హైదరాబాద్ మౌలాలీ సమీపంలో విజయవాడ–సికింద్రాబాద్ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌పై ఓవర్‌హెడ్ విద్యుత్ తీగలు తెగిపడటంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. భారీ శబ్దాలతో కొందరు రైలు దిగి పరుగులు తీశారు. అప్రమత్తమైన లోకోపైలట్ వెంటనే రైలును నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు. సమాచారం అందుకున్న రైల్వే, విద్యుత్ శాఖ అధికారులు ఘటనాస్థలికి చేరుకుని సాంకేతిక లోపాన్ని పరిశీలించారు. విద్యుత్ తీగలను పునరుద్ధరించిన అనంతరం అదే రైలులో ప్రయాణికులను సికింద్రాబాద్‌కు తరలించారు.
![]()




