📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Tuesday, July 28, 2026
Visitors: 1,539,959  |  653 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుఈపీఎఫ్‌ఓ విప్లవాత్మక నిర్ణయం: పాత పీఎఫ్ ఖాతాల గుర్తింపు, నిధుల బదిలీ కోసం 'ఈ-ప్రాప్తి' పోర్టల్కరెన్సీ నోట్ల మన్నిక పెంపే లక్ష్యం: త్వరలో అందుబాటులోకి పాలిమర్ నోట్లుCSC Supervisor/Operator Recruitment 2026భారత్‌లో ఇన్‌స్టాగ్రామ్‌ బ్యాన్ అవాస్తవం: కేంద్ర ప్రభుత్వం, PIB స్పష్టతఉద్యోగ ప్రకటన: 40 వివిధ రకాల పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి యుపిఎస్సి దరఖాస్తుల ఆహ్వానంLatest Breaking News from PressMeetతాజా వార్తలుఈపీఎఫ్‌ఓ విప్లవాత్మక నిర్ణయం: పాత పీఎఫ్ ఖాతాల గుర్తింపు, నిధుల బదిలీ కోసం 'ఈ-ప్రాప్తి' పోర్టల్కరెన్సీ నోట్ల మన్నిక పెంపే లక్ష్యం: త్వరలో అందుబాటులోకి పాలిమర్ నోట్లుCSC Supervisor/Operator Recruitment 2026భారత్‌లో ఇన్‌స్టాగ్రామ్‌ బ్యాన్ అవాస్తవం: కేంద్ర ప్రభుత్వం, PIB స్పష్టతఉద్యోగ ప్రకటన: 40 వివిధ రకాల పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి యుపిఎస్సి దరఖాస్తుల ఆహ్వానం
Hyderabad ⚡ AMP

పాత పెన్షన్ పునరుద్ధరణ మా ధ్యేయం సిపిఎస్ టిఈఏటీఎస్ రాష్ట్ర ప్రచార కార్యదర్శి మాచన రఘునందన్

September 1, 2024 September 1, 2024 0 Views
SHARE: Share Tweet WhatsApp Telegram

భూ కంపం వచ్చినా..ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా..పాత పెన్షన్ సాధనే ధ్యేయం గా..సిపిఎస్ అంతం కోసం ఉద్యమం ఉదృతం చేస్తామని భాగస్వామ్య పింఛను పథకం ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘం తెలంగాణ రాష్ట్ర ప్రచార కార్యదర్శి మాచన రఘునందన్ స్పష్టం చేశారు.భారీ వర్షం సైతం లెక్క చేయక ఆదివారం నాడు ఆయన హైదరబాద్ అసెంబ్లీ వద్ద ఉన్న గన్ పార్క్ లో అమర వీరుల స్తూపం వద్ద.. సిపిఎస్ అంతం మా పంతం అంటూ నినదించారు. దశాబ్ద కాలంగా సిపిఎస్ ను రద్దు చేస్తాం అని ఆయా రాజకీయ పార్టీలు ఉద్యోగ, ఉపాధ్యాయ లోకానికి హామి ఇస్తూ పబ్బo గడుపుకుంటున్నాయే తప్ప ఆచరణలో .. మీన మేషాలు లెక్కిస్తున్నాయనీ అవేదన వ్యక్తం చేశారు. పాత పెన్షన్ సాధన ఓ యజ్ఞం, యాగంలా పరిణమించిందని రఘునందన్ అభిప్రాయ పడ్డారు. దేశ వ్యాప్తంగా కోటి మంది ఉద్యోగులు న్యూ పెన్షన్ స్కీమ్ రద్దు కోసం ముక్త కంఠంతో ఘోషిస్తున్నారని మాచన రఘునందన్ వివరించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు వర్షంలోనే తడుస్తూ.. అమర వీరుల స్తూపం వద్ద కూర్చున్నారు. సాధనా శూరత్వం కలిగి ఉంటేనే పాత పెన్షన్ పునరుద్ధరణ సాధ్యం అని రఘునందన్ అభిప్రాయపడ్డారు.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!