AP : శ్రీకాకుళం జిల్లాలోని కోటబొమ్మాళి మండలం ఎత్తురాళ్లపాడు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై నిలిచిన లారీని తుఫాన్ వాహనం ఢీకొనడంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఆరుగురు గాయపడ్డారు. మృతులు మధ్యప్రదేశ్‌కు చెందిన సింగ్ పవార్, విజయ్ సింగ్ తోమర్, కుసాల్ సింగ్, సంతోషి భాయ్‌గా గుర్తించారు. వీరు శ్రీశైలం దర్శనానికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. గాయపడిన వారిని నరసన్నపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న కోటబొమ్మాళి పోలీసులు, హైవే పేట్రోలింగ్ బృందం సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది.
![]()
