📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Friday, September 11, 2026
Visitors: 1,768,118  |  485 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుకాగ్నిజెంట్‌లో ఫ్రెషర్లకు మ్యాపింగ్ ఉద్యోగాలుపిల్లలు పుట్టడం లేదని వైద్యులను సంప్రదించిన 26 ఏళ్ల వ్యక్తికి షాక్.. శరీరంలో గర్భాశయం!సెప్టెంబర్ 11, 9/11 దాడులు: ప్రపంచాన్ని మార్చిన విషాదకరమైన రోజుబ్రిక్స్‌ సదస్సుకు దిల్లీ సర్వసన్నద్ధం.. 15 వేల మంది పోలీసులతో భారీ భద్రతఫ్లిప్‌కార్ట్‌ మినిట్స్‌ ప్రత్యేక యాప్‌.. 10 నిమిషాల్లోనే నిత్యావసరాల డెలివరీLatest Breaking News from PressMeetతాజా వార్తలుకాగ్నిజెంట్‌లో ఫ్రెషర్లకు మ్యాపింగ్ ఉద్యోగాలుపిల్లలు పుట్టడం లేదని వైద్యులను సంప్రదించిన 26 ఏళ్ల వ్యక్తికి షాక్.. శరీరంలో గర్భాశయం!సెప్టెంబర్ 11, 9/11 దాడులు: ప్రపంచాన్ని మార్చిన విషాదకరమైన రోజుబ్రిక్స్‌ సదస్సుకు దిల్లీ సర్వసన్నద్ధం.. 15 వేల మంది పోలీసులతో భారీ భద్రతఫ్లిప్‌కార్ట్‌ మినిట్స్‌ ప్రత్యేక యాప్‌.. 10 నిమిషాల్లోనే నిత్యావసరాల డెలివరీ
Telangana ⚡ AMP

సమయ స్ఫూర్తితో ప్ర‌యాణికుడి ప్రాణాలు కాపాడిన డ్రైవర్ కి సన్మానం చేసిన ఆర్టీసీ ఎండీ స‌జ్జ‌న‌ర్

August 13, 2024 August 13, 2024 0 Views
SHARE: Share Tweet WhatsApp Telegram

TGSRTC బ‌స్సులో ఫిట్స్ వ‌చ్చిన ప్ర‌యాణికుడిని ఆస్ప‌త్రిలో చేర్పించి డ్రైవ‌ర్ ఉదార‌త చాటుకున్నారు. బ‌స్సును నేరుగా ఆస్ప‌త్రికి తీసుకెళ్లి ప్ర‌యాణికుడి ప్రాణాల‌ను కాపాడారు. వ‌రంగ‌ల్-2 డిపోన‌కు చెందిన సూపర్ లగ్జరీ బస్సు హైదరాబాద్ నుంచి హన్మకొండకు సోమవారం వెళ్తోంది. హైదరాబాద్ శివారు ఘట్ కేసర్ దాట‌గానే సంతోష్ అనే ప్ర‌యాణికుడికి బస్సులో ఒక్కసారిగా ఫిట్స్ వ‌చ్చాయి. ఈ విషయాన్ని గమనించిన తోటి ప్రయాణికులు డ్రైవర్ బి.వెంకన్న దృష్టికి తీసుకెళ్లారు. వెంటేనే బస్సును పక్కకి ఆపి ఫిట్స్ వచ్చిన ప్రయాణికుడిని డ్రైవర్ పరిశీలించారు. ఆరోగ్య పరిస్థితి విషమిస్తుందని గుర్తించి.. తోటి ప్ర‌యాణికుడు శ్రీనివాస్ స‌హ‌కారంతో సమీపంలో ఉన్న బీబీనగర్‌లోని ఎయిమ్స్ ఆస్పత్రికి బస్సును తీసుకెళ్లారు. సంతోష్‌ను ఆస్ప‌త్రిలో చేర్పించారు. స‌కాలంలో ఆస్ప‌త్రికి తీసుకువెళ్ల‌డంతో సంతోష్ కు ప్రాణాప్రాయం త‌ప్పింది.

సమయస్పూర్తితో వ్యవహారించి .. సకాలంలో ప్ర‌యాణికుడిని ఆస్ప‌త్రికి తీసుకెళ్లిన ఆర్టీసీ డ్రైవ‌ర్ బి.వెంక‌న్నను హైద‌రాబాద్ బ‌స్ భ‌వ‌న్ లో మంగ‌ళ‌వారం టీజీఎస్ఆర్టీసీ యాజ‌మాన్యం అభినందించింది. సంస్థ ఉన్న‌తాధికారుల‌తో క‌లిసి ఆయ‌న‌ను టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ స‌జ్జ‌న‌ర్, ఐపీఎస్ స‌న్మానించారు. ఆపద సమయంలో అమూల్య‌మైన సేవాత‌ర్ప‌ర‌త‌ను ఆర్టీసీ సిబ్బంది చాటుతున్నార‌ని స‌జ్జ‌న‌ర్ అన్నారు. ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చడంతో పాటు.. వారి ఆపద సమయంలో తాము ఉన్నామని భరోసా కల్పిస్తున్నార‌ని ప్రశంసించారు. సంతోష్‌ను ఆస్ప‌త్రికి త‌ర‌లించడంలో డ్రైవ‌ర్‌కి స‌హ‌క‌రించిన ప్ర‌యాణికుడు శ్రీనివాస్‌కు, వైద్యం అందించిన ఎయిమ్స్ వైద్య బృందానికి అభినంద‌న‌లు తెలియ‌జేశారు. ఈ సన్మాన కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు మునిశేఖర్, కృష్ణకాంత్, చీఫ్ ట్రాఫిక్ మేనేజ‌ర్ శ్రీదేవి, వరంగ‌ల్-2 డిపో మేనేజ‌ర్ జ్యోస్న, త‌దిత‌రులు పాల్గొన్నారు.

Loading

 Save as PDF

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com
error: Content is protected !!