జర్ పుస్తకాలను కోర్టుకు తీసుకురావాల్సిన అవసరం తప్పుతుంది.
- బ్యాంకు అధికారుల సమయం ఆదా: విచారణ నిమిత్తం బ్యాంకు అధికారులు తరచూ కోర్టుల చుట్టూ తిరగాల్సిన పనిలేకుండా పరిమితులు విధిస్తున్నారు.
- త్వరితగతిన తీర్పులు: బ్యాంకింగ్ రికార్డులకు సంబంధించిన కోర్టు విచారణలు మరింత సులభంగా, వేగవంతంగా మరియు సమర్థవంతంగా పూర్తయ్యేందుకు ఈ సంస్కరణ దోహదపడుతుంది.
ఈ బిల్లును నిన్న ఆర్థిక మంత్రి లోక్‌సభలో ప్రవేశపెట్టగా, నేడు సభలో సమగ్ర పరిశీలన మరియు ఆమోదం కోసం అజెండాలో చేర్చారు. పార్లమెంట్ ఆమోదం పొందిన తర్వాత ఈ కొత్త చట్టం దేశవ్యాప్తంగా అమలులోకి రానుంది.
![]()




