📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Friday, September 11, 2026
Visitors: 1,768,126  |  485 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుకాగ్నిజెంట్‌లో ఫ్రెషర్లకు మ్యాపింగ్ ఉద్యోగాలుపిల్లలు పుట్టడం లేదని వైద్యులను సంప్రదించిన 26 ఏళ్ల వ్యక్తికి షాక్.. శరీరంలో గర్భాశయం!సెప్టెంబర్ 11, 9/11 దాడులు: ప్రపంచాన్ని మార్చిన విషాదకరమైన రోజుబ్రిక్స్‌ సదస్సుకు దిల్లీ సర్వసన్నద్ధం.. 15 వేల మంది పోలీసులతో భారీ భద్రతఫ్లిప్‌కార్ట్‌ మినిట్స్‌ ప్రత్యేక యాప్‌.. 10 నిమిషాల్లోనే నిత్యావసరాల డెలివరీLatest Breaking News from PressMeetతాజా వార్తలుకాగ్నిజెంట్‌లో ఫ్రెషర్లకు మ్యాపింగ్ ఉద్యోగాలుపిల్లలు పుట్టడం లేదని వైద్యులను సంప్రదించిన 26 ఏళ్ల వ్యక్తికి షాక్.. శరీరంలో గర్భాశయం!సెప్టెంబర్ 11, 9/11 దాడులు: ప్రపంచాన్ని మార్చిన విషాదకరమైన రోజుబ్రిక్స్‌ సదస్సుకు దిల్లీ సర్వసన్నద్ధం.. 15 వేల మంది పోలీసులతో భారీ భద్రతఫ్లిప్‌కార్ట్‌ మినిట్స్‌ ప్రత్యేక యాప్‌.. 10 నిమిషాల్లోనే నిత్యావసరాల డెలివరీ
Telangana ⚡ AMP

పిల్లల భద్రతకు ‘సురక్షా కవచ్‌’: జూన్‌ నుంచి సైబరాబాద్‌ పోలీసుల ప్రత్యేక కార్యక్రమం

May 20, 2025 May 20, 2025 0 Views
SHARE: Share Tweet WhatsApp Telegram

సైబరాబాద్‌ పోలీసులు పాఠశాల విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకొని ‘సురక్షా కవచ్‌’ పేరుతో ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. జూన్‌ నుంచి అమల్లోకి వచ్చే ఈ కార్యక్రమం ద్వారా సైబర్, రోడ్డు భద్రతతోపాటు మానసిక, శారీరక ఆరోగ్యంపై విద్యార్థులకు అవగాహన కల్పించనున్నారు. సొసైటీ ఫర్‌ సైబరాబాద్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌, టీజీ న్యాబ్‌, విద్యాశాఖ సహకారంతో ఈ కార్యాచరణను చేపడుతున్నారు.

కార్యక్రమంలో బోధించేది ఏమిటంటే:

  • గుడ్ టచ్, బ్యాడ్ టచ్ తేడా గురించి స్పష్టత
  • మత్తు పదార్థాల ప్రమాదాలుపై విద్య
  • ఆన్‌లైన్‌ వినియోగంలో జాగ్రత్తలు, సైబర్‌ ముప్పులపై అవగాహన
  • మానసిక ఆరోగ్యం, ఎలాంటి సమస్యనైనా ధైర్యంగా చెప్పే వాతావరణం సృష్టించడం
  • పాఠశాల ఆవరణలో ప్రమాదకర వస్తువులు గుర్తించడం, అధికారులను అప్రమత్తం చేయడం
  • రహదారి భద్రతపై ప్రాథమిక అవగాహన, ట్రాఫిక్‌ నిబంధనలు
  • భద్రంగా ప్రయాణించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ అవినాశ్‌ మహంతి, టీజీ న్యాబ్‌ డైరెక్టర్‌ సందీప్‌ శాండిల్య ఈ కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు. ఈ ప్రచారం విద్యార్థుల్లో భద్రతా చైతన్యం పెంపొందించే దిశగా ముందడుగు కావనిస్తున్నారు.

Loading

 Save as PDF

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com
error: Content is protected !!