📰
PRESS MEET App తెలుగు వార్తలు చదవండి · Free Download
▶ Install App
March 10, 2026
🔴 BREAKING
🗞 తాజా వార్తలు
Telangana • Oct 18, 2024

బేగంపేట ప్రకాశ్‌నగర్‌లో 700 కిలోల కుళ్లిన చికెన్‌ స్వాధీనం

సికింద్రాబాద్‌ పరిధిలోని బేగంపేట ప్రకాశ్‌నగర్‌లో 700 కిలోల కుళ్లిన చికెన్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆహార భద్రత టాస్క్‌ఫోర్స్‌ అధికారులు ఇక్కడి బాలయ్య చికెన్ సెంటర్‌లో తనిఖీలు చేపట్టారు. మద్యం దుకాణాలకు చికెన్‌ సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. కుళ్లిన కోడి మాంసం, కొవ్వు పదార్థాలు, కోడి ఎముకలకు కెమికల్స్ కలిపి ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లు, మద్యం దుకాణాలకు అమ్ముతున్నట్లుగా నిర్ధరించారు. అనంతరం అధికారులు చికెన్ సెంటర్‌ను సీజ్ చేశారు.

Loading

📅 October 18, 2024🏷 Telangana
National • Oct 18, 2024

తమిళనాడులో హిందీ మాస వేడుకలపై సీఎం స్టాలిన్‌ వ్యతిరేకత: ప్రధానికి లేఖ

తమిళనాడులో హిందీ భాషపై మరోసారి విరుచుకుపడింది. ప్రధాని మోదీకి లేఖ రాసిన సీఎం స్టాలిన్, రాష్ట్రంలో హిందీ మాస వేడుకలు రద్దు చేయాలని కోరారు. “హిందీ మాట్లాడని రాష్ట్రాల్లో ఉత్సవాలు ఎందుకు?” అని ప్రశ్నించారు. రాజ్యాంగం ఏ భాషకు జాతీయ హోదా ఇవ్వకపోవడం, చట్టం, న్యాయవ్యవస్థ, కమ్యూనికేషన్ కోసం ఇంగ్లీష్, హిందీని ఉపయోగించడం విశేషం. స్థానిక భాష మాస వేడుకలు జరుపుకోవాలని, సాంస్కృతిక భాషలకు సంబంధించిన ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు.

Loading

📅 October 18, 2024🏷 National
National • Oct 18, 2024

సద్గురు ఈశా ఫౌండేషన్‌పై కేసును సుప్రీంకోర్టు కొట్టివేసింది

విద్యార్థులు, యువతలో నైపుణ్యాలను మెరుగుపరిచి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు పారిశ్రామిక సంస్థల భాగస్వామ్యంతో నెలకొల్పిన యంగ్ ఇండియా తెలంగాణ స్కిల్స్ యూనివర్శిటీకి అదానీ గ్రూప్ రూ. 100 కోట్ల విరాళం అందించింది. అదానీ గ్రూప్ చైర్‌పర్సన్ గౌతమ్ అదానీ గారి నేతృత్వంలోని అదానీ ఫౌండేషన్ ప్రతినిధి బృందం CM రేవంత్ రెడ్డిని కలిసి ఈ మేరకు చెక్కును అందజేశారు. నైపుణ్యాభివృద్ధి, యువత సాధికారత కోసం తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు నిరంతర మద్దతు ఉంటుందని గౌతమ్ అదానీ పేర్కొన్నారు. ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఇతర అధికారులు కూడా ఉన్నారు.

Loading

📅 October 18, 2024🏷 National
Khammam • Oct 18, 2024

జీవో నెం 29 ను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయాలి రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించాలి : సేవాలాల్ సేన

ఈరోజు సేవాలాల్ సేన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు ధరావత్ సురేష్ నాయక్ అధ్యక్షతన జిల్లా గ్రంథాలయం ఎదురుగా జీవో నెంబర్ 29 రద్దు పరచాలని రూల్ ఆఫ్ రిజర్వేషన్లు పాటించాలని రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు జీవో నెంబర్ 29 వల్ల గ్రూప్ వన్ అభ్యర్థులకు విద్యార్థులకు ఎస్సీ ఎస్టీ బీసీ కులాల వారికి అన్యాయం జరుగుతా ఉందని అన్నారు ఈ రాష్ట్రంలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ ద్వారానే ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకు న్యాయం జరుగుతుందని అన్నారు గ్రూప్ వన్ పరీక్షలు ఈనెల 21వ తేదీ నుంచి నిర్వహించడం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 29 తీసుకువచ్చి ఈ రాష్ట్రంలో అగ్రవర్ణాలకు పట్టం కట్టాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం చూస్తుందని అన్నారు ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ గ్రూప్ వన్ అభ్యర్థులు హైకోర్టులో దాదాపుగా 20 కేసుల వరకు వేసి ఉన్నారు కానీ వాటిని ఈ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకుండా హడావిడిగా ఈ గ్రూపు వన్ పరీక్షలను ఎలాగైనా నిర్వహించాలని పట్టుదలతో ముందుకు వెళ్లడం చాలా సిగ్గుచేటు ఒకవైపు అభ్యర్థులు హైకోర్టులో వేసిన కేసులు క్లియర్ అయిన తర్వాతనే గ్రూప్ వన్ పరీక్షలు నిర్వహించాలని ధర్నాలు రాస్తారోకోలు చేస్తా ఉంటే మరోవైపు ఈ రాష్ట్ర ప్రభుత్వం తన పంతాన్ని నెగ్గించుకోవడం కోసం అభ్యర్థులను బలి చేస్తా ఉన్నదని అన్నారు. అగ్రవర్ణాలకు ఈ రాష్ట్రంలో ఆరు శాతం ఉన్నవారికి10 శాతం రిజర్వేషన్ అమలు చేస్తూ ఎస్సీ ఎస్టీ బీసీలకు అన్యాయం చేస్తున్నారని అన్నారు తరతరాలుగా దోపిడీకి గురైన కులాలకు సామాజికంగా వివక్షతకు గురి అయిన కులాలకు విద్యాపరంగా సామాజికంగా వెనుకబడిన కులాలకు రాజ్యాంగ నిర్మాత లు సామాజిక కోణంలో సహజ న్యాయ సూత్రాలకు అనుగుణంగా ఏర్పాటు చేసింది రిజర్వేషన్ ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీలకు దక్కకుండా చేస్తున్నారుఈ ఈ ఈ డబ్ల్యూ ఎస్ రిజర్వేషన్ ఉపయోగించుకొని నేటి వరకు ఎంత మందికి ఉద్యోగాలు వచ్చాయో వారందరినీ ఈ డబ్ల్యూ ఎస్ సర్టిఫికెట్లను వెరిఫై చేయాలి ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం ఈ డబ్ల్యూ ఎస్ టిక్కెట్లు జారీ చేశారా లేదా అని నిగ్గు తేల్చాలి ఆక్రమంగా సర్టిఫికెట్ పొందిన వారికి ఉద్యోగం నుంచి తొలగించి క్రిమినల్ చర్యలు చేపట్టాలి ఆ సర్టిఫికెట్ జారీ చేసిన వారిపై కూడా క్రిమినల్ చర్యలు తీసుకోవాలని నేటి వరకు వారు పొందిన జీతభత్యాలను రికవరీ చేయాలి ఆయా స్థానాలలో ఉద్యోగాలు కోల్పోయిన ఎస్సీ ఎస్టీ బీసీ యువతకు ఉద్యోగాలు ఇవ్వాలి ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలకు జరుగుతున్న నష్టాన్ని నివారించాలంటే ఒకటి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ రద్దు చేయాలి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ డబ్ల్యూ ఎస్ రిజర్వేషన్ అమలు నిలిపివేసి పాత విధానాన్ని కొనసాగిస్తూ నియామకాలు చేపట్టాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సేవాలాల్ సేన రాష్ట్ర కార్యదర్శి శ్రీను నాయక్ జిల్లా ప్రధాన కార్యదర్శి లావుడియా వెంకటేష్ నాయక్ జిల్లా అధికార ప్రతినిధి బానోతు నాగరాజు నాయక్ జూలూరుపాడు మండల అధ్యక్షులు బానోతు లక్ష్మణ్ నాయక్ పవన్ రమేష్ నాయక్ పవన్ నాయక్ దేవేందర్ నాయక్ సురేష్ నాయక్ బాలు నాయక్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

Loading

📅 October 18, 2024🏷 Khammam
National • Oct 17, 2024

రైల్వే టికెట్‌ బుకింగ్‌ నిబంధనల్లో మార్పు: 120 రోజుల బుకింగ్‌ వ్యవధి 60 రోజులకు కుదింపు

భారతీయ రైల్వే టికెట్‌ రిజర్వేషన్లకు కీలక మార్పులు చేసింది. 120 రోజుల ముందు బుకింగ్‌ చేసుకునే సదుపాయాన్ని 60 రోజులకు కుదించింది. ఈ మార్పు 2024 నవంబర్‌ 1 నుంచి అమల్లోకి రానుంది. అయితే, ఇప్పటికే బుకింగ్‌ చేసుకున్న వారికి ఎటువంటి ఇబ్బంది ఉండదని స్పష్టం చేశారు. అక్టోబర్‌ 31 వరకు పాత నిబంధనలు వర్తిస్తాయి. తాజ్‌ ఎక్స్‌ప్రెస్‌, గోమతి ఎక్స్‌ప్రెస్‌ వంటి రైళ్ల బుకింగ్‌లో మార్పుల్లేవు. విదేశీ పర్యాటకులు మాత్రం 365 రోజుల ముందే బుకింగ్‌ చేసుకునే అవకాశం యథావిధిగా కొనసాగుతుంది.

Loading

📅 October 17, 2024🏷 National
Telangana • Oct 17, 2024

తెలంగాణలో రేపు ఉరుములు, మెరుపులతో వర్షాలు: పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్

తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రేపు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. నారాయణపేట, గద్వాల, నాగర్ కర్నూల్, మహబూబ్‌నగర్, కామారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, జనగామ, వరంగల్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, కొత్తగూడెం, ఖమ్మం తదితర జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది.

Loading

📅 October 17, 2024🏷 Telangana
Telangana • Oct 17, 2024

సింగరేణి జోనల్ లెవెల్ రెస్క్యూ పోటీలు ఘనంగా ప్రారంభం

సింగరేణి యైటింక్లైన్ లైన్ కాలనీ రెస్క్యూ స్టేషన్‌లో జోనల్ లెవెల్ రెస్క్యూ పోటీలు ప్రతిష్టాత్మకంగా ప్రారంభం. ఈ పోటీలలో సింగరేణి సంస్థకు చెందిన వివిధ ఏరియాల నుంచి రామగుండం ఏరియా 1, 2, 3, ALP, శ్రీరాంపూర్, బెల్లంపల్లి, మందమర్రి, భూపాలపల్లి, కొత్తగూడెం, ఎల్లందు, మణుగూరు జట్లు పాల్గొననున్నాయి. ఇవి కార్మికుల సురక్షిత చర్యలు, అవగాహన, అత్యవసర పరిస్థితుల్లో రక్షణ సామర్థ్యాలను పరీక్షించడంలో కీలకంగా ఉంటాయి. రెండురోజుల పాటు జరిగే ఈ పోటీలు సంస్థ లో సురక్షిత వ్యవస్థలకు ప్రాధాన్యం ఇవ్వడానికి మద్దతుగా ఉంటాయి. ఈ కార్యక్రమానికి సింగరేణి సంస్థ CMD బలరాం, ఉన్నతాధికారులు వెంకటేశ్వర రెడ్డి, భూషణ్ ప్రసాద్, ఉమేష్, సావర్కర్ తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొననున్నారు. రక్షణా చర్యల పరంగా సింగరేణి సంస్థ చేస్తున్న ప్రగతిని ఎలాగు ఈ పోటీలు ప్రతిబింబిస్తాయని అధికారులు భావిస్తున్నారు.

Loading

📅 October 17, 2024🏷 Telangana
Telangana • Oct 17, 2024

మాదిగల నిరసనలు: సీఎం రేవంత్ రెడ్డి ఎదుట కొత్త సవాలు

హైదరాబాద్: MRPS వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నిరసనలతో సవాలు విసిరారు. మాదిగల సమస్యలను పరిష్కరించకుండా తటస్థంగా ఉంటే, రేవంత్ రెడ్డి ప్రభుత్వం పెద్ద ఎత్తున ఉద్యమాలకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. మాదిగలు గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ప్రకటించారు. నవంబర్ 4 నుండి 14 వరకు మాదిగల ధర్మయుద్ధ దీక్షలు చేపడతామని, కోదాడ నుండి నవంబర్ 16 నుండి డిసెంబర్ 20 వరకు ధర్మయుద్ధ రథయాత్ర ప్రారంభమవుతుందని తెలిపారు. “ప్రభుత్వం మా ఆవేదనను పరిగణనలోకి తీసుకోకపోతే, సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ మరింత కఠినమైన ఉద్యమాలు చేస్తాం” అని మందకృష్ణ మాదిగ పేర్కొన్నారు

Loading

📅 October 17, 2024🏷 Telangana
Karimnagar • Oct 17, 2024

జగిత్యాల: ట్రాన్స్‌జెండర్‌తో యువకుడి ప్రేమ వివాహం

జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం లక్ష్మీపూర్‌కు చెందిన కుమార్, మ్యాడంపెల్లికి చెందిన ట్రాన్స్‌జెండర్ కరుణంజలితో ప్రేమ వివాహం చేసుకోవడం స్థానికంగా చర్చనీయాంశమైంది. వీరిద్దరూ కొంత కాలంగా ప్రేమలో ఉన్నారు. వారి ప్రేమ గురించి పెద్దలకు తెలియజేసి, వారి అంగీకారంతో బుధవారం వివాహం చేసుకున్నారు. ఈ వివాహం సామాజికంగా ప్రాధాన్యం సంతరించుకుంది, ఎందుకంటే ట్రాన్స్‌జెండర్లకు వివాహం జరగడం అరుదుగా కనిపించే సంఘటన. ట్రాన్స్‌జెండర్ సమాజం నుండి పెద్దఎత్తున మద్దతు లభించింది. వివాహానికి జగిత్యాల జిల్లా ట్రాన్స్‌జెండర్ల అధ్యక్షురాలు నిహారిక, ఇతర సభ్యులు అలకుంట ప్రశాంతి, రాంబాయి, జానూ, రాధికా, రమ్య, ఆరోహి పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ వివాహం ట్రాన్స్‌జెండర్ సమాజానికి ప్రోత్సాహకరంగా ఉండటమే కాకుండా, సమానత్వానికి మరియు స్వీకారానికి సంకేతంగా నిలిచింది.

Loading

📅 October 17, 2024🏷 Karimnagar
National • Oct 17, 2024

పౌరసత్వ చట్టంలోని సెక్షన్ 6Aను సమర్థించిన సుప్రీంకోర్టు

సుప్రీంకోర్టు పౌరసత్వ చట్టంలోని సెక్షన్ 6Aను రాజ్యాంగం ప్రకారం చెల్లుబాటుగా సమర్థిస్తూ కీలక తీర్పును వెలువరించింది. 5 న్యాయమూర్తుల ధర్మాసనంలో నలుగురు న్యాయమూర్తులు సెక్షన్ 6Aకు మద్దతు తెలుపగా, జస్టిస్ పార్థీవాలా వ్యతిరేకించారు. ఆయన అభిప్రాయం ప్రకారం, విదేశీయులు పౌరసత్వం పొందినా వారిని పదేళ్ల వరకు ఓటరు జాబితాలో చేర్చడం కుదరదని స్పష్టం చేశారు. సెక్షన్ 6A 1985లో రాజీవ్ గాంధీ ప్రభుత్వం చేర్చిన సవరణ ద్వారా పౌరసత్వ చట్టంలోకి వచ్చింది. 1966 నుండి 1971 మధ్య అస్సాంలోకి బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చిన వారికి పౌరసత్వం కల్పిస్తూ ఈ సెక్షన్ ప్రవేశపెట్టబడింది. అస్సాంలో వలసదారుల సమస్యను పరిష్కరించడానికి ఈ సెక్షన్ కీలకంగా భావించబడింది. 1966 ముందు వచ్చిన వలసదారులు స్వయంచాలకంగా పౌరసత్వాన్ని పొందారు, కానీ 1966-71 మధ్య వచ్చిన వారికి పౌరసత్వం ఇచ్చినా, 10 సంవత్సరాల కాలానికి ఓటరు హక్కు నిరాకరించబడింది.ఈ సెక్షన్ చట్టబద్ధతను సవాలు చేస్తూ గతంలో కేసులు దాఖలు కాగా, సుప్రీంకోర్టు ఈసారి దీన్ని రాజ్యాంగబద్ధమైనదిగా సమర్దించింది.

Loading

📅 October 17, 2024🏷 National
error: Content is protected !!