📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Friday, September 11, 2026
Visitors: 1,768,278  |  491 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుకాగ్నిజెంట్‌లో ఫ్రెషర్లకు మ్యాపింగ్ ఉద్యోగాలుపిల్లలు పుట్టడం లేదని వైద్యులను సంప్రదించిన 26 ఏళ్ల వ్యక్తికి షాక్.. శరీరంలో గర్భాశయం!సెప్టెంబర్ 11, 9/11 దాడులు: ప్రపంచాన్ని మార్చిన విషాదకరమైన రోజుబ్రిక్స్‌ సదస్సుకు దిల్లీ సర్వసన్నద్ధం.. 15 వేల మంది పోలీసులతో భారీ భద్రతఫ్లిప్‌కార్ట్‌ మినిట్స్‌ ప్రత్యేక యాప్‌.. 10 నిమిషాల్లోనే నిత్యావసరాల డెలివరీLatest Breaking News from PressMeetతాజా వార్తలుకాగ్నిజెంట్‌లో ఫ్రెషర్లకు మ్యాపింగ్ ఉద్యోగాలుపిల్లలు పుట్టడం లేదని వైద్యులను సంప్రదించిన 26 ఏళ్ల వ్యక్తికి షాక్.. శరీరంలో గర్భాశయం!సెప్టెంబర్ 11, 9/11 దాడులు: ప్రపంచాన్ని మార్చిన విషాదకరమైన రోజుబ్రిక్స్‌ సదస్సుకు దిల్లీ సర్వసన్నద్ధం.. 15 వేల మంది పోలీసులతో భారీ భద్రతఫ్లిప్‌కార్ట్‌ మినిట్స్‌ ప్రత్యేక యాప్‌.. 10 నిమిషాల్లోనే నిత్యావసరాల డెలివరీ
Telangana ⚡ AMP

తెలంగాణలో అమలులోకి ఎస్సీ వర్గీకరణ చట్టం : 56 కులాలకు మూడు గ్రూపులుగా రిజర్వేషన్లు

April 14, 2025 April 14, 2025 0 Views
SHARE: Share Tweet WhatsApp Telegram

తెలంగాణ ప్రభుత్వం బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ జయంతి సందర్భంగా ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని అమలులోకి తీసుకువచ్చింది. ఈ మేరకు ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్‌ ప్రకారం, రాష్ట్రంలోని మొత్తం 56 ఎస్సీ కులాలను మూడు గ్రూపులుగా విభజించి, వారికి ప్రత్యేక రిజర్వేషన్లు కేటాయించింది.

గ్రూపుల వారీగా రిజర్వేషన్లు:

  • గ్రూప్ A: సామాజిక, ఆర్థిక, విద్యాపరంగా అత్యంత వెనుకబడిన 15 కులాలకు 1% రిజర్వేషన్.
  • గ్రూప్ B: మాదిగ మరియు దాని ఉపకులాలైన 18 కులాలకు 9% రిజర్వేషన్.
  • గ్రూప్ C: మాల మరియు దాని ఉపకులాలైన 26 కులాలకు 5% రిజర్వేషన్.

ఈ వర్గీకరణ ప్రకారం, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ సమయంలో మొదట గ్రూప్ A, తరువాత గ్రూప్ B, చివరగా గ్రూప్ C కులాల అభ్యర్థులతో ఖాళీలు భర్తీ చేయనున్నారు. ప్రతి గ్రూపుకు ప్రత్యేక రోస్టర్ పాయింట్లు కేటాయించబడ్డాయి.

జనాభా గణాంకాల ఆధారంగా వర్గీకరణ:

ప్రస్తుతం గ్రూప్ Aలో 1,71,625 మంది, గ్రూప్ Bలో 32,74,377 మంది, గ్రూప్ Cలో 17,71,682 మంది ఉన్నారు. 2026 జనాభా లెక్కలు పూర్తైన తర్వాత, ఈ వర్గీకరణను జనాభా గణాంకాల ఆధారంగా పునఃసమీక్షించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ గెజిట్‌ తెలుగు, ఇంగ్లీష్‌, ఉర్దూ భాషల్లో విడుదల చేయబడింది. ఈ చర్యతో ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన వివాదాలకు ముగింపు పలకాలని ప్రభుత్వం ఆశిస్తోంది.

ఏవైనా ప్రభుత్వ ఉద్యోగాలను తొలుత గ్రూప్-A లోని కులాల వారితో, అక్కడ మిగిలితే గ్రూప్-B, ఆ తర్వాత గ్రూప్-C లోని వ్యక్తులతో భర్తీ చేస్తారు. మూడు గ్రూపుల్లోనూ అభ్యర్థులు లేకపోతే ఆ ఖాళీలను క్యారీ ఫార్వర్డ్ చేస్తారు.
రోస్టర్ పాయింట్ల విభజన ఇలా..
గ్రూప్-A లోని వారికి 7వ రోస్టర్ పాయింట్, గ్రూప్-B లోని వారికి 2, 16, 27, 47, 52, 66, 72, 87,97, గ్రూప్-C లోని వారికి 22, 41, 62, 77, 91 రోస్టర్ పాయింట్లు ఉంటాయి.

Loading

 Save as PDF

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com
error: Content is protected !!