రానున్న పదేళ్లలో దేశంలో కొత్తగా 100 విమానాశ్రయాలు, 200 హెలిప్యాడ్లను ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. బుధవారం రాంచీ విమానాశ్రయంలో ప్రయాణికుల కోసం ‘ఉడాన్ యాత్రీ కేఫ్’, ‘ఫ్లైబ్రరీ’ (గ్రంథాలయం)లను ఆయన ప్రారంభించారు. త్వరలోనే రూ. 29 వేల కోట్లతో ‘ఉడాన్-2’ పథకాన్ని ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. విమాన ప్రయాణికులకు ఊరటనిస్తూ ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్) ధరలతో పాటు, ల్యాండింగ్, పార్కింగ్ ఛార్జీలను తగ్గించినట్లు మంత్రి వెల్లడించారు.
![]()




