దేశంలో పెరుగుతున్న రహదారి ప్రమాదాలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. ఆర్టికల్ 21 ప్రకారం సురక్షిత ప్రయాణం పౌరుల ప్రాథమిక హక్కని, దీనిని కాపాడటం ప్రభుత్వాల బాధ్యతని స్పష్టం చేసింది. జాతీయ రహదారుల వెంబడి ఉన్న అక్రమ నిర్మాణాలను 60 రోజుల్లోగా తొలగించాలని కలెక్టర్లను ఆదేశించింది. ప్రతి 75 కి.మీలకు పార్కింగ్, విశ్రాంతి సౌకర్యాలు కల్పించాలని, 15 రోజుల్లోగా జిల్లా భద్రతా టాస్క్‌ఫోర్స్‌లను ఏర్పాటు చేయాలని సూచించింది. రెండు నెలల తర్వాత ఈ చర్యలపై కోర్టు సమీక్ష నిర్వహించనుంది.
![]()



