తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుపై నెలకొన్న సందిగ్ధత తొలగిపోయింది. టీవీకే అధినేత విజయ్‌కు వీసీకే (2), ఐయూఎంఎల్ (2) పార్టీలు అధికారికంగా మద్దతు ప్రకటించాయి. ఇప్పటికే కాంగ్రెస్, వామపక్షాల మద్దతు ఉండటంతో టీవీకే బలం 120కి చేరి మెజార్టీ మార్కును దాటింది. మద్దతు లేఖలతో విజయ్ మరోసారి గవర్నర్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి కోరారు. దీంతో త్వరలోనే ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టేందుకు మార్గం సుగమమైంది. టీవీకే శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి.
![]()




