📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Thursday, July 2, 2026
Visitors: 1,280,711  |  937 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుఆపరేషన్ ముస్కాన్: చిన్నారుల పెదవులపై నవ్వులు పూయించే మహా యజ్ఞంమైనర్లపై థర్డ్ డిగ్రీ, లైంగిక వేధింపులకు పాల్పడిన బెంగళూరు ఎస్ఐ పోక్సో కింద అరెస్ట్బైక్ సైడ్ బాక్స్‌లో బాబును కూర్చోబెట్టి తండ్రి ప్రయాణం.. క్లాస్ పీకిన పోలీసులుజులై 1 నుంచి కొత్త ఆర్థిక రూల్స్: ఐటీఆర్ గడువు, ఉచిత ఆధార్ అప్‌డేట్.. మారనున్న క్రెడిట్ కార్డ్, పాస్‌పోర్ట్ ఫీజులుసీబీఎస్‌ఈ త్రీ లాంగ్వేజ్ పాలసీపై కొత్త గైడ్‌లైన్స్Latest Breaking News from PressMeetతాజా వార్తలుఆపరేషన్ ముస్కాన్: చిన్నారుల పెదవులపై నవ్వులు పూయించే మహా యజ్ఞంమైనర్లపై థర్డ్ డిగ్రీ, లైంగిక వేధింపులకు పాల్పడిన బెంగళూరు ఎస్ఐ పోక్సో కింద అరెస్ట్బైక్ సైడ్ బాక్స్‌లో బాబును కూర్చోబెట్టి తండ్రి ప్రయాణం.. క్లాస్ పీకిన పోలీసులుజులై 1 నుంచి కొత్త ఆర్థిక రూల్స్: ఐటీఆర్ గడువు, ఉచిత ఆధార్ అప్‌డేట్.. మారనున్న క్రెడిట్ కార్డ్, పాస్‌పోర్ట్ ఫీజులుసీబీఎస్‌ఈ త్రీ లాంగ్వేజ్ పాలసీపై కొత్త గైడ్‌లైన్స్
National ⚡ AMP

ఆపరేషన్ ముస్కాన్: చిన్నారుల పెదవులపై నవ్వులు పూయించే మహా యజ్ఞం

July 2, 2026 13 hr ago 0 Views
SHARE: Share Tweet WhatsApp Telegram

(బాలల హక్కుల సంఘం అధ్యక్షురాలు అనురాధ రావు ప్రత్యేక విశ్లేషణ)

దేశవ్యాప్తంగా జులై 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు అత్యంత ప్రతిష్టాత్మకంగా ‘ఆపరేషన్ ముస్కాన్’ (Operation Muskan) కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇది కేవలం ఒక సాధారణ పోలీస్ డ్రైవ్ కాదు; కన్నవారికి దూరమై అంధకారంలో మగ్గుతున్న వేలాది మంది చిన్నారుల భవిష్యత్తుకు వెలుగునిచ్చే ఒక ప్రత్యేక రక్షణ కార్యక్రమం. తప్పిపోయిన పిల్లలను గుర్తించడం, వారిని సురక్షితంగా రక్షించి కన్నవారి చెంతకు చేర్చడం, బాలల అక్రమ రవాణా (Human Trafficking), బాల కార్మిక వ్యవస్థ, మరియు బిచ్చగాళ్ల ముఠాల బారిన పడిన వీధి బాలలను రెస్క్యూ చేయడమే ఈ ఆపరేషన్ ముఖ్య లక్ష్యం.

కనుమరుగవుతున్న పసిప్రాయం.. ఎన్‌సీఆర్‌బీ భయానక నిజాలు

నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) నివేదికల ప్రకారం.. భారతదేశంలో ప్రతి సంవత్సరం పది వేల మందికి పైగా పిల్లలు కనిపించకుండా పోతున్నారు. వీరిలో కొందరు దొరుకుతున్నప్పటికీ, మరికొంతమంది ఆచూకీ శాశ్వతంగా లభించడం లేదు. తప్పిపోయిన ప్రతి చిన్నారి వెనుక ఆ కుటుంబం పడే ఆవేదన, భయం, గుండెకోత వర్ణనాతీతం. ఇలా అపహరణకు గురైన లేదా తప్పిపోయిన చిన్నారులు అక్రమ రవాణా ముఠాల చేతుల్లో చిక్కి ప్రమాదకరమైన పరిస్థితుల్లో బాల కార్మికులుగా మారుతున్నారు. రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లు, వీధుల్లో భిక్షాటనం చేస్తూ తమ బాల్యాన్ని బలితీసుకుంటున్నారు. ఇలా రక్షించిన చిన్నారులందరికీ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (CWC) ద్వారా పునరావాసం కల్పిస్తారు.

2025 ఆపరేషన్ ముస్కాన్ రికార్డు గణాంకాలు

గత ఏడాది జరిగిన ఆపరేషన్ ముస్కాన్‌లో రక్షించిన చిన్నారుల వివరాలు, నమోదైన కేసుల గణాంకాలు సమాజంలో బాల కార్మిక వ్యవస్థ ఏ స్థాయిలో ఉందో కళ్లకు కడుతున్నాయి:

  • మొత్తం రెస్క్యూ: గత ఏడాది దేశవ్యాప్తంగా 7,678 మంది చిన్నారులను రక్షించారు. వీరిని ఎక్కువగా రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు, ఇటుక బట్టీలు, మెకానిక్ షాపులు, నిర్మాణ స్థలాలు, టీ స్టాళ్లు మరియు ధార్మిక ప్రదేశాల వద్ద గుర్తించారు.
  • కేటగిరీల వారీగా: రక్షించబడిన వారిలో 6,718 మంది బాలకార్మికులు, 357 మంది వీధి బాలలు కాగా, 42 మంది చిన్నారులు భిక్షాటనం చేస్తూ పట్టుబడ్డారు.
  • ప్రాంతాల వివరాలు: రెస్క్యూ అయిన వారిలో తెలంగాణకు చెందిన చిన్నారులు 3,891 మంది ఉండగా, మిగిలిన వారు ఇతర 12 రాష్ట్రాలతో పాటు సరిహద్దు దేశమైన నేపాల్ నుంచి అక్రమ రవాణా ద్వారా వచ్చినట్లు గుర్తించారు.
  • చట్టపరమైన చర్యలు: ఈ అక్రమ రవాణా మరియు దోపిడీకి సంబంధించి 1,713 ఎఫ్‌ఐఆర్‌లు (FIR) నమోదు చేసి, పిల్లలను పనుల్లో పెట్టుకున్న 1,718 మంది యజమానులు, ముఠా సభ్యులపై కేసులు పెట్టారు.

తల్లిదండ్రుల కోసం బాలల హక్కుల సంఘం కీలక సూచనలు

పిల్లల భద్రత విషయంలో తల్లిదండ్రులు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని బాలల హక్కుల సంఘం హెచ్చరిస్తూ ఈ క్రింది జాగ్రత్తలను సూచిస్తోంది:

  • పిల్లలకు చిన్న వయసు నుంచే తల్లిదండ్రుల మొబైల్ నంబర్లు, ఇంటి చిరునామా గుర్తుండేలా నేర్పించడం అలవాటు చేయాలి.
  • చిన్నారులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంట్లో గానీ, బయట గానీ ఒంటరిగా వదిలిపెట్టకూడదు.
  • జాతరలు, షాపింగ్ మాల్స్, పండుగలు వంటి విపరీతమైన జనసమూహం ఉండే ప్రాంతాల్లో పిల్లల చేతులు విడవకుండా జాగ్రత్త పడాలి.
  • పిల్లలు ఇంటి ఆరుబయట ఆడుకుంటున్నప్పుడు, మీ పనుల్లో నిమగ్నమై వారిని నిర్లక్ష్యం చేయవద్దు; ఎల్లప్పుడూ వారిపై ఒక కన్నేసి ఉంచాలి.
  • ఒకవేళ పొరపాటున పిల్లలు కనిపించకుండా పోతే, 24 గంటలు వేచి చూడాల్సిన అవసరం లేకుండా తక్షణమే సమీప పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలి.

నిరంతర నిఘా, ఆకస్తు తనిఖీలతోనే శాశ్వత పరిష్కారం

కేవలం ఒక నెల రోజుల పాటు మొక్కుబడిగా జరిపే డ్రైవ్‌లతో ఈ సమస్య పూర్తిగా అదుపులోకి రాదు. ప్రభుత్వం మరియు రక్షక విభాగాలు కొన్ని పటిష్టమైన చర్యలను నిరంతరం కొనసాగించాలి:

  • రెగ్యులర్ తనిఖీలు: ఇటుక బట్టీలు, నిర్మాణ సంస్థలు, గాజుల ఫ్యాక్టరీలు, హోటళ్ల వంటి నల్ల చట్టాల స్థావరాలపై విద్యా, కార్మిక శాఖల అధికారులు నిరంతరం ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలి.
  • రవాణా వ్యవస్థపై నిఘా: బాల కార్మికులను ఇతర రాష్ట్రాల నుండి తీసుకురావడానికి ఎక్కువగా రైల్వే రవాణాను ఉపయోగిస్తారు. కాబట్టి రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లలో బల్క్ బుకింగ్స్ (ఎక్కువ టికెట్లు) చేసే ముఠాలపై నిఘా ఉంచాలి. అంతర్రాష్ట్ర సరిహద్దు చెక్ పోస్ట్‌ల వద్ద తనిఖీలు ముమ్మరం చేయాలి.
  • ప్రజల భాగస్వామ్యం: ఎక్కడైనా పిల్లలు భిక్షాటన చేస్తూ లేదా బాల కార్మికులుగా కనిపిస్తే వెంటనే చైల్డ్ లైన్ నంబర్ 1098 కు కాల్ చేసి సమాచారం అందించాలి లేదా పోలీసులకు చెప్పాలి.

చిన్నారులను కాపాడడం సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరి బాధ్యత. ప్రజల్లో అవగాహన పెంచుతూ, బాలకార్మికులు లేని ఆరోగ్యకరమైన సమాజం కోసం మనమందరం బాధ్యతగా కృషి చేద్దాం.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!