దేశంలో అంత్యోదయ అన్నయోజన (AAY) రేషన్ కోటాలో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇందుకోసం ‘నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ (అమెండ్‌మెంట్) బిల్లు, 2026’ ముసాయిదాను విడుదల చేసింది. దీని ప్రకారం ఇకపై కుటుంబంతో సంబంధం లేకుండా, లబ్ధిదారుల్లో ప్రతి వ్యక్తికి నెలకు 7 కిలోల చొప్పున రేషన్ ఇవ్వనున్నారు. అయితే ఒక కుటుంబానికి ఇచ్చే గరిష్ట కోటాను 35 కిలోలకే పరిమితం చేశారు. ఈ ప్రతిపాదనల వల్ల ఐదుగురు కంటే తక్కువ సభ్యులున్న చిన్న కుటుంబాల రేషన్ కోటాలో కోత పడనుంది. ఈ బిల్లుపై జూలై 13 లోగా సలహాలు పంపవచ్చని కేంద్రం పేర్కొంది.
![]()




