📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Tuesday, April 28, 2026
Visitors: 486,634  |  524 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుకొత్తగా రెండు అమృత్ భారత్ రైళ్లు ప్రారంభం: ప్రధాని మోదీ కీలక ప్రకటనవాట్సప్ సరికొత్త క్లౌడ్ బ్యాకప్ ఫీచర్: యూజర్లకు స్టోరేజీ ఊరటకొలంబియా హిప్పోల రక్షణకు అనంత్ అంబానీ ముందడుగుమెదక్ జిల్లాలో ఆర్టీసీ బస్సు ప్రమాదం: 15 మంది ప్రయాణికులకు గాయాలుడిజిటల్ అరెస్ట్ మోసాల కట్టడికి కేంద్రం కీలక ప్రతిపాదనలుLatest Breaking News from PressMeetతాజా వార్తలుకొత్తగా రెండు అమృత్ భారత్ రైళ్లు ప్రారంభం: ప్రధాని మోదీ కీలక ప్రకటనవాట్సప్ సరికొత్త క్లౌడ్ బ్యాకప్ ఫీచర్: యూజర్లకు స్టోరేజీ ఊరటకొలంబియా హిప్పోల రక్షణకు అనంత్ అంబానీ ముందడుగుమెదక్ జిల్లాలో ఆర్టీసీ బస్సు ప్రమాదం: 15 మంది ప్రయాణికులకు గాయాలుడిజిటల్ అరెస్ట్ మోసాల కట్టడికి కేంద్రం కీలక ప్రతిపాదనలు
National ⚡ AMP

నలుపును ఎందుకు అవమానించాలి? అది విశ్వమంతా వ్యాపించి ఉన్న సత్యం : కేరళ చీఫ్‌ సెక్రటరీ శారదా మురళీధరన్‌

March 26, 2025 March 26, 2025 0 Views
SHARE: Share Tweet WhatsApp Telegram

1990 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి శారదా మురళీధరన్‌ కొద్ది నెలల క్రితం కేరళ చీఫ్‌ సెక్రటరీగా నియమితులయ్యారు. ప్రత్యేకత ఏమిటంటే, తన భర్త తర్వాత ఆమె ఈ హోదాలో చేరడం. అయితే, వారి రంగు గురించి జరిగిన కొన్ని కామెంట్లు ఆమె దృష్టికి వచ్చాయి, దాంతో తన అనుభవాలను బహిరంగంగా పంచుకున్నారు.

తనపై వచ్చిన వ్యాఖ్యలపై శారద స్పందిస్తూ, “నా రంగును నేను అంగీకరించాల్సి ఉంది. ఈ విషయంలో ఒక పోస్టు పెట్టాను. తర్వాత వచ్చిన ప్రతిస్పందనతో కంగారు పడి తొలగించాను. అయితే ఇది చర్చించాల్సిన అంశమే అని శ్రేయోభిలాషులు చెప్పడంతో మళ్లీ షేర్ చేశాను” అని తెలిపారు.

అంతేకాక, చిన్నతనంలో తన అనుభవాలను వెల్లడిస్తూ, “నలుపును ఎందుకు అవమానించాలి? అది విశ్వమంతా వ్యాపించి ఉన్న సత్యం. నాలుగేళ్ల వయసులో నేను నా తల్లిని ‘నన్ను తెల్లగా, అందంగా తిరిగి జన్మించగలవా?’ అని అడిగిన సందర్భం ఉంది. నా పిల్లలు ఈ వర్ణం అద్భుతమని, అందమైనదని నాకు గుర్తించగలిగారు” అని వివరించారు.

శారద మురళీధరన్ వ్యక్తిగతంగా తన అనుభవాలను పంచుకోవడం పలువురు అభినందిస్తున్నారు. కేరళ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత వీడీ సతీశన్ స్పందిస్తూ, ఆమె చెప్పిన ప్రతిమాట హృదయాన్ని తాకింది. ఇది సమాజంలో చర్చించాల్సిన విషయం” అని పేర్కొన్నారు.

శారద మురళీధరన్ గతంలో నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ డైరెక్టర్ జనరల్, నేషనల్ రూరల్ లైవ్లీహుడ్స్ మిషన్ సీఓఓ, కుడుంబశ్రీ మిషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌ హోదాల్లో సేవలందించారు. కేరళ చరిత్రలో తొలిసారి భర్త నుంచి ఆమె చీఫ్‌ సెక్రటరీగా బాధ్యతలు స్వీకరించడం విశేషం.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!