📰
PRESS MEET App తెలుగు వార్తలు చదవండి · Free Download
▶ Install App
March 10, 2026
🔴 BREAKING
🗞 తాజా వార్తలు
Khammam • Nov 28, 2024

కార్మిక సమస్యలపై యాక్టింగ్ జనరల్ మేనేజర్ ను కలిసిన ఐఎన్‌టీయూసీ వైస్ ప్రెసిడెంట్ రజాక్

కార్మిక సమస్యలపై యాక్టింగ్ జీఎం బి. రవీందర్ ను కలసిన ఐ ఎన్ టీ యు సి వైస్ ప్రెసిడెంట్ ఎండీ రజాక్.కేజీఎం ఏరియా కార్మికులు ఎదురుకుంటున్న ఈ క్రింది సమస్యలను వైస్ ప్రెసిడెంట్ రజాక్ యాక్టింగ్ జీఎం బి. రవీందర్ దృష్టికి తీసుకురావడం జరిగినది.పీవీకే 5 లో ప్రతి రెండు సంవత్సరాలకు ఇచ్చే చలి కోట్లు సరిపడినంత ఏరియా స్టోర్ నుండి పంపించకపోవడం వల్ల కార్మికులు ఇబ్బందులను ఎదురుకున్నారు. ప్రతి రెండు సంవత్సరాకు ఎంత స్టాక్ పంపించాలో అంత స్టాక్ ను పంపించే ఏర్పాటు చేయమని జీఎం ను కోరడం జరిగినది. అదేవిదంగా కోయగూడెం నుండి ఆర్ సి హెచ్ పి కి బొగ్గు లోడింగ్ వచ్చే టిప్పర్లను 5ఇంక్లైన్ రోడ్ నుండి కాకుండా వేరే రూట్ కు డైవర్ట్ చేయడానికి తగిన ఏర్పాటు చేయాలనీ , ఏరియాలో ఉన్న కార్మిక సమస్యలపై యాక్టింగ్ జీఎం తో మాట్లాడటం జరిగింది. అదేవిదంగా కార్మికుడు కారుణ్య నియామకం ద్వారా అన్ఫిట్ అయి కొడుకుకి డిపెండెంట్ ఉద్యోగానికి ఇంటర్వ్యూ కు వెళ్తే 10 th పాస్ సర్టిఫికెట్ తెస్తే ఇంటర్వ్యూ చేస్తామని అధికారులు చెపుతున్నారు. పది చదవని వారు ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయమై ఐ ఎన్ టీ యు సి సెక్రటరి జనరల్ జానక్ ప్రసాద్ గారు ఆ సర్ క్యూలర్ ను రద్దు చేయాలనీ సి అండ్ ఎండీ కు మెమోరాండం ఇవ్వడం జరిగినది, అని తెలపడం జరిగింది.

Loading

📅 November 28, 2024🏷 Khammam
National • Nov 28, 2024

తెలంగాణలో బీజేపీ శక్తివంతమైన పార్టీ – శాసనసభ్యులు, ఎంపీలతో ప్రధాన మంత్రి కీలక సమావేశం

తెలంగాణలో బీజేపీ శాసనసభ్యులు, ఎంపీలు పాల్గొన్న ప్రత్యేక సమావేశం విజయవంతంగా జరిగింది. సమావేశంలో నాయకులు రాష్ట్రంలో పార్టీ వేగంగా విస్తరిస్తోందని, ప్రజలు కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పాలనలపై విసిగిపోయి బీజేపీ వైపు ఆశతో చూస్తున్నారని అభిప్రాయపడ్డారు.బీఆర్‌ఎస్ దుష్టపాలన వల్ల ప్రజలు బాధలను ఎదుర్కొంటున్నారని, కాంగ్రెస్‌ ప్రజావ్యతిరేక విధానాలు మరోవైపు అసంతృప్తిని కలిగించాయని పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో బీజేపీ తన అభివృద్ధి ఎజెండాతో ప్రజల విశ్వాసం పొందుతుందని స్పష్టం చేశారు.అయితే, కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌కి వ్యతిరేకంగా బీజేపీ తన రాజకీయ స్వరాన్ని గట్టిగా వినిపిస్తూనే ఉంటుందని, కార్యకర్తలు అన్ని స్థాయిలలో పార్టీని మరింత బలపరుస్తారని నాయకులు తెలిపారు.

Loading

📅 November 28, 2024🏷 National
Karimnagar • Nov 27, 2024

జగిత్యాల: కన్నతల్లిని స్మశానంలో వదిలేసిన కసాయి కొడుకులు

జగిత్యాల పట్టణంలోని మోతె స్మశానవాటికలో రాజవ్వ అనే వృద్ధురాలు గత ఎనిమిది రోజులుగా అనారోగ్య పరిస్థితుల్లో ఉండటం కలకలం రేపింది. తన పెన్షన్ డబ్బుల కోసం కొడుకు దారుణంగా ప్రవర్తించి చితకబాదినట్లు సమాచారం. ఈ దాడిలో ఆమె కాలు విరిగి అచేతన స్థితికి చేరింది. నలుగురు కొడుకులు ఉన్నా తాను ఇలా వదిలేయబడిందని రాజవ్వ కన్నీరు మున్నీరుగా రోదించింది. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు సంక్షేమశాఖ అధికారులకు సమాచారం అందించారు. స్పందించిన సంక్షేమశాఖ అధికారి నరేష్ ఆమెను ఆస్పత్రికి తరలించారు. చర్యలు:వయోవృద్ధుల హక్కులను కాపాడే చట్టం ప్రకారం రాజవ్వపై అన్యాయం చేసిన వారి మీద కఠిన చర్యలు తీసుకుంటామని నరేష్ ప్రకటించారు. తల్లి బాగోగులు చూడకపోవడం చట్టవిరుద్ధమని, అందులో పాల్గొన్న వారిని శిక్షించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Loading

📅 November 27, 2024🏷 Karimnagar
Uncategorized • Nov 26, 2024

సినీ గీత రచయిత కులశేఖర్ కన్నుమూత

ప్రసిద్ధ సినీ గీత రచయిత కులశేఖర్ (53) మంగళవారం తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఈ వార్త తెలుగు సినిమా రంగంలో దిగ్భ్రాంతి కలిగించింది. కులశేఖర్‌ తన సాహిత్య ప్రతిభతో అనేక హిట్ పాటలు రాశారు. తెలుగు సినీ పరిశ్రమలో ఆయన రచనలు హృదయానికి హత్తుకునే భావాలతో అందరినీ అలరించాయి. ముఖ్యంగా ప్రేమకథా చిత్రాలకు ఆయన కలం ప్రత్యేకమైన రుచిని తీసుకువచ్చింది. అనేక ప్రముఖ హీరోలు, సంగీత దర్శకులతో కలిసి ఆయన పని చేశారు. కులశేఖర్ మృతి తెలుగు సినిమా సంగీత ప్రపంచానికి తీరనిది. కుటుంబ సభ్యులు, సన్నిహితులు, అభిమానులు ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. తెలుగు సాహిత్య ప్రపంచం ఆయన వంటి మేటి గీత రచయితను కోల్పోవడంతో విచారం వ్యక్తం చేస్తోంది.

Loading

📅 November 26, 2024🏷 Uncategorized
National • Nov 26, 2024

భారత రాజ్యాంగం దేశ పవిత్ర గ్రంథం: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

భారత రాజ్యాంగ వజ్రోత్సవ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమె రాజ్యాంగాన్ని దేశం యొక్క పవిత్ర గ్రంథంగా అభివర్ణించారు. “75 ఏళ్ల క్రితం ఈ రోజు భారత రాజ్యాంగం ఆమోదం పొందింది. ప్రజాస్వామ్య, గణతంత్ర సూత్రాల ఆధారంగా రూపొందించిన ఈ రాజ్యాంగం దేశానికి అద్భుతమైన మార్గదర్శకత్వం అందించింది. రాజ్యాంగ రూపకల్పనలో డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ముఖ్యమైన పాత్ర పోషించారు. సమానత్వం, స్వేచ్ఛ, సామరస్యం, సౌభ్రాతృత్వం వంటి ప్రగతిశీల సూత్రాలను ఇందులో పొందుపరిచారు,” అని రాష్ట్రపతి వివరించారు. రాజ్యాంగం మనం కలిగి ఉన్న హక్కుల రక్షణకు, బాధ్యతలపై దృష్టి సారించడానికి మరియు దేశాన్ని ముందుకు నడిపించే మార్గదర్శకత్వానికి ప్రధాన ఆధారమని ఆమె పేర్కొన్నారు. ఈ చారిత్రాత్మక సందర్భంలో, ప్రతి భారతీయుడు భాగస్వామి కావడం గర్వకారణమని ఆమె తెలిపారు. రాజ్యాంగ విలువలను కాపాడుతూ, సమాజ సమతుల్యత కోసం నడిచే ప్రతి ఒక్కరి కృషి అవసరమని రాష్ట్రపతి సూచించారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా భారతీయులందరూ రాజ్యాంగ పట్ల గౌరవాన్ని వ్యక్తపరుస్తూ, దేశం ముందుకు సాగేందుకు నిరంతరం కృషి చేయాలని ద్రౌపది ముర్ము ఆకాంక్షించారు.

Loading

📅 November 26, 2024🏷 National
Khammam • Nov 24, 2024

భద్రాద్రి కొత్తగూడెం కరాటే అసోసియేషన్ నూతన కార్యవర్గ ఎన్నికలు

భద్రాద్రి, కొత్తగూడెం జిల్లా కరాటే అసోసియేషన్ నూతన కార్యవర్గ ఎన్నిక ఈరోజు తేదీ 24 -11- 2024 ఆదివారం రోజున ఓల్డ్ బస్ డిపో కరాటే శ్రీధర్ ఇన్స్టిట్యూట్లో నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ యొక్క ఎన్నికలకు అబ్జర్వర్ గా తెలంగాణ కరాటే అసోసియేషన్ కి సంబంధించి వి పిచ్చయ్య గారు వ్యవహరించారు తెలంగాణ రాష్ట్ర కరాటే అసోసియేషన్ ప్రెసిడెంట్ తెలంగాణ కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ అయినటువంటి బి మహేష్ కుమార్ గౌడ్ గారి ఆదేశానుసారం ఈ యొక్క ఎన్నికను నిర్వహించడం జరిగింది ఎన్నికైన వారు వైస్ చైర్మన్ జి శ్రీనివాస్ యాదవ్ ప్రెసిడెంట్ జి శ్రీనివాస్ రావు వైస్ ప్రెసిడెంట్ జి శ్రీకాంత్ ఈ రాధిక టి వెంకటేశ్వర్లు టీ ప్రణీత్ జనరల్ సెక్రెటరీ ఇంద్రాల శ్రీధర్ జాయింట్ సెక్రటరీలు బి పవన్ రెడ్డి ఏ రాజు బి నవీన్ ట్రెజరర్ వి మురళి ఆర్గనైజింగ్ సెక్రటరీస్ కే రాము టి వీరభద్రం బి శివ ప్రసాద్ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ సాయి వరుణ్ ముఖేష్ శివ ప్రకాష్ అమన్ శివాజీ కోటేశ్వరరావు లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది అని జనరల్ సెక్రెటరీ ఇంద్రాల శ్రీధర్ అన్నారు

Loading

📅 November 24, 2024🏷 Khammam
Uncategorized • Nov 21, 2024

మహబూబాబాద్‌లో పోలీసుల తీరుపై కేటీఆర్ ఆగ్రహం

మహబూబాబాద్ జిల్లా మానుకోటలో పోలీసుల వ్యవహారంపై మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. “అక్కడ ఎన్నికలు లేవు, గొడవలేమీ జరగలేదు. అయితే లాంగ్ మార్చ్, హెచ్చరికల అవసరం ఏమిటి?” అని విమర్శించారు. శాంతియుతంగా సభ నిర్వహించేందుకు కూడా అవకాశమివ్వకపోవడం దౌర్భాగ్యమన్నారు.”ఇది ప్రజాపాలన ఎలా అవుతుంది?” అని ప్రశ్నించిన కేటీఆర్, ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని పేర్కొన్నారు. ఆ ప్రాంతంలో పోలీసులు ఎందుకు అంతా కట్టుదిట్టం చేయాల్సి వచ్చింది అనే దాని మీద సమగ్ర విచారణ చేయాలని డిమాండ్ చేశారు.ప్రజలు శాంతియుతంగా సభలు నిర్వహించుకోవడంలో అంతరాయాలు సృష్టించటం అన్యాయమని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

Loading

📅 November 21, 2024🏷 Uncategorized
Uncategorized • Nov 21, 2024

కుటుంబ సమేతంగా సింగరేణి చైర్మన్ బలరాంని కలిసిన కోట శివశంకర్

కుటుంబ సమేతంగా సింగరేణి చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ బలరాం ఐఆర్ఎస్ గారి ని కలిసి సింగరేణి విద్యాసంస్థలని అభివృద్ధి బాటలో నడిపిస్తున్న సింగరేణి చైర్మన్ గారికి శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థి యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోట శివశంకర్… హైదరాబాదులో బుధవారం రాత్రి 8 గంటలకు సింగరేణి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ బలరాం ఐఆర్ఎస్ గారిని కలిసి మునుపెన్నడూ లేని విధంగా సింగరేణి వ్యాప్తంగా సింగరేణి స్కూల్లను కాలేజీలను అభివృద్ధి పథంలో నడిపిస్తూ విద్యార్థులకు ఎంతో అవసరమైన సెంట్రల్ సిలబస్ ని ఒలంపియాడ్స్ ను ప్రవేశపెట్టి సింగరేణి సంస్థలో చదివే విద్యార్థులను పోటీ ప్రపంచంలో రాటుతేలే తెలివైన విద్యార్థులుగా తయారు చేయడానికి సింగరేణి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ హోదాలో మీరు అనుక్షణం పరితపిస్తున్నారని దానికి తగ్గట్టు సింగరేణి ఎడ్యుకేషన్ సెక్రెటరీగా తెలంగాణ ఉద్యమకారుడు గుండా శ్రీనివాస్ గారిని వేయడం చాలా శుభ పరిణామం… గుండా శ్రీనివాస్ గారు కూడా సింగరేణి అన్ని ఏరియాలో తిరుగుతూ విద్యార్థులను నేరుగా కలుస్తూ వారు ఎదుర్కొంటున్నసమస్యలను పరిష్కరిస్తూ సింగరేణి విద్యాసంస్థల్ని బలోపేతం చేస్తున్నారు….

Loading

📅 November 21, 2024🏷 Uncategorized
Khammam • Nov 20, 2024

సేవాలాల్ సేన ప్రజా రగ్ జోళ్ యాత్ర కరపత్రాల ఆవిష్కరణ

ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండల కేంద్రంలో సేవాఘడ్ సేవాలాల్ మహారాజ్ దేవాలయంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు దారావత్ సురేష్ నాయక్ అధ్యక్షతన సేవాలాల్ సేన జాతీయ వ్యవస్థాపకలు సెంట్రల్ కమిటీ చైర్మన్ ధారావత్ ప్రేమ్ చంద్ నాయక్ మరియు జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ సమన్వయ కమిటీ చైర్మన్ ఇస్లావత్ లక్ష్మణ్ నాయక్ గారి చేతుల మీదన ప్రజా రగ్ జోళ్ యాత్ర కరపత్రాన్ని ఆవిష్కరించడం జరిగింది ప్రేమ్ చంద్ నాయక్, లక్ష్మణ్ నాయక్ లు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో మొదటి విడతగా నిర్వహించే ప్రజా రగ్ జోళ్ యాత్ర తొమ్మిది జిల్లాలలో చేపట్టడం జరిగింది అందులో భాగంగానే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం సేవాఘడ్ సేవాలాల్ మహారాజ్ మందిరం నుండి డిసెంబర్ ఎనిమిదోవ తారీఖున మొదలుకానుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న చుట్టుపక్కల తండాల నుండి ముఖ్యంగా టేకులపల్లి మండలంలో ఉన్న అన్ని తండాల నుండి లంబాడి బిడ్డలు అధిక సంఖ్యలో తరలివచ్చి ప్రజా రగ్ జోళ్ యాత్ర ను విజయవంతం చేయవలసిందిగా కోరారు. సేవాలాల్ సేన పోరాట ఫలితంగా సాధించుకున్న విజయాలు చాలా ఉన్నాయని అందులో గిరిజన తండాలను గుడాలను పంచాయతీలుగా సాధించుకోవడం జనాభా దామాస ప్రకారం ఆరు శాతం నుండి 10 శాతం గిరిజన రిజర్వేషన్ పెంపుదలతో కృషి చేయడం సంత్ శ్రీ సద్గురు సేవాలాల్ మహారాజ్ జయంతిని ఫిబ్రవరి 15న రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం అధికారికంగా నిర్వహించేలా చేయడం. అదేవిధంగా గిరిజనులు సాగు చేసుకుంటున్న పోడు భూములకు పట్టాలు ఇప్పించడంలో సేవాలాల్ సేన ముఖ్యపాత్ర పోషించిందని అన్నారు ఇలా చెప్పుకుంటూ పోతే అనేక డిమాండ్ల సాధన తో పాటు వివిధ సమస్యలు పరిష్కరించి గిరిజన జాతి పక్షాన నిలబడ్డ ఏకైక సంఘం సేవాలాల్ సేన అని చెప్పారు గిరిజన చట్టాలను కాలరాస్తూ ప్రభుత్వ పాలకులు వ్యూహాత్మకంగా రాజకీయ పలుకుబడిని ఉపయోగించుకొని గిరిజనులకు రాజ్యాంగంలో కల్పించిన చట్టాలను ఒక్కొక్కటిగా తుంగలో తొక్కుతూ గిరిజన రిజర్వేషన్లకు తూట్లు పొడిచే పనిలో నిమగ్నమయ్యారని అన్నారు ఈ నేపథ్యంలో సామాజికంగా రాజకీయ ఆర్థిక విద్య ఉద్యోగ రంగాలలో గిరిజనులపై నిత్యం జరుగుతున్న భౌతిక దాడులను చూస్తుంటే గిరిజన జాతిని అణిచివేయుటకు బలమైన కుట్ర జరుగుతుందనేది అర్థమవుతుందని అన్నారు అందుకు మనకు మనమే రక్షించుకుంటూ గిరిజనుల పట్ల ప్రభుత్వ పాలకులు చూపిస్తున్న వివక్షతను ఎండగడుతూ గిరిజన చట్టాలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని గిరిజన మేధావులకు విద్యావంతులకు విజ్ఞప్తి చేశారు. గత ఎన్నికలలో ప్రభుత్వ పాలకులు గెలువులకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని పకడ్బందీగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ అన్ని రంగాలలో గిరిజనులకు రావాల్సిన హక్కులను పోరాడి సాధించుకునే దిశగా సెంట్రల్ కమిటీ ఆదేశానుసారం ప్రజలను చైతన్యం చేయుటకు మరెన్నో న్యాయమైన డిమాండ్లతో ప్రజా రగ్ జోళ్ యాత్ర చేపట్టడం జరిగిందని అన్నారు దేశవ్యాప్తంగా 15 కోట్ల బంజారా లు మాట్లాడే భాష గోర్ బోలిని భారత రాజ్యాంగం ఎనిమిదవ షెడ్యూల్లో చేర్చి అధికార భాషగా గుర్తించాలి ఐదో ఆరవ షెడ్యూల్లో గిరిజన చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలి జీవో నెంబర్ 3ను పునర్దించి చట్టబద్ధత కల్పించాలి 100% అవకాశాలు ఏజెన్సీ గిరిజనులకు కల్పిస్తూ చట్టబద్ధత కల్పించాలి పోడు పట్టాలు రాని గిరిజన రైతులకు పోడు పట్టాలు ఇవ్వాలి 20 ఎకరాలకు రైతు భరోసా పెంచాలి ప్రైవేట్ పరిశ్రమ రంగాలలో సమతా జడ్జిమెంట్ నిబంధనలు అమలు చేయాలి ఉద్యోగ ఉపాధి అవకాశాలు స్థానికులకే కల్పించాలని అదేవిధంగా మన లంబాడి బిడ్డలు ఎదుర్కొంటున్న సమస్యలపై జరిగే ప్రజా రగ్ జోళ్ యాత్ర ను విజయవంతం చేయవలసిందిగా కోరారు ఈ కార్యక్రమంలో ఏజెన్సీ పరిరక్షణ రాష్ట్ర అధ్యక్షులు లాల్ సింగ్ నాయక్, సేవాలాల్ సేన రాష్ట్ర ఉపాధ్యక్షులు రవిరాథోడ్, రాష్ట్ర కార్యదర్శి శీను నాయక్, రాష్ట్ర ధర్మ జాగరణ సేన ప్రధాన కార్యదర్శి మంగీలాల్ నాయక్, ధర్మ ప్రచారకులు మంగతీయ సేవాలాల్ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేష్ నాయక్, జిల్లా ఉపాధ్యక్షులు రమేష్ నాయక్, జిల్లా అధికార ప్రతినిధి నాగరాజు నాయక్, జిల్లా కార్యదర్శి సురేష్ నాయక్, జిల్లా ప్రచార కార్యదర్శి లాలు నాయక్, ధర్మ జాగరణ సేన జిల్లా ప్రచార కార్యదర్శి సేవల్ శ్రీ గణేష్ పూజారి, టేకులపల్లి మండలాధ్యక్షులు కిషన్ నాయక్, లక్ష్మీదేవిపల్లి మండల అధ్యక్షులు బాలు నాయక్, ఇల్లందు మండల ప్రధాన కార్యదర్శి రాంబాబు నాయక్, తదితరులు పాల్గొన్నారు

Loading

📅 November 20, 2024🏷 Khammam
Adilabad • Nov 20, 2024

మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ విస్తరణ: అభివృద్ధి దిశగా కీలక అడుగులు

తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుతోపాటు పట్టణీకరణ పై ప్రత్యేక దృష్టి సారించింది. కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేస్తూ, రాష్ట్ర ప్రభుత్వ వాటా జోడించి నిధులను సద్వినియోగం చేసేందుకు పావులు కదిపిస్తోంది. ఈ చర్యలతో మౌలిక వసతులు మెరుగుపడుతూనే ప్రజల జీవన ప్రమాణాలు కూడా పెరిగే అవకాశముంది. ఈ క్రమంలో, కొత్త మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతోంది. ఇప్పటికే, అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీల విస్తరణకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేయబడినాయి. తాజా సమాచార ప్రకారం, 2019లో అమలులోకి వచ్చిన కొత్త మున్సిపల్ చట్టం ఆధారంగా, గ్రేడ్-1 మున్సిపాలిటీగా ఉన్న మంచిర్యాలును మునిసిపల్ కార్పొరేషన్‌గా మార్పు చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. మంచిర్యాల విస్తరణ ప్రణాళికప్రస్తుత మంచిర్యాల మున్సిపాలిటీలోని నస్పూర్‌ మున్సిపాలిటీ, హాజీపూర్‌ మండలంలోని వేంపల్లి, ముల్కల్ల, గుడిపేట, నంనూర్‌, నర్సింగాపూర్‌ గ్రామాలను మంచిర్యాల మున్సిపాలిటీలో విలీనం చేయనున్నట్లు సమాచారం. ఈ విలీనంతో, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ జనాభా దాదాపు మూడు లక్షల వరకు చేరుకోవాలని అంచనా. పురపాలక శాఖకు ఈ విలీనంతో సంబంధించి పంచాయతీల విలీనం విషయమై ప్రతిపాదనలు అందాయి. త్వరలోనే పంచాయతీల తీర్మానాలు, ప్రజల అభిప్రాయాలను సేకరించే ప్రక్రియ ప్రారంభించబడే అవకాశం ఉంది. విస్తరణ ప్రక్రియ మరింతగా వేగం పుచ్చుకుంటుందిమంచిర్యాల పట్టణాభివృద్ధి సంస్థ (అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ) విస్తరణ ప్రక్రియ అధికారికంగా తుది దశకు చేరింది. ఈ విస్తరణ ద్వారా, అభివృద్ధి, ఆదాయ మార్గాలు పెంచుకోవడంతోపాటు, భవిష్యత్‌ దృష్ట్యా పట్టణం మరింత మెరుగ్గా అభివృద్ధి చెందనుంది. ఐదు గ్రామాలు మరియు నస్పూర్ మున్సిపాలిటీని విలీనం చేయడంతో, మున్సిపల్ కార్పొరేషన్ విస్తరించి 360 చదరపు కిలోమీటర్ల వరకు పెరిగిపోతుంది. పంచాయతీల విలీనం పై అనుకూల తీర్మానాలు చేయాలని పంచాయతీ శాఖకు కలెక్టర్‌ నుంచి ఆదేశాలు జారీ చేయబడనున్నాయి. మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు ఈ విస్తరణపై జరిగిన చర్చల్లో పాల్గొని, విస్తృత సమాచారాన్ని అందించినట్లు సమాచారం. కార్పొరేషన్‌కు సంబంధించిన నివేదికలు సంబంధిత శాఖకు అందిన వెంటనే, సీఎం కూడా దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందుకు సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత, మంచిర్యాల పట్టణ అభివృద్ధి కాంక్షించబడిన లక్ష్యాలకు చేరుకోనుంది, ప్రజలకు మరింత మెరుగైన మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉంటాయి.

Loading

📅 November 20, 2024🏷 Adilabad
error: Content is protected !!