మాదిగల నిరసనలు: సీఎం రేవంత్ రెడ్డి ఎదుట కొత్త సవాలు

హైదరాబాద్: MRPS వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నిరసనలతో సవాలు విసిరారు. మాదిగల సమస్యలను పరిష్కరించకుండా తటస్థంగా ఉంటే, రేవంత్ రెడ్డి ప్రభుత్వం పెద్ద ఎత్తున ఉద్యమాలకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు.

మాదిగలు గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ప్రకటించారు. నవంబర్ 4 నుండి 14 వరకు మాదిగల ధర్మయుద్ధ దీక్షలు చేపడతామని, కోదాడ నుండి నవంబర్ 16 నుండి డిసెంబర్ 20 వరకు ధర్మయుద్ధ రథయాత్ర ప్రారంభమవుతుందని తెలిపారు.

“ప్రభుత్వం మా ఆవేదనను పరిగణనలోకి తీసుకోకపోతే, సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ మరింత కఠినమైన ఉద్యమాలు చేస్తాం” అని మందకృష్ణ మాదిగ పేర్కొన్నారు

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!