📰
PRESS MEET App తెలుగు వార్తలు చదవండి · Free Download
▶ Install App
March 10, 2026
🔴 BREAKING
🗞 తాజా వార్తలు
Career • Sep 12, 2024

ఒడిశా ప్రభుత్వం కీలక నిర్ణయం మాజీ అగ్నివీర్‌లకు 10% రిజర్వేషన్

ఒడిశా ప్రభుత్వం మాజీ అగ్నివీర్‌లకు 10% రిజర్వేషన్‌ ప్రకటించింది. గ్రూప్‌ C, D ఉద్యోగాల్లో వారిని యూనిఫామ్‌ సర్వీసుల్లో నియమిస్తామని పేర్కొంది. వీరికి ఫిజికల్‌ టెస్ట్‌ నుంచి మినహాయింపు, వయసులో 3 ఏళ్ల సడలింపు కూడా ఉంది. ఎక్స్ సర్వీస్ మెన్ పథకం ద్వారా నియమితులైన వారితోో కాకుండా ఈ రిజర్వేషన్ అదనంగా అమలు చేయనున్నారు. ఇప్పటికే పారామిలటరీ బలగాల్లో నియామకాలకు సంబంధించి సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌, బీఎస్‌ఎఫ్‌, ఆర్‌పీఎఫ్‌లు 10 % రిజర్వేషన్ ఇస్తామని కీలక నిర్ణయం తీసుకుంది.

Loading

📅 September 12, 2024🏷 Career
National • Sep 10, 2024

ఎలక్ట్రిక్ ట్రాక్టర్ కిలోమీటర్‌కు కేవలం ₹14 మాత్రమే ఖర్చు

ఎలక్ట్రిక్ ట్రాక్టర్లు ఇండియా వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తెస్తాయని భావిస్తున్నారు. AutoNxt స్టార్టప్, కుబోటా, మహీంద్రా, HAV, సోనాలికా కంపెనీలు ఇప్పటికే ఎలక్ట్రిక్ ట్రాక్టర్ నమూనాలు చూపించాయి. AutoNxt కంపెనీ లెవల్ 3 అటానమస్ టెక్నాలజీతో డ్రైవర్ లెస్ ట్రాక్టర్‌ను రూపొందిస్తోంది. CEO కౌస్తుభ్ ధోండే ప్రకారం, ఈ ట్రాక్టర్ డీజిల్ ట్రాక్టర్ కంటే తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో రూ.14/km మాత్రమే ఖర్చవుతుందని చెప్పారు. 2025 నాటికి 100 ఈ-ట్రాక్టర్లు మార్కెట్లోకి విడుదల చేయాలనే లక్ష్యంతో AutoNxt కంపెనీ ముందుకుసాగుతోంది.

Loading

📅 September 10, 2024🏷 National
Uncategorized • Sep 10, 2024

హుస్సేన్‌సాగర్‌లో యధావిధిగా గణేష్‌ నిమజ్జనాలు : హైకోర్టు

TG: హుస్సేన్‌సాగర్‌లో యధావిధిగా గణేష్‌ నిమజ్జనాలు కొనసాగుతాయని హైకోర్టు స్పష్టం చేసింది. 2021లో ఇచ్చిన ఆదేశాలు కొనసాగుతాయన్నారు. కోర్టు ధిక్కరణ పిటిషన్‌ను తిరస్కరించారు, పిటిషనర్ ఆధారాలు చూపలేకపోవడంతో. నిమజ్జనం చివరి సమయంలో పిటిషన్‌ సరికాదని పేర్కొన్నారు. హైడ్రాను ప్రతివాదిగా చేర్చేందుకు కోర్టు నిరాకరించింది, గత ఆదేశాల సమయంలో హైడ్రా లేకపోవడం కారణమని స్పష్టం చేసింది.

Loading

📅 September 10, 2024🏷 Uncategorized
Hyderabad • Sep 10, 2024

రంగారెడ్డి జిల్లాలో అక్రమ రేషన్ బియ్యం స్వాధీనం

రేషన్ బియ్యం అక్రమ రవాణా చేసే వారిపై పిడి యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేస్తామని పౌరసరఫరాల శాఖ ఎన్ఫోర్స్ మెంట్ డిప్యూటీ తాసిల్దార్ మాచన రఘునందన్ హెచ్చరించారు. మంగళ వారం నాడు ఆయన రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం మొకిల్ల లొ.. నిరుపయోగంగా ఉన్న ఓ పశువుల కొట్టంలో పెద్ద ఎత్తున అక్రమంగా దాచి ఉంచిన రేషన్ బియ్యంను స్వాదీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా రఘునందన్ మాట్లాడుతూ.. నగర శివార్ల నుంచి రేషన్ బియ్యంను అక్రమంగా అధిక ధరకు సేకరించి పొరుగు జిల్లాలకు, ఆ తర్వాత పొరుగు రాష్ట్రాలకు తరలిస్తున్న ముఠా గుట్టును రట్టు చేశామన్నారు. నగర శివార్లలో నిర్మానుష్య ప్రాంతాలను అక్రమార్కులు ఎంచుకుని పెద్ద ఎత్తున రేషన్ బియ్యం అక్రమ నిల్వ స్థావరాలను నిర్వహిస్తున్నట్టు సమాచారం ఉందన్నారు.ఈ దాడుల్లో పౌర సరఫరాల శాఖ రాష్ట్ర విజిలెన్స్ బృందంతో పాటు డిటీ హనుమా రవీందర్ నాయక్ స్వాదీనం చేసుకున్న సరకు పంచనామ చేశారు. వాహనాలను మోకిల పోలీసుల అదుపులో ఉంచారు. సరకును సురక్షిత నిల్వ నిమిత్తం చేవెళ్ళ పౌర సరఫరాల సంస్థ గిడ్డంగికి అప్పగించినట్లు మాచన రఘునందన్ వివారించారు

Loading

📅 September 10, 2024🏷 Hyderabad
National • Sep 10, 2024

యువత జీవితాలతో చెలగాటం ఆడుతున్న బీజేపీ : ప్రియాంకా గాంధీ

కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా మంగళవారం యూపీలో 69,000 ఉపాధ్యాయుల నియామకంపై బీజేపీపై విమర్శలు చేశారు. దళితులు, వెనుకబడిన వర్గాలకు న్యాయం చేయకుండా, రిజర్వేషన్ కుంభకోణం ద్వారా వారి హక్కులను హరించారన్నారు. బీజేపీ యువతకు సామాజిక, ఆర్థిక, మానసికంగా నష్టం చేస్తున్నదని విమర్శించారు. సుప్రీం కోర్టు ఉత్తర్వులతో హైకోర్టు తీర్పును నిలిపివేయడం, ఈ అంశంపై చివరి విచారణ సెప్టెంబర్ 23న జరిగేలా సూచించింది

Loading

📅 September 10, 2024🏷 National
Adilabad • Sep 10, 2024

సింగరేణి సంస్థ అప్రెంటిస్ షిప్ కోసం నోటిఫికేషన్ విడుదల

ఐటీఐ ఉత్తీర్ణులు, నేషనల్ ట్రేడ్ సర్టిఫికెట్ కలిగిన వారు మాత్రమే అర్హులు. ఇంటర్మీడియట్ కొర్సు చేసినవారు అర్హులు కాదు. దరఖాస్తులు ఈనెల 9 నుండి 23 వరకు www.apprenticeshipindia.org మరియు www.scclmines.com/apprenticeship పై చేయవచ్చు. సంబంధిత పత్రాలు, సర్టిఫికెట్లు ఈనెల 10 నుండి సంబంధిత ఎం.వీ.టి.సీ కార్యాలయాల్లో అందజేయాలి. 80% సీట్లు సంస్థ ఉద్యోగులు, కార్మికుల పిల్లల కోసం, మిగిలిన 20% తెలంగాణలోని ఆరు జిల్లాల నిరుద్యోగుల కోసం కేటాయించబడతాయి. రెండేళ్ల ఐటీఐ పూర్తి చేసిన వారికి నెలకు రూ.8,050, ఏడాది కోర్సు చేసిన వారికి రూ.7,700 చెల్లిస్తారు.

Loading

📅 September 10, 2024🏷 Adilabad
Uncategorized • Sep 10, 2024

సీఎం రిలీఫ్ ఫండ్ కి రూ.2కోట్లు అందజేసిన ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి

ఇటీవలి భారీ వర్షాలు, వరదలకు పలు ప్రాంతాల్లో ప్రజలకు తీవ్ర నష్టo వాటిల్లగా..వారిని ఆదుకునేందుకు.. ప్రభుత్వానికి తనవంతుగా చేయూత నిచ్చేందుకు ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి ముందుకొచ్చారు. హైదరాబాద్ రేస్ క్లబ్ డైరెక్టర్ అయిన ఎంపీ మరో డైరెక్టర్ నరసింహా రెడ్డి తో వెళ్లి ముఖ్య మoత్రి ఎనుముల రేవంత్ రెడ్డిని కలిశారు. రేస్ క్లబ్ తరఫున రూ.2 కోట్ల విరాళ చెక్కును ఇచ్చారు. వరద బాధితుల కోసం పెద్దమొత్తంలో అందజేయడం పట్ల సీఎం హర్షం వ్యక్తo చేసి.. వారికి కృతజ్ఞతలు తెలిపారు.

Loading

📅 September 10, 2024🏷 Uncategorized
Uncategorized • Sep 10, 2024

తెలంగాణ అభివృద్ధి కోసం 16వ ఆర్థిక సంఘానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి

TG: తెలంగాణ మరింత పురోభివృద్ధి సాధించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 16వ ఆర్థిక సంఘానికి సహాయం కోరారు. రుణ భారాన్ని తగ్గించేందుకు సహాయం, మద్దతు ఇవ్వాలని, రుణాలను రీ స్ట్రక్చర్ చేసే అవకాశం లేదా అదనపు ఆర్థిక సహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. 16వ ఆర్థిక సంఘం చైర్మన్ డాక్టర్ అరవింద్ పణగరియా అధ్యక్షతన, సభ్యులు అజయ్ నారాయణ్ ఝా, అనీ మాథ్యూస్, మనోజ్ పండా, సౌమ్యా కాంతి ఘోష్ సమక్షంలో జ్యోతీబా పూలే ప్రజాభవన్‌లో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి తెలంగాణ పరిస్థితులను వివరించారు.

Loading

📅 September 10, 2024🏷 Uncategorized
Andhra • Sep 10, 2024

లావణ్య,రాజ్‌తరుణ్‌ కేసులో మరో ట్విస్ట్‌

లావణ్య మరియు రాజ్‌తరుణ్‌ కేసులో మరో ట్విస్ట్‌ వెలుగులోకి వచ్చింది. లావణ్య, రాజ్‌తరుణ్‌పై తన బంగారం, పుస్తెల తాడు, తాళిబొట్టును దొంగిలించాడంటూ నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసింది. జ్యువెలరీ షాపు బిల్స్‌తో పాటు పీఎస్‌కి వచ్చిన లావణ్య, బంగారం దాచిన బీరువా తాళం చెవి రాజ్‌తరుణ్ దగ్గరే ఉందని, అతనే నగలు దొంగిలించినట్లు ఆధారాలు ఉన్నాయంటోంది.

Loading

📅 September 10, 2024🏷 Andhra
Uncategorized • Sep 10, 2024

బ్రహ్మకుమారి విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నషా ముక్త్ భారత్ అభియాన్ ర్యాలీ

ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ పట్టణంలోని అంబేడ్కర్ కూడలిలో ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన నషా ముక్త్ భారత్ అభియాన్ ర్యాలీని సిర్పూర్ శాసనసభ్యులు పాల్వాయి హరీష్ బాబు జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక నాయకులు, విద్యార్థులు, మరియు స్వచ్ఛంద సంస్థల సభ్యులు పాల్గొన్నారు. ర్యాలీ ద్వారా మద్యం, మత్తు పదార్థాల వాడకం వల్ల జరిగే దుష్ప్రభావాలను సొసైటీలోని ప్రజలకు తెలియజేయడం, యువతను ఆరోగ్యకరమైన జీవనశైలిలోకి మారాలని ప్రోత్సహించడం లక్ష్యంగా ర్యాలీ సాగింది. శాసనసభ్యులు హరీష్ బాబు మాట్లాడుతూ, మత్తు పదార్థాలు వినియోగించడం సమాజం, కుటుంబాల మీద తీవ్రమైన ప్రభావం చూపుతుందని, యువత ఈ సమస్యను ఎదుర్కొని విజయం సాధించాలని సూచించారు.

Loading

📅 September 10, 2024🏷 Uncategorized
error: Content is protected !!