📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Tuesday, July 28, 2026
Visitors: 1,535,245  |  768 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుభారత్‌లో ఇన్‌స్టాగ్రామ్‌ బ్యాన్ అవాస్తవం: కేంద్ర ప్రభుత్వం, PIB స్పష్టతఉద్యోగ ప్రకటన: 40 వివిధ రకాల పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి యుపిఎస్సి దరఖాస్తుల ఆహ్వానంనూతన కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి: అదనపు బాధ్యతలు అప్పగించిన కేంద్ర ప్రభుత్వంనీట్ వివాదం వేళ ధర్మేంద్ర ప్రధాన్ ఆవేదన: విద్యాశాఖ పదవికి రాజీనామా చేస్తూ భావోద్వేగ లేఖహనీమూన్ హత్యలు - క్షీణిస్తున్న సాంఘిక విలువలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలుLatest Breaking News from PressMeetతాజా వార్తలుభారత్‌లో ఇన్‌స్టాగ్రామ్‌ బ్యాన్ అవాస్తవం: కేంద్ర ప్రభుత్వం, PIB స్పష్టతఉద్యోగ ప్రకటన: 40 వివిధ రకాల పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి యుపిఎస్సి దరఖాస్తుల ఆహ్వానంనూతన కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి: అదనపు బాధ్యతలు అప్పగించిన కేంద్ర ప్రభుత్వంనీట్ వివాదం వేళ ధర్మేంద్ర ప్రధాన్ ఆవేదన: విద్యాశాఖ పదవికి రాజీనామా చేస్తూ భావోద్వేగ లేఖహనీమూన్ హత్యలు - క్షీణిస్తున్న సాంఘిక విలువలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
Crime ⚡ AMP

ఉత్తర్‌ప్రదేశ్‌లో బీమా మోసం కోసం నకిలీ అంత్యక్రియలు – ప్లాస్టిక్‌ శవంతో స్కెచ్

November 28, 2025 November 28, 2025 0 Views
SHARE: Share Tweet WhatsApp Telegram

ఉత్తర్‌ప్రదేశ్‌ గ్రహ్‌ముక్తేశ్వర్‌లో బుధవారం చోటుచేసుకున్న విశేష సంఘటన బీమా మోసంపై పెద్ద ఎత్తున దృష్టిని సారించింది. హరియాణాకు చెందిన నలుగురు వ్యక్తులు గంగా ఘాట్‌కు అంత్యక్రియల పేరుతో ఒక శవాన్ని తీసుకుని వచ్చారు. అయితే వారి అనుమానాస్పద ప్రవర్తన స్థానికులను అప్రమత్తం చేసింది.

అంత్యక్రియల ముందు చేయాల్సిన ఆచారాలను విస్మరించి, నేరుగా చితిపై దహనం చేయాలని ప్రయత్నించడంతో స్థానికులు వారిని ఆపి విచారణకు దిగారు. శవంపై ఉన్న వస్త్రాన్ని తొలగించగా అది మనిషి శవం కాకుండా ప్లాస్టిక్‌ డమ్మీ అని బయటపడింది. వెంటనే మోసం అర్థమై, వచ్చిన నలుగురిలో ఇద్దరిని ప్రజలు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. మరో ఇద్దరు పరారయ్యారు.

తదుపరి విచారణలో నిందితులు మొదట “దిల్లీ ఆసుపత్రి పొరపాటున నిజమైన శవం బదులుగా డమ్మీని ఇచ్చింది” అనే అబద్ధం చెప్పారు. కానీ పోలీసులు కఠినంగా విచారించడంతో అసలు సంగతి బయటపడింది.

దిల్లీ కైలాస్‌పురికి చెందిన కమల్‌ సోమానీ రూ.50 లక్షలకు పైగా అప్పులు చేసుకున్నాడు. వాటి నుంచి తప్పించుకోవడానికి, ఉత్తమ్ నగర్‌కు చెందిన మిత్రుడు ఆశిష్ ఖురానాతో కలిసి భారీ బీమా మోసానికి పథకం వేసాడు. గతంలో తన వద్ద పనిచేసిన అన్షుల్‌ కుమార్‌ ఆధార్, పాన్‌ కార్డులు దొంగిలించి, అతని పేరుతో రూ.50 లక్షల జీవిత బీమా పాలసీ తీసుకున్నాడు. ఏటా ప్రీమియం చెల్లిస్తూ, అన్షుల్‌ మరణించినట్లు నకిలీ మరణ ధృవీకరణ పత్రం కూడ తెచ్చుకున్నాడు.

తర్వాత నకిలీ శవంతో నకిలీ అంత్యక్రియలు చేసి బీమా క్లెయిమ్‌ పొందాలనే యత్నం చేశారు. పోలీసులు అన్షుల్‌ను సంప్రదించగా, అతడు పూర్తి ఆరోగ్యంతో ఉన్నట్లు, తన పేరిట పాలసీ ఉన్న విషయం తెలియదని వెల్లడించాడు. దీంతో కమల్‌ సోమానీ, ఆశిష్ ఖురానా అరెస్టుకాగా, పరారీలో ఉన్న మరో ఇద్దరిపై గాలింపు కొనసాగుతోంది.


Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!