📰
PRESS MEET App తెలుగు వార్తలు చదవండి · Free Download
▶ Install App
March 10, 2026
🔴 BREAKING
🗞 తాజా వార్తలు
Uncategorized • Oct 27, 2024

హైదరాబాద్‌లో WWF-ఇండియా గోల్ఫ్ ఫర్ వైల్డ్‌లైఫ్ అవార్డుల ప్రదానోత్సవంలో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ

హైదరాబాద్‌లోని హోటల్ మరిగోల్డ్‌లో జరిగిన 9వ వార్షిక WWF-ఇండియా గోల్ఫ్ ఫర్ వైల్డ్‌లైఫ్ అండ్ నేచర్ చారిటీ గోల్ఫ్ టోర్నమెంట్‌లో గౌరవనీయ గవర్నర్ శ్రీ జిష్ణు దేవ్ వర్మ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో టోర్నమెంట్ విజేతలకు అవార్డులను ప్రదానం చేయడం జరిగింది. పర్యావరణ సంరక్షణ, అడవుల్లో వన్యప్రాణుల రక్షణకు సంబంధించిన సవాళ్లపై అవగాహన కలిగించడంలో ఈ టోర్నమెంట్ ముఖ్య పాత్ర పోషిస్తోంది. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, WWF-ఇండియా ప్రతినిధులు పాల్గొన్నారు.

Loading

📅 October 27, 2024🏷 Uncategorized
Khammam • Oct 26, 2024

కొత్తగూడెం పాల్వంచ పట్టణాలు పరిసర గ్రామాలను కలుపుతూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 177 ను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలి : సేవాలాల్ సేన

ఈరోజు సేవాలాల్ సేన సమావేశం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో జరిగింది ఈ సమావేశానికి ఉద్దేశించి జిల్లా అధ్యక్షులు ధరావత్ సురేష్ నాయక్ మాట్లాడుతూ కొత్తగూడెం పాల్వంచ పట్టణాలు పరిసర గ్రామాలను కలుపుతూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 177 ను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు జిల్లా కేంద్రంగా ఏజెన్సీ చట్టాలను తూట్లు పొడుస్తూ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు దిశగా అడుగులు వేయడం వల్ల ఏజెన్సీ గిరిజన ప్రజలకు తీరని అన్యాయం జరుగుతుందని అన్నారు ఏజెన్సీ హక్కులను గిరిజన ప్రజలు కోల్పోతారని వారికి రావాల్సిన ఉద్యోగాలు గిరిజన హక్కులు అన్ని కూడా హరిస్తాయని అన్నారు అభివృద్ధికి ఎవరు అడ్డంకి కాదని ఏజెన్సీ ప్రాంతాలుగా ఉన్నా కూడా లక్ష్మీదేవి పల్లి ,చుంచుపల్లి ,సుజాతనగర్ ,మండలాలలో ఉన్న గ్రామాలు అభివృద్ధి వైపు అడుగులు వేస్తూ ఉన్నాయని అన్నారు చుంచుపల్లి మండలం విద్యానగర్ గ్రామపంచాయతీ ఉదాహరణగా తీసుకుంటే మున్సిపల్ కార్పొరేషన్ కంటే ఎక్కువ అభివృద్ధి చెందుతూ వస్తుందని ఈ మండలంలో సీఎంఆర్ షాపింగ్ మాల్స్, జీవి మాల్స్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్స్ ,మరెన్నో కార్పొరేట్ సంస్థలు ఏజెన్సీ ప్రాంతంలోనే ఉన్నాయి కాబట్టి అభివృద్ధికి ఏజెన్సీ గ్రామాలు ఏ మాత్రం అడ్డంకి కాదని అన్నారు ఇది కేవలం కుట్రపూరితంగా ఈ గ్రామాలను మున్సిపల్ కార్పొరేషన్ చేసి అక్కడున్న గిరిజన ప్రజల భూములను లాక్కునిందుకే కొందరు ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఏజెన్సీ ప్రాంతాల జోలికి వస్తే తాడో పేడో తేల్చుకోవడనికి సేవాలాల్ సేన వెనుకడుగు వేయదని అన్నారు. భారత రాజ్యాంగం ఏజెన్సీ చట్టాలను గిరిజన ప్రజల అభివృద్ధి కోసం ప్రత్యేక చట్టాలు ఈ జిల్లాలో అమలౌతున్నాయని,వాటిని కొంతమంది బడాబాబుల అభివృద్ధి కోసం చేస్తున్న ప్రచారం అని అన్నారు. గిరిజన ప్రజలను అభివృద్ది పేరిట మోసం చేయాలని చూస్తున్న స్థానిక MLA. 5వ షెడ్యూల్ భూభాగంలో ఉన్న ప్రాంతాలు1/70 చట్టం,పీసా చట్టం అమలులో ఉన్న ప్రాంతంలో ఈ చట్టాలకు విరుద్ధంగా ఏజెన్సీ భాగాన్ని అభివృద్ధి పేరిట విధ్వంసానికి పాల్పడటం మానుకోవాలని హెచ్చరించారు. మున్సిపల్ కార్పొరేషన్ వలన ఏజన్సీ గిరిజన ప్రజలకు ఎలాంటి లాభమో తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు.ఏజెన్సీ 5వ షెడ్యూల్ ప్రాంతాన్ని మున్సిపల్ కార్పొరేషన్ చేయడం వలన స్వయం 100 రోజుల ఉపాధి, ఐటీడీఏ, ద్వారా వచ్చే అభివృద్ధి పథకాలు సర్పంచ్ ,ఉప సర్పంచ్, వార్డు మెంబర్స్, ఎంపీటీసీలు, జడ్పిటిసిలు ,ఎంపీపీ, వంటి పదవులతో పాటు వివిధ రకాల ఉద్యోగాలు గిరిజన ప్రజలు కోల్పోయే ప్రమాదం ఉన్నదని, పీసా చట్టం ప్రకారం పీసా గ్రామ సభల ద్వారా చేసే అభివృద్ధి కార్యక్రమాలకు కూడా కోల్పోతారని అన్నారు. కొత్తగూడెం పాల్వంచ మున్సిపాలిటీలతో పాటు చుంచుపల్లి, లక్ష్మీదేవి పల్లి,సుజాతనగర్, పాల్వంచ మండలాల లోపల కొన్ని ఏజెన్సీ గ్రామాలను కలుపుకొని మున్సిపల్ కార్పొరేషన్ చేసే ప్రయత్నాలను విరమించుకోవాలని హెచ్చరించారు. లేనియెడల దశల వారిగా ఉద్యమాలు ఆందోళనలు కార్యక్రమాలకు సేవాలాల్ సేన తీసుకుంటుoదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు జిల్లా ప్రధాన కార్యదర్శి లావుడియా వెంకటేష్ నాయక్ జిల్లా అధికార ప్రతినిధి బానోతు నాగరాజు నాయక్ రాందాస్ నాయక్ రాజేందర్ నాయక్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

Loading

📅 October 26, 2024🏷 Khammam
Nizamabad • Oct 19, 2024

నిజామాబాద్ జనరల్ ఆస్పత్రిలో ఏడాది వయసున్న బాలుడు అపహరణ

జిల్లా జనరల్ ఆస్పత్రిలో ఏడాది వయసున్న బాలుడు అపహరణకు గురయ్యాడు. కామారెడ్డి జిల్లా మద్నూర్ గ్రామానికి చెందిన లక్మి ఆనారోగ్యంతో జిల్లా జనరల్ ఆసుపత్రిలో వైద్యం కోసం శుక్రవారం రాత్రి చేరారు. భార్య చికిత్స పొందుతుండగా భర్త రాజు తన కుమారుడు మణికంఠతో కలిసి ఆసుపత్రిలో నిద్రించాడు. శనివారం ఉదయం లేచి చూసే సరికి కుమారుడు పక్కన లేకపోవడంతో ఆందోళనకు గురయ్యాడు. పరిసర ప్రాంతాల్లో వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆసుపత్రిలోని సీసీ టీవీ కెమెరాలను పరిశీలించగా..ముగ్గురు వ్యక్తులు మణికంఠను తీసుకెళ్లినట్లు ఉంది. పోలీసులు గాలింపు చేపట్టారు

Loading

📅 October 19, 2024🏷 Nizamabad
Business • Oct 19, 2024

టర్మ్, ఆరోగ్య బీమా పాలసీలకు GST నుంచి ఊరట: మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం

టర్మ్ పాలసీలతో పాటు సీనియర్ సిటిజన్ల ఆరోగ్య బీమా పాలసీలకు GST నుంచి ఊరట లభించే అవకాశం ఉంది. మంత్రివర్గ ఉపసంఘం శనివారం సమావేశమై, టర్మ్, ఆరోగ్య బీమా పాలసీలను మినహాయించాలనే చర్చ జరిగింది. రూ.5 లక్షల వరకు ఆరోగ్య బీమాపై GST మినహాయించాలని నిర్ణయించారు; దాటితే 18% GST విధించబడుతుంది. సీనియర్ సిటిజన్లకు కవరేజీ సంబంధం లేకుండా GST మినహాయించాలి అని పేర్కొన్నారు. బీమా ప్రీమియమ్స్‌పై GST తొలగించాలన్న డిమాండ్ల నేపథ్యంలో 13 మంది సభ్యులతో మంత్రివర్గ ఉప సంఘం ఏర్పాటైంది. ఈ కమిటీ ఈ నెలాఖరుకు కౌన్సిల్‌కు నివేదిక సమర్పించనుంది.

Loading

📅 October 19, 2024🏷 Business
Uncategorized • Oct 19, 2024

రాబోయే నాలుగున్నరేళ్లలో 20 లక్షల ఇందిరమ్మ ఇళ్లు: మంత్రి పొంగులేటి

TG: తెలంగాణలో మార్పు కోరుతూ ప్రజలు ఇందిరమ్మ రాజ్యాన్ని తిరిగి తీసుకువచ్చారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గోషామహల్‌లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఈ నెలాఖరుకల్లా ప్రతి నియోజకవర్గంలో 3500-4000 ఇందిరమ్మ ఇళ్లు పంపిణీ చేస్తామని వెల్లడించారు. అర్హత ఉన్న వారికి ఎలాంటి రికమండేషన్ అవసరం లేదని స్పష్టం చేశారు. రాబోయే నాలుగున్నరేళ్లలో 20 లక్షల ఇళ్ల నిర్మాణం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు.

Loading

📅 October 19, 2024🏷 Uncategorized
Uncategorized • Oct 19, 2024

నిజామాబాద్‌లో దారుణం: మహిళపై నలుగురి సామూహిక అత్యాచారం

NZB: నిజామాబాద్‌ జిల్లాలో శుక్రవారం రాత్రి ఓ మహిళపై నలుగురు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆటోలో ఎక్కించుకుని డిచ్‌పల్లి ప్రాంతానికి తీసుకెళ్లి ఈ అఘాయిత్యం చేశారు. బాధితురాలు శనివారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేశారు. డిచ్‌పల్లికి చెందిన వారు ఈ ఘటనలో పాల్గొన్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించి, బస్టాండ్‌ వద్ద ఆటోకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు.

Loading

📅 October 19, 2024🏷 Uncategorized
Telangana • Oct 18, 2024

దేవాలయం విగ్రహ ధ్వంసానికి నిరసనగా సికింద్రాబాద్ బంద్‌కు స్థానికుల పిలుపు

TG: సికింద్రాబాద్‌లో పిలుపునిచ్చిన బంద్‌కి స్పందిస్తూ, స్థానికులు ముత్యాలమ్మ ఆలయ సంఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముత్యాలమ్మ ఆలయ విగ్రహ ధ్వంసం ప్రజల మనోభావాలను దెబ్బతీసిందని, ఈ విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈటల రాజేందర్ మాట్లాడుతూ, “దేవాలయాలపై దాడులు మతపరమైన వైషమ్యానికి దారితీస్తాయి, ఇది సహించరాని విషయం” అని చెప్పారు. బంద్ సందర్భంగా పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు.

Loading

📅 October 18, 2024🏷 Telangana
Warangal • Oct 18, 2024

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉచిత మెగా హెల్త్ క్యాంప్

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందికి ఈనెల 19న భీమారం శుభం పోలీస్ కళ్యాణ వేదికలో ఉదయం 9 గంటలకు ఉచిత మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించనున్నట్లు పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ప్రకటించారు. ఈ హెల్త్ క్యాంప్‌లో పోలీస్ సిబ్బందికి వివిధ ఆరోగ్య పరీక్షలు, చికిత్సలు ఉచితంగా అందించనున్నట్లు వివరించారు. ఈ ప్రయత్నాన్ని ప్రశంసిస్తూ, TGSRTC ఎండీ సజ్జనార్ సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్ ‘X’లో పోస్టు చేశారు. హెల్త్ క్యాంప్‌ను సద్వినియోగం చేసుకుని ఆరోగ్యంపై మరింత శ్రద్ధ తీసుకోవాలని పోలీస్ సిబ్బందిని కోరారు.

Loading

📅 October 18, 2024🏷 Warangal
Telangana • Oct 18, 2024

సింగరేణిలో భూగర్భంలో ఐదేళ్ల నిబంధన..!

సింగరేణిలో డిపెండెంట్‌ కింద ఎవరు చేరినా మొదటి ఐదేళ్లు తప్పనిసరిగా భూగర్భంలోకి దిగి పని చేసేలా కొత్త నిబంధనలు తయారు చేయాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. ఇదివరకు ఈ తరహా నిబంధనలు ఉన్నా మెడికల్‌ రిపోర్టులు, పైరవీలు, సంఘాల పేరు చెప్పుకొని అండర్‌ గ్రౌండ్‌ నుంచి వచ్చి సర్ఫేస్‌లో తిష్ట వేస్తున్నారు. దీంతో లోపల దిగి పనిచేసే వారు కరువయ్యారు. ఇకముందు అలా జరుగుండా కఠిన నిబంధనలు తీసుకొస్తున్నారు. విధివిధానాలు తయారు చేయాల్సి ఉంది. సర్ఫేస్‌లో ఖాళీలు ఉంటే ఆ డిజిగ్నేషన్లకు రావడానికి ఇక కనీస అర్హత అండర్‌గ్రౌండ్‌ల్‌లో ఐదేళ్లు పని చేయాలనే నిబంధన తప్పని సరిచేసే అవకాశం ఉందని తెలిసింది.

Loading

📅 October 18, 2024🏷 Telangana
Telangana • Oct 18, 2024

బేగంపేట ప్రకాశ్‌నగర్‌లో 700 కిలోల కుళ్లిన చికెన్‌ స్వాధీనం

సికింద్రాబాద్‌ పరిధిలోని బేగంపేట ప్రకాశ్‌నగర్‌లో 700 కిలోల కుళ్లిన చికెన్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆహార భద్రత టాస్క్‌ఫోర్స్‌ అధికారులు ఇక్కడి బాలయ్య చికెన్ సెంటర్‌లో తనిఖీలు చేపట్టారు. మద్యం దుకాణాలకు చికెన్‌ సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. కుళ్లిన కోడి మాంసం, కొవ్వు పదార్థాలు, కోడి ఎముకలకు కెమికల్స్ కలిపి ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లు, మద్యం దుకాణాలకు అమ్ముతున్నట్లుగా నిర్ధరించారు. అనంతరం అధికారులు చికెన్ సెంటర్‌ను సీజ్ చేశారు.

Loading

📅 October 18, 2024🏷 Telangana
error: Content is protected !!