దేశవ్యాప్త జనగణనలో భాగంగా ఢిల్లీ, కర్ణాటక, గోవా సహా ఎనిమిది రాష్ట్రాల్లో ఏప్రిల్ 16 నుండి క్షేత్రస్థాయి గృహ గణన ప్రారంభం కానుంది. మే 15 వరకు ఎన్యూమరేటర్లు ప్రతి ఇంటికి వెళ్లి వివరాలు సేకరిస్తారని కేంద్రం తెలిపింది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ సహా ఆరు రాష్ట్రాల్లో రేపటి నుండే సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రక్రియ ప్రారంభమై ఏప్రిల్ 30 వరకు కొనసాగనుంది. ఇప్పటికే ఆన్‌లైన్ ద్వారా 12 లక్షల గృహాలు నమోదయ్యాయని, మే నెలలో ఏపీలో హౌస్ లిస్టింగ్ నిర్వహిస్తామని అధికారులు వెల్లడించారు.
![]()




