📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Tuesday, November 17, 2026
Visitors: 67,016  |  1262 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుకోస్తాంధ్ర ప్రయాణికులకు రైల్వే తీపి కబురు: దువ్వాడ, విజయవాడ సహా కీలక స్టేషన్లలో ప్రత్యేక రైళ్లకు హాల్టింగ్బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ: పోలీసులకు వాయిస్ శాంపిల్ ఇవ్వాల్సిందే.. పిటిషన్ కొట్టివేసిన ధర్మాసనంతెలంగాణలో వణికిస్తున్న చలిగాలులు: సంగారెడ్డిలో 11.7°C.. హైదరాబాద్‌లో 15.3°C కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదుఏపీలో రెండో విడత పంచాయతీ ఎన్నికల నగారా: నోటిఫికేషన్ విడుదల చేసిన ఎస్ఈసీ.. నవంబర్ 29న పోలింగ్, అదే రోజు ఫలితాలుకోల్‌కతాలో దారుణం: సహజీవనం చేస్తున్న టెకీ ప్రియుడిని గొంతుకోసి చంపిన యువతి.. ప్రియురాలితో పాటు తల్లి అరెస్ట్Latest Breaking News from PressMeetతాజా వార్తలుకోస్తాంధ్ర ప్రయాణికులకు రైల్వే తీపి కబురు: దువ్వాడ, విజయవాడ సహా కీలక స్టేషన్లలో ప్రత్యేక రైళ్లకు హాల్టింగ్బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ: పోలీసులకు వాయిస్ శాంపిల్ ఇవ్వాల్సిందే.. పిటిషన్ కొట్టివేసిన ధర్మాసనంతెలంగాణలో వణికిస్తున్న చలిగాలులు: సంగారెడ్డిలో 11.7°C.. హైదరాబాద్‌లో 15.3°C కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదుఏపీలో రెండో విడత పంచాయతీ ఎన్నికల నగారా: నోటిఫికేషన్ విడుదల చేసిన ఎస్ఈసీ.. నవంబర్ 29న పోలింగ్, అదే రోజు ఫలితాలుకోల్‌కతాలో దారుణం: సహజీవనం చేస్తున్న టెకీ ప్రియుడిని గొంతుకోసి చంపిన యువతి.. ప్రియురాలితో పాటు తల్లి అరెస్ట్
Andhra Pradesh ⚡ AMP

Hindupur CTO Bribery: హిందూపురం సీటీవో లంచం తీసుకుంటున్న వీడియో వైరల్.. కక్షగట్టి కుట్ర చేశారని కృష్ణవేణి ఆరోపణ!

November 16, 2026 17 hr ago 0 Views
SHARE: Share Tweet WhatsApp Telegram

Hindupur CTO Bribery: శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం వాణిజ్య పన్నులశాఖ అధికారి (CTO) కృష్ణవేణి లంచం తీసుకుంటున్నట్లుగా ఉన్న ఓ వీడియో సోషల్ మీడియాలో తీవ్ర కలకలం రేపుతోంది. స్థానికంగా తుక్కు వ్యాపారం చేస్తున్న ఫయాజ్ అనే వ్యక్తి, సీటీవో నివాసానికి వెళ్లి ఆమెకు రూ.10 వేలు ఇస్తున్నట్లు ఆ వీడియోలో రికార్డయ్యాయి.
వీడియోలో ఏముందంటే?
డబ్బు ఇస్తున్న సమయంలో అవతలి వ్యక్తి మాట్లాడుతూ.. “ఇక నుంచి నెలనెలా డబ్బు వస్తుంది. ఎవరికీ తెలియకుండా మేనేజ్ చేసుకోండి. మాటిచ్చాం కాబట్టి తెచ్చి ఇస్తున్నాం” అని మాటలు వీడియోలో వినిపిస్తోంది. హిందూపురంలో సుమారు 30 మంది తుక్కు వ్యాపారులు ఉండగా, వారిలో పలువురు జీఎస్టీ ఎగవేస్తూ అధికారులకు నెలవారీ మామూళ్లు ముట్టజెబుతున్నారనే ఆరోపణలు కొంతకాలంగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీటీవో డబ్బులు తీసుకుంటున్న వీడియో బయటకు రావడం చర్చనీయాంశమైంది.

వివాదాల హిస్టరీ
సీటీవో కృష్ణవేణిపై గతంలోనూ ఇదే తరహా అవినీతి ఆరోపణలు రావడంతో, రెండేళ్ల క్రితం ఉన్నతాధికారులు ఆమెను కడపకు బదిలీ చేశారు. అయితే, ఆ తర్వాత ఆమె తిరిగి డిప్యూటేషన్‌పై హిందూపురం పోస్టింగ్ తెచ్చుకుని విధుల్లో కొనసాగుతున్నారు. ” ఏలూరు జిల్లాలో జనావాసాల్లోకి పెద్దపులి.. ఇళ్ల మధ్యకి రావడంతో వణికిపోతున్న స్థానికులు” ఏలూరు జిల్లాలో జనావాసాల్లోకి పెద్దపులి.. ఇళ్ల మధ్యకి రావడంతో వణికిపోతున్న స్థానికులు

కృష్ణవేణి ఏమన్నారంటే?
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోపై సీటీవో కృష్ణవేణి స్పందిస్తూ, ఆ ఆరోపణలను పూర్తిగా ఖండించారు. అది కావాలని సృష్టించిన ‘మార్ఫింగ్ వీడియో’ అని ఆమె పేర్కొన్నారు. గతంలో ఇక్కడ పనిచేసిన ఓ డీసీటీవో తనపై కక్షగట్టి ఈ కుట్రకు పాల్పడ్డారని ఆరోపించారు. ఓ కేసుకు సంబంధించి సదరు డీసీటీవోకు అనుకూలంగా నివేదిక ఇవ్వాలని కొందరు వ్యక్తులు గత కొన్ని రోజులుగా తనపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారని, తాను వారి ఒత్తిడికి తలొగ్గకపోవడంతోనే ఇలా మార్ఫింగ్ వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేశారని ఆమె వివరించారు. ఈ వ్యవహారంపై బాధ్యులపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని కృష్ణవేణి స్పష్టం చేశారు.

#ఆంధ్రప్రదేశ్ #APNews #తెలుగున్యూస్ #Breaking

Loading

 Save as PDF

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com
error: Content is protected !!