మైనర్ బాలికపై లైంగిక దాడి ఆరోపణలతో పోక్సో {POCSO) కేసు ఎదుర్కొంటున్న బండి భగీరథ్ దేశం దాటిపోకుండా పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. పరారీలో ఉన్న అతని కోసం పోలీసులు ఐదు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు. భగీరథ్ స్నేహితులు, బంధువుల ఇళ్లపై నిఘా ఉంచిన పోలీసులు.. అందులో భాగంగానే శనివారం బంజారాహిల్స్‌లోని కేంద్ర మంత్రి బండి సంజయ్ నివాసంలో ఒక బృందం తనిఖీలు నిర్వహించింది. నిందితుడితో టచ్‌లో ఉన్నవారి వివరాలను సేకరిస్తున్నట్లు సమాచారం.
![]()




