పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో ఇంధన పొదుపు పాటించాలన్న ప్రధాని మోదీ పిలుపునకు ఛత్తీస్‌గఢ్‌లో విశేష స్పందన లభించింది. నారాయణ్‌పుర్ ఎస్పీ గన్‌మెన్ కుబేర్ దెహారీ తన పెళ్లి బారాత్ కోసం కార్లను కాదని, ఎడ్లబండ్లను ఎంచుకున్నారు. మూడు కిలోమీటర్ల దూరంలోని వధువు ఇంటికి కుటుంబ సభ్యులతో కలిసి ఎడ్లబండిపైనే వెళ్లారు. ఈ నిర్ణయం ఇంధన ఆదాకే కాక, మన సంస్కృతిని కాపాడటానికేనని ఆయన తెలిపారు. కుబేర్ చొరవను అభినందిస్తూ రాష్ట్ర మంత్రి కేదార్ కశ్యప్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ వార్త వైరల్‌గా మారింది.
![]()




