📰
PRESS MEET App తెలుగు వార్తలు చదవండి · Free Download
▶ Install App
March 10, 2026
🔴 BREAKING
🗞 తాజా వార్తలు
Adilabad • Nov 20, 2024

మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ విస్తరణ: అభివృద్ధి దిశగా కీలక అడుగులు

తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుతోపాటు పట్టణీకరణ పై ప్రత్యేక దృష్టి సారించింది. కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేస్తూ, రాష్ట్ర ప్రభుత్వ వాటా జోడించి నిధులను సద్వినియోగం చేసేందుకు పావులు కదిపిస్తోంది. ఈ చర్యలతో మౌలిక వసతులు మెరుగుపడుతూనే ప్రజల జీవన ప్రమాణాలు కూడా పెరిగే అవకాశముంది. ఈ క్రమంలో, కొత్త మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతోంది. ఇప్పటికే, అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీల విస్తరణకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేయబడినాయి. తాజా సమాచార ప్రకారం, 2019లో అమలులోకి వచ్చిన కొత్త మున్సిపల్ చట్టం ఆధారంగా, గ్రేడ్-1 మున్సిపాలిటీగా ఉన్న మంచిర్యాలును మునిసిపల్ కార్పొరేషన్‌గా మార్పు చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. మంచిర్యాల విస్తరణ ప్రణాళికప్రస్తుత మంచిర్యాల మున్సిపాలిటీలోని నస్పూర్‌ మున్సిపాలిటీ, హాజీపూర్‌ మండలంలోని వేంపల్లి, ముల్కల్ల, గుడిపేట, నంనూర్‌, నర్సింగాపూర్‌ గ్రామాలను మంచిర్యాల మున్సిపాలిటీలో విలీనం చేయనున్నట్లు సమాచారం. ఈ విలీనంతో, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ జనాభా దాదాపు మూడు లక్షల వరకు చేరుకోవాలని అంచనా. పురపాలక శాఖకు ఈ విలీనంతో సంబంధించి పంచాయతీల విలీనం విషయమై ప్రతిపాదనలు అందాయి. త్వరలోనే పంచాయతీల తీర్మానాలు, ప్రజల అభిప్రాయాలను సేకరించే ప్రక్రియ ప్రారంభించబడే అవకాశం ఉంది. విస్తరణ ప్రక్రియ మరింతగా వేగం పుచ్చుకుంటుందిమంచిర్యాల పట్టణాభివృద్ధి సంస్థ (అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ) విస్తరణ ప్రక్రియ అధికారికంగా తుది దశకు చేరింది. ఈ విస్తరణ ద్వారా, అభివృద్ధి, ఆదాయ మార్గాలు పెంచుకోవడంతోపాటు, భవిష్యత్‌ దృష్ట్యా పట్టణం మరింత మెరుగ్గా అభివృద్ధి చెందనుంది. ఐదు గ్రామాలు మరియు నస్పూర్ మున్సిపాలిటీని విలీనం చేయడంతో, మున్సిపల్ కార్పొరేషన్ విస్తరించి 360 చదరపు కిలోమీటర్ల వరకు పెరిగిపోతుంది. పంచాయతీల విలీనం పై అనుకూల తీర్మానాలు చేయాలని పంచాయతీ శాఖకు కలెక్టర్‌ నుంచి ఆదేశాలు జారీ చేయబడనున్నాయి. మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు ఈ విస్తరణపై జరిగిన చర్చల్లో పాల్గొని, విస్తృత సమాచారాన్ని అందించినట్లు సమాచారం. కార్పొరేషన్‌కు సంబంధించిన నివేదికలు సంబంధిత శాఖకు అందిన వెంటనే, సీఎం కూడా దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందుకు సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత, మంచిర్యాల పట్టణ అభివృద్ధి కాంక్షించబడిన లక్ష్యాలకు చేరుకోనుంది, ప్రజలకు మరింత మెరుగైన మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉంటాయి.

Loading

📅 November 20, 2024🏷 Adilabad
Uncategorized • Nov 20, 2024

ప్రభుత్వ గురుకులాలా? ప్రాణాలు తీసే సంస్థలా?: మాజీ మంత్రి హరీశ్‌రావు

ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల్లో కొనసాగుతున్న ఫుడ్ పాయిజన్ ఘటనలు, విద్యార్థుల అనారోగ్యాలు రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఈ అంశంపై మాజీ మంత్రి, భారాస ఎమ్మెల్యే హరీశ్ రావు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. “ప్రభుత్వ పాఠశాలలు ప్రాణాలు తీసే విషవలయాలా?” అని ఆయన ఘాటుగా ప్రశ్నించారు. వాంకిడి ఘ‌ట‌న:ఆదిలాబాద్ జిల్లాలోని వాంకిడి గిరిజన గురుకులంలో ఫుడ్ పాయిజన్ కారణంగా అనారోగ్యానికి గురైన ఓ విద్యార్థిని గత 20 రోజులుగా నిమ్స్ ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతోంది. ఈ ఘటన విద్యార్థుల ఆరోగ్య భద్రతపై తీవ్ర ప్రశ్నలు రేకెత్తిస్తోంది. నారాయణపేట ప్రమాదం:నారాయణపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఫుడ్ పాయిజన్ వల్ల 50 మంది విద్యార్థులు ఆసుపత్రిలో చేరారు. వీరి ఆరోగ్య పరిస్థితి భయానకంగా మారిందని హరీశ్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. ఇతర సంఘటనలు:నల్గొండ జిల్లాలో పాముకాటుకు గురైన ఓ విద్యార్థి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయాన్ని ఆయన వివరించారు. విద్యార్థుల ప్రాణాలకు నష్టమయ్యే పరిస్థితి ఎందుకు కొనసాగుతుందని ప్రశ్నించారు. సర్కార్‌పై విమర్శలు:గురుకులాలు, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ఆరోగ్యం, భద్రత పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని హరీశ్ రావు మండిపడ్డారు. విద్యార్థులు పాఠాలు నేర్చుకోవడం కాదు, ప్రాణాలతో బయటపడితే చాలని పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిందని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజయోత్సవాలు జరుపుకోవడం మరింత బాధాకరమని విమర్శించారు. పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి:ఆసుపత్రి పాలైన విద్యార్థులను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించాలని డిమాండ్ చేశారు. అలాగే, పాఠశాలల్లో ఆరోగ్య సదుపాయాలు, భద్రతా నిబంధనలను కఠినంగా అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. “ఇలాంటి నిర్లక్ష్యానికి ఇంకా ఎంతమంది విద్యార్థులు బలి కావాలి?” అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ ఘటనలు విద్యావ్యవస్థలో సమూల మార్పుల అవసరాన్ని స్పష్టం చేస్తూ, పిల్లల భవిష్యత్తుకు భరోసా కల్పించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని హరీశ్ రావు కోరారు.

Loading

📅 November 20, 2024🏷 Uncategorized
Uncategorized • Nov 19, 2024

కేసీఆర్ పాలనలో మహిళలకు అన్యాయం: CM రేవంత్ రెడ్డి

CM రేవంత్ రెడ్డి వరంగల్‌ ప్రచారంలో కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు చేశారు. “2014-19లో కేసీఆర్‌ కేబినెట్‌లో ఒక్క మహిళకు కూడా మంత్రి పదవి ఇవ్వలేకపోయారు. ఇది ఆయన పాలనలో మహిళలపై అన్యాయం. కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఇద్దరు మహిళలకు మంత్రి స్థానం కల్పించి మహిళల సాధికారతకు దారి తీసింది. మేము ఆడబిడ్డలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేలా నిర్ణయాలు తీసుకుంటాం,” అన్నారు. వరంగల్ అభివృద్ధిపై ఫోకస్“పదేళ్లలో కాళోజీ కళాక్షేత్రాన్ని పూర్తి చేయలేకపోయిన కేసీఆర్‌ ప్రభుత్వం, వరంగల్ అభివృద్ధిలో విఫలమైంది. వరంగల్‌ను హైదరాబాద్‌తో సమానంగా అభివృద్ధి చేస్తా. ఇప్పటివరకు రూ.6 వేల కోట్లను అభివృద్ధి పనుల కోసం మంజూరు చేశాం. ఉత్తర తెలంగాణ అభివృద్ధికి వరంగల్ కేంద్రం అవుతుంది,” అని తెలిపారు. కొత్త ప్రణాళికలురెవంత్‌ మరో ప్రస్తావనగా, తెలంగాణలో 4 కొత్త విమానాశ్రయాలు ఏర్పాటు చేస్తామని, అభివృద్ధి కార్యక్రమాల్లో మహిళల భాగస్వామ్యాన్ని పెంచుతామని స్పష్టం చేశారు. “పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వరంగల్ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నారు,” అని ప్రశంసించారు.

Loading

📅 November 19, 2024🏷 Uncategorized
National • Nov 19, 2024

పురంధేశ్వరి టీటీడీ బోర్డు నిర్ణయాలపై ట్వీట్

టీటీడీ బోర్డు ఇటీవల తీసుకున్న నిర్ణయాలపై కేంద్ర మంత్రిగా పని చేస్తున్న పురంధేశ్వరి ట్వీట్ చేశారు. ఆమె, టీటీడీలో అన్యమతస్తుల అంశంపై గతంలోనే సంతకాల సేకరణ ఉద్యమం చేపట్టినట్టు తెలిపారు. “హిందూ సంప్రదాయాలపై అవగాహన లేని వ్యక్తులు ఉద్యోగ బాధ్యతల్లో న్యాయం చేయలేరు,” అని ఆమె వ్యాఖ్యానించారు. అలాగే, టీటీడీ బోర్డు తీసుకున్న నిర్ణయాలను ఆమె స్వాగతిస్తున్నట్లు పేర్కొన్నారు

Loading

📅 November 19, 2024🏷 National
Uncategorized • Nov 19, 2024

కాంట్రాక్ట్ ఉద్యోగాలపై తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు

తెలంగాణ హైకోర్టు జీవో 16ను రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. హైకోర్టు, కాంట్రాక్ట్‌ ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌ను రాజ్యాంగ వ్యతిరేకంగా భావించింది. గత BRS ప్రభుత్వం, జీవో 16 ద్వారా విద్య, వైద్య శాఖలలో వేలాది మందిని రెగ్యులరైజ్ చేసింది. ఈ ప్రక్రియ ద్వారా, ప్రత్యేకించి విద్య మరియు వైద్య శాఖల్లో కాంట్రాక్ట్‌ ఉద్యోగుల సంఖ్య పెరిగింది. కానీ, హైకోర్టు ఆదేశాలతో ఇప్పుడు ఆ కాంట్రాక్ట్‌ ఉద్యోగులు ఆందోళనలో ఉన్నారు. కోర్టు ఆదేశాల ప్రకారం, రెగ్యులరైజ్‌ అయిన ఉద్యోగులను తిరిగి కాంట్రాక్ట్‌ ఉద్యోగులుగా కొనసాగించవచ్చని పిటిషనర్లు పేర్కొంటున్నారు. అయితే, కోర్టు ఆర్డర్‌ కాపీ అందిన తర్వాత ఆ నిర్ణయం పై అధికారిక స్పష్టత రావాలని అధికారులు అంగీకరించారు.

Loading

📅 November 19, 2024🏷 Uncategorized
Khammam • Nov 19, 2024

భద్రాద్రి కొత్తగూడెంలో ఎస్సీల హక్కుల రక్షణకు నేషనల్ ఎస్సీ కమిషన్ లో ఫిర్యాదు : కోటా శివ శంకర్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎస్సీలపై జరుగుతున్న దాడులను ఎస్సీలపై పెడుతున్న అక్రమ కేసులను ఎస్సీల భూములను ఆక్రమించి కడుతున్న కట్టడాలను కూల్చివేయాలి ఎస్సీ కమిషన్ లో ఫిర్యాదులు చేస్తే తప్పుడు రిపోర్టులు పంపిస్తున్న సింగరేణి డైరెక్టర్ పై ఎస్సీలను వేధిస్తున్న వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలి కోట శివశంకర్ నేషనల్ ఎస్సీ కమిషన్ డైరెక్టర్ డాక్టర్ జి సునీల్ కుమార్ బాబు గారికి నేరుగా హైదరాబాదులో కలిసి వినతి పత్రం అందించడం జరిగింది. ఈ సందర్భంగా కోట శివశంకర్ మాట్లాడుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎస్సీలపై తప్పుడు కేసులు పెడుతూ అసలు కేసులో గొడవ జరిగిన సందర్భంలో లేకపోయినా బలగం శ్రీధర్ ని అన్యాయంగా పది రోజులు జైలుకు పంపించారని అదేవిధంగా నేషనల్ ఎస్సీ కమిషన్ లో దాస్యం రూత్ మేరీ మేడంగారు ఫిర్యాదు చేసిన కలెక్టర్ గారి కోర్టులో కేసు పెండింగ్ ఉండంగా ఇంజక్షన్ ఆర్డర్ డిస్మిస్ చేసి కాసాని శ్రీనివాస్ రెడ్డిని నువ్వు గిరిజనేతరు ఇక్కడ భూమిపై ఎటువంటి హక్కు లేదు అంటే లోకల్ రాజకీయ అండతో నాయకులతో పది రోజులలో షెడ్డు నిర్మించినాడు దీనిని వెంటనే కూల్చివేయాలి అని డిమాండ్ చేయడం జరిగింది

Loading

📅 November 19, 2024🏷 Khammam
Editorial • Nov 17, 2024

రైతుల భూములు – పారిశ్రామిక అభివృద్ధి పేరుతో అన్యాయం వద్దు : కోట శివశంకర్

ఫార్మా కంపెనీకి మా గిరిజన భూములు అడుగుతున్న కలెక్టర్లకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఫార్మా కంపెనీలకు తెలంగాణ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థి యువజన సంఘం కొన్ని ప్రధానమైన బలమైన షరతులు విధిస్తున్నాము…. ఫార్మా కంపెనీలకు భూములు ఇస్తే ఫార్మా కంపెనీలో భూములు పోయిన రైతులకు ఫార్మా కంపెనీ డైరెక్టర్లను చేయండి… ఫార్మా కంపెనీలకి చైర్మన్ లను ఎండి లను చేయండి… ఫార్మా కంపెనీల లాభాలలో భూములు పోగొట్టుకున్న రైతులకు వాటాలు పంచండి …ఫార్మా కంపెనీలో పెద్దపెద్ద పోస్టులలో మేమే ఉంటామని చెప్పండి… ఉద్యోగం అంటే అటెండర్ గేట్ కాడ వాచ్మెన్ లేకపోతే మన చదువుకు తగ్గ ఉద్యోగంలో సెక్యూరిటీ గార్డ్ అవి కాదు ఎవరి రైతు భూమి పోతే ఆ రైతు భూమికి ఆ రైతు కుటుంబంలో ఉన్న నిరుద్యోగులకు ఆ కంపెనీలలో జిఎంలను ఏజీఎం లను చేయండి… మనభూమి మనకు ఉంటే అన్నీ ఉంటాయి అసలు భూమి ఉంటే మన సంపద మనమే సృష్టించుకోవచ్చు… రైతులారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఫార్మా కంపెనీలను బంజర భూములలో కొండలలో గుట్టలలో ఫార్మా కంపెనీలను పెట్టుకోమనండి భూములు ఇవ్వమనండి. రామోజీరావు ఫిలిం సిటీ పక్కన కట్టుకోమని చెప్పండి…. రామోజీరావు బంజర భూములను కొండలని గుట్టలని ఎలా తీర్చి దిద్దాడో అసైన్మెంట్ ల్యాండ్లని సెంటు భూమి రెండు రూపాయలకి కొనుక్కొని ఎకరం భూమి 100 రూపాయల నుంచి వెయ్యికి 2000 కి ఎకరం కొని ఎలా అయితే ఇప్పుడు డెవలప్ చేశాడో అక్కడ కూడా బంజర భూములు తీసుకొని ఫార్మా కంపెనీలు కట్టుకోమని చెప్పండి…. మన పంట పొలాలని తీసుకోమని కాదు… ఫార్మా కంపెనీకి ప్రతి రైతు భూమి పోగొట్టుకున్న ప్రభుత్వం బలవంతంగా గుంజుకున్న రైతుకి ఒక డైరెక్టర్ పోస్ట్ ఇయ్యమనండి వాటాలు లాభాలు మనమే పంచుకునేలా మన భూములు పోగో ట్టుకున్న రైతులు ఆ ఫార్మా కంపెనీ మొత్తం మన చెప్పు చేతుల్లో ఉండే విధంగా పెట్టుబడి మాత్రం విదేశీ వాళ్లు పెట్టని ఏమైనా అభివృద్ధి టెక్నాలజీ ఉంటే విదేశీ అభివృద్ధి మన దేశ టెక్నాలజీ అన్ని కలిసి ఫార్మా కంపెనీలను చేయమనండి పని మాత్రం వాళ్ళు చేయమని చెప్పండి… విదేశీ యంత్రాంగం స్వదేశీ యంత్రాంగాన్ని వాడమని చెప్పండి…. కార్మికులు శ్రామికులు రైతులు అందరం కలిసి పని చేద్దాం…. మన లాభం మన దగ్గర డబ్బులు మన వాటాలు మనమే పంచుకోవాలి. ఇక్కడ భూములు పోగొట్టుకొని ఇక్కడ కూలీలుగా పనిచేసి లాభాలు మాత్రం విదేశాలకు తీసుకెళ్తాం అంటే మాత్రం కుదరదు…. మీకు ఇక్కడ అభివృద్ధి చేస్తామని ఫార్మా కంపెనీ వల్ల వచ్చే పొల్యూషన్ మన ప్రజలు మన తెలంగాణ రైతులు మన తెలంగాణ నీటి వనరులు మొత్తం నాశనం అయిపోయి మరియు మన రైతులు భూములు పోగొట్టుకొని ఇంటికో ఉద్యోగం అంటారేంటి పిచ్చోళ్ళ లాగా భూమికి భూమి ఇవ్వమంటారు ఏంటి? పంట పొలాల భూములను గుంజుకొని ఎక్కడో బంజరు భూమి ఇస్తా మన పంట పొలాలను తీసుకొని బంజరు భూమి ఇస్తే మనం ఏం చేద్దాం ఆ బంజర భూములలో పంటలు పండక నీటి వసతులు లేక బోర్లు వేసిన బోర్లు ఎండిపోయి బోర్లు పడక ఆ బంజర భూముల రాళ్లతో కొట్టుకొని మనం చచ్చిపోదామా… ఇల్లుకు ఇల్లు ఇవ్వమంటారు ఎక్కడో ఊరవుతల ఇస్తే పుట్టకొకడు గుట్టకొకడు వెళ్లిపోదామా మన తాత ముత్తాతలు పుట్టిన ఊరులు వదులుకొని ఎక్కడో అనాధల్లాగా . పుట్టకొకడుకు ఊరుకొకడు చెట్టుకొకడు గుట్టకొక్కడు వేరే ప్రాంతాలకు వేరే ఊర్లకు వలస పోదామా ఇంత పెద్ద ఊర్లు మన తాత ముత్తాతలు సంపాదించిన భూములను వదిలిపెట్టుకొని వెళ్లిపోదామా. ఎకరం భూమి కోటి రూపాయలు ఇవ్వమంటున్నాం ఏం చేద్దాం మంచిగా తాగి తిని కార్లు కొనుక్కొని మళ్లీ అవేకారులు అమ్మి వేసి ఆ కార్లకే డ్రైవర్లు అవుదామా చెప్పండి… మనం భూములు ఇచ్చేది లేదు ఒకవేళ భూములు ఇస్తే ఆ ఫార్మా కంపెనీకి ఎంతమంది రైతుల భూములు పోయాయో పోతున్నాయో ప్రభుత్వం అక్రమంగా కేసులు పెట్టి గుంజుకుంటుందో అంతమంది రైతులు డైరెక్టర్లుగా ఉంటారు…. ఆ ఫార్మా కంపెనీ పెడితే ఎంత లాభం వస్తుందో ఆ లాభం మొత్తం మన డైరెక్టర్లు మన భూములు పోగొట్టుకున్న రైతులు పంచుకోవాలి.. మన సంపద మనకే దక్కాలి …మన భూములు పోగొట్టుకొని మన దేశ సంపద అంబానీ ఆదానీలకు వేరే వేరే విదేశీ కంపెనీల ఫార్మా కంపెనీల పెట్టుబడుదారులకు పోయి విదేశాలలో స్విస్ బ్యాంకులలో దాచి పెట్టుకోకూడదు…. మారండి భారతదేశ పాలకులారా తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల ప్రజలారా యువకుల్లారా మహిళలారా నాయకుల్లారా, భారత రాజ్యాంగ చదవండి.. తెలంగాణ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల ప్రజలు భూములు ఇవ్వకూడదు… అభివృద్ధి జరగాలి కానీ భూమి ఇస్తే ఆ ఫార్మా కంపెనీలో భూములు పోగొట్టుకున్న రైతులంతా డైరెక్టర్లుగా మారాలి ఆ డైరెక్టర్లు ఆ ఫార్మా కంపెనీ లాభాలన్నీ ఆ పోగొట్టుకున్న భూములు పోగొట్టుకున్న రైతుల కుటుంబాలకు ఇవ్వాలి తద్వారా రైతుల ఆదాయ మార్గాలు పెరగాలి… భూమి పోయినందుకు భూమి పోయిన రైతుకు ఉద్యోగం అంటే డే వాచ్మెన్ నైట్ వాచ్మెన్ గెట్ వాచ్మెన్ ఆఫీసులో అటెండర్ లేకపోతే ఆఫీసులో క్లర్క్ ఉద్యోగం కాదు రైతుకు భూమి పోతే ఆ ఫార్మా కంపెనీ డైరెక్టర్ పోస్టు ఛైర్మెన్ మేనేజింగ్ డైరెక్టర్ పోస్ట్లు రావాలి…. ఇది భారత రాజ్యాంగం సారాంశం…. భారత రాజ్యాంగం వర్ధిల్లాలి…. బాబాసాహెబ్ అంబేద్కర్ కలలుగన్న పారిశ్రామిక విధానం.. అంతేగాని మనం భూములు పోగొట్టుకొని ఇల్లులు మరి వేరే కాడ బంజరు భూములు వేరే కాడ చెట్టుకొక్కడు పుట్టకొకడు వెళ్లిపోయి ఇల్లులు కట్టుకోవడం కాదు కోటి రూపాయలు కూర్చొని తాగి తందనాలాడీ తింటే కరెక్ట్ గా మూడు నెలల నుండి ఆరు నెలల్లో అయిపోతాయి…. పెద్దపెద్ద కంపెనీ కార్లు కొనుక్కుంటే మూడు కార్లకి కోటి రూపాయలు అయిపోతాయి…. ఆలోచించండి నిరుద్యోగులారా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓసి లో మేధావి వర్గం ప్రజలారా యువకులారా… ఇట్లు మీ తెలంగాణ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థి యువజన సంఘం…. పై విధంగా ఆలోచించండి పై విధంగా రైతులు గ్రామసభల్లో అధికారులకు ముఖ్యమంత్రులను మంత్రులను కలెక్టర్లను పై విధంగా అడగాలని పిలుపునిస్తుంది. ఎక్కడ గొడవలు పెట్టుకోవద్దు…. దాడులు చేయొద్దు… రాళ్లు రప్పలు పెట్టి కొట్టొద్దు… కర్రలు కత్తులు వాడొద్దు… మాటలే మన ఆయుధాలు… ఒక తెల్ల పేపర్ మీద ఈ డిమాండ్లన్నీ రాసి భారత దేశ రాష్ట్రపతికి భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి మన తెలంగాణ ముఖ్యమంత్రి కి ఫార్మా కంపెనీ కోసం భూములు పోగొట్టుకుంటున్న మన ఊరి ప్రజలంతా సంతకాలు పెట్టి ఇవ్వండి…. కలెక్టర్లకు ఇవ్వండి…. మంత్రులకు ఎమ్మార్వోలకు ఆర్డీవోలకు ఇవ్వండి… మన భారత రాజ్యాంగమే మన పెద్ద ఆయుధం… మన రైతుల మాటే అక్షర రూపంలో తూటాలాగా పేలాలి …మన మాటే మన హక్కు… జై భీమ్….. జై బాబాసాహెబ్ అంబేద్కర్….. భారత రాజ్యాంగం వర్ధిల్లాలి….. వ్యాసకర్త కోట శివశంకర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తెలంగాణ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థి యువజన సంఘం తెలంగాణ రాష్ట్రం సెల్ నెంబర్ 9394809649

Loading

📅 November 17, 2024🏷 Editorial
Khammam • Nov 15, 2024

మాచినేనిపేటతండా యువతి హత్య కేసు నిందితుల అరెస్టు : కొత్తగూడెం డీఎస్పీ

మాచినేనిపేటతండాలో సంచలనం కలిగించిన యువతి హత్య కేసుకు సంబంధించి నిందితులను గురువారం పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కొత్తగూడెం డీఎస్పీ అబ్ధుల్‌ రెహమాన్‌తో కలిసి జూలూరుపాడు సీఐ ఇంద్రసేనారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం… మాచినేనిపేట తండాలో హత్యకు గురైన తోట స్వాతి కేసులో అదే గ్రామానికి చెందిన బానోత్‌ భద్రం, అతని తల్లి సరోజను వారి ఇంటి వద్ద అరెస్టు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన భద్రం, తనతో సహజీవనం చేస్తున్న స్వాతిని హత్య చేసిన తర్వాత, ఆనవాళ్లు కనిపించకుండా చేసేందుకు అతని తల్లి సరోజ గదిలోని రక్తం మరకలను తుడిచివేయడం, మృతదేహాన్ని పత్తిచేలో గుంతలో పూడ్చిపెట్టేందుకు సహకరించినట్లు తెలిపారు. వీరిద్దరిని కోర్టులో హాజరుపర్చి రిమాండ్‌కు తరలించామని సీఐ వివరించారు.

Loading

📅 November 15, 2024🏷 Khammam
Career • Nov 15, 2024

కొత్తగూడెం హెచ్‌డీఎఫ్‌సి బ్యాంకులో ఇంటర్వ్యూలు

విద్యానగర్ హెచ్‌డీఎఫ్‌సి బ్యాంక్, కొత్తగూడెంలో నవంబర్ 21న ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు నేరుగా ఇంటర్వ్యూలు నిర్వహించబడతాయి. ఉద్యోగాలు: అర్హతలు: కాంటాక్ట్:రాజేష్ అరెల్లి – 9392897511

Loading

📅 November 15, 2024🏷 Career
National • Nov 15, 2024

మంత్రి లోకేశ్ కు శ్రీరెడ్డి క్షమాపణ లేఖ

సామాజిక మాధ్యమాల్లో అసభ్యకరమైన వీడియోలు, పోస్టులపై కేసులు నమోదైన నేపథ్యంలో, సినీనటి శ్రీరెడ్డి మంత్రి లోకేశ్‌ను ఉద్దేశించి బహిరంగ లేఖ విడుదల చేశారు. లేఖలో లోకేశ్‌ను “అన్నా” అని సంబోధిస్తూ, తన తప్పును అంగీకరించారు. ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు తెదేపా, జనసేన కార్యకర్తలకు బాధ కలిగించాయని, వారికి క్షమాపణలు తెలిపారు. తమ కులదైవం వెంకటేశ్వరస్వామిని సాక్షిగా ప్రమాణం చేసి, ఇకపై అలాంటి చర్యలు చేయనని తెలిపారు. అంతేకాక, చంద్రబాబు, లోకేశ్, వారి కుటుంబం, హోంమంత్రి, మీడియాను క్షమించమని విజ్ఞప్తి చేశారు. శ్రీరెడ్డి ఈ లేఖను ఎక్స్‌ వేదికగా “ప్లీజ్‌ అన్నా అడుక్కుంటున్నా.. నన్ను కాపాడు” అంటూ పోస్ట్ చేశారు. అదే సమయంలో, మాజీ సీఎం జగన్‌కు కూడా లేఖ రాస్తూ, తన చర్యల వల్ల వైకాపాకు నష్టం కలిగితే ఆ పాపం జగన్‌కు అంటుకుదోమనేది తన ఉద్దేశం అని పేర్కొన్నారు. అందుకే పార్టీ, కార్యకర్తల నుంచి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.

Loading

📅 November 15, 2024🏷 National
error: Content is protected !!