తెలంగాణ పంచాయతీ ఎన్నికలు – ఓటర్లకు గుర్తింపు కార్డు సూచనలు

  • తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలు మూడు విడతల్లో — డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో జరుగనున్నాయి.
  • పోలింగ్‌కు వచ్చే ఓటర్లు తప్పనిసరిగా గుర్తింపు పత్రం తీసుకురావాలని జిల్లా ఎన్నికల అధికారులు సూచించారు.
  • ఓటరు గుర్తింపు కార్డు లేని పక్షంలో, ఎలక్షన్ కమిషన్ అనుమతించిన 18 రకాల గుర్తింపు పత్రాల్లో ఏదైనా ఒకటి తీసుకురావచ్చు.

అంగీకరించిన 18 గుర్తింపు కార్డులు:

  1. ఆధార్ కార్డు
  2. నెరేగా జాబ్ కార్డు
  3. బ్యాంక్/పోస్ట్ ఆఫీస్ ఫోటో పాస్‌బుక్
  4. హెల్త్ ఇన్సూరెన్స్ స్మార్ట్ కార్డు
  5. డ్రైవింగ్ లైసెన్స్
  6. పాన్ కార్డు
  7. ఎస్సీ/ఎస్టీ/బీసీ కుల ధృవీకరణ పత్రం (ఫోటోతో)
  8. భారత పాస్‌పోర్ట్
  9. పెన్షన్ డాక్యుమెంట్ (ఫోటోతో)
  10. ప్రభుత్వ ఉద్యోగుల ఐడీ కార్డు
  11. ఎమ్మెల్యే/ఎంఎంఎల్‌సీ ఐడీ కార్డులు
  12. దివ్యాంగుల గుర్తింపు కార్డు
  13. పట్టాదార్ పాస్‌బుక్
  14. రేషన్ కార్డు
  15. ఆయుధ లైసెన్స్ (ఫోటోతో)
  16. స్వాతంత్ర్య సమరయోధుల ఐడీ
  17. NPR స్మార్ట్ కార్డు
  18. ఎంపీలు పొందే గుర్తింపు కార్డు
  • పోలింగ్ కేంద్రాల్లో వృద్ధులు, మహిళలు, దివ్యాంగుల కోసం ప్రత్యేక సహాయం అందుబాటులో ఉంటుంది.
  • అధికారులు ప్రజాస్వామ్య హక్కును వినియోగించుకోవాలని, తప్పనిసరిగా ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!