రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటనలో భాగంగా వేములవాడ భీమేశ్వర స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు ఆయన రుద్రంగిలో నూతన పోలీస్ స్టేషన్ భవన నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. అయితే, డీజీపీ పర్యటన షెడ్యూల్‌లో స్పష్టత లేకపోవడంతో వేములవాడలో తొలుత గందరగోళం నెలకొంది. మొదట ఆలయానికి వచ్చి వెనుదిరిగిన ఆయన, రుద్రంగి కార్యక్రమం ముగించుకొని తిరిగి వచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. సరైన సమాచారం లేక ఇబ్బంది పడ్డామని స్థానిక జర్నలిస్టులు పేర్కొన్నారు.
![]()




