📰
PRESS MEET App తెలుగు వార్తలు చదవండి · Free Download
▶ Install App
March 10, 2026
🔴 BREAKING
🗞 తాజా వార్తలు
Uncategorized • Sep 17, 2024

తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం (1948)

తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం 1946-1951 మధ్య హైదరాబాదు సంస్థానంలోని జమీందారీ వ్యవస్థకు వ్యతిరేకంగా తెలంగాణ రైతులు చేసిన శక్తివంతమైన పోరాటం. ఈ పోరాటం ముఖ్యంగా నిజాం రాజవంశం కాలంలో వ్యవసాయదారులపై అమానుషంగా కొనసాగిన జమీందారీ వ్యవస్థ, మయానాకు (అన్నదాతల నుంచి పన్నులు వసూలు చేసే దోపిడీ పద్ధతి) వ్యతిరేకంగా లేచిన పోరాటం. దీనికి కారణం అన్యాయంగా భూములను స్వాధీనం చేసుకోవడం, రైతుల శ్రమను దోచుకోవడం, వ్యవసాయదారులపై తీవ్ర బడుగు బలహీన వర్గాలను వేధించడం. 1946లో ప్రారంభమైన ఈ ఉద్యమానికి కమ్యూనిస్టు పార్టీ మద్దతు ఇవ్వడంతో పోరాటం మరింతగా వ్యాపించింది. వేతనాలు లేకుండా పని చేయించే వేట్టిచాకిరి, సామాన్య రైతులకు కనీసం బతకడానికి అవకాశం లేకుండా చేసే దోపిడీ విధానాలను వ్యతిరేకిస్తూ, రైతులు తుపాకులు చేపట్టారు. కొండగట్టు, నిజాం సంస్థానంలోని పలు గ్రామాల్లో రాచరిక, జమీందారీ వ్యవస్థలను కూల్చేందుకు ఉద్యమకారులు ఆగ్రహంతో పోరాడారు. తెలంగాణ సాయుధ పోరాటం క్రమంగా అభివృద్ధి చెందింది. 1948 సెప్టెంబర్ 17న భారతదేశం హైదరాబాద్ రాష్ట్రాన్ని స్వాధీనం చేసుకోవడంతో ఈ ఉద్యమానికి కీలక మలుపు ఏర్పడింది. భారత సైన్యం ‘ఆపరేషన్ పోలో’ ద్వారా హైదరాబాదు సంస్థానం స్వేచ్ఛ పొందడంతో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం ముగిసింది.ఈ పోరాటం రైతాంగానికి న్యాయం, భూమి స్వాధీనం, సమానత్వం, సామాజిక పురోగతికి మార్గం సుగమం చేసింది.

Loading

📅 September 17, 2024🏷 Uncategorized
Uncategorized • Sep 17, 2024

వినాయక నిమజ్జన ఏర్పాట్లపై సీఎం రేవంత్‌ రెడ్డి సమీక్ష, అధికారులకు సూచనలు

గణేష్ నిమజ్జన కార్యక్రమంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిర్విఘ్నంగా సాగేలా చూడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ట్యాంక్‌బండ్ వద్ద నిమజ్జన ప్రదేశాలను వారు పరిశీలించారు. నిమజ్జన ప్రక్రియ ముగిసే వరకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని చెప్పారు. నిమజ్జన ప్రదేశాల్లో అమర్చిన క్రేన్స్ వద్ద పరిస్థితులను ముఖ్యమంత్రి పరిశీలించారు. క్రేన్ డ్రైవర్స్, ఇతర సిబ్బందితో మాట్లాడారు. మధ్య మధ్యలో విశ్రాంతి తీసుకునేలా సిబ్బందికి మూడు షిఫ్టుల్లో విధులు ఉండేలా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. నిమజ్జనం కోసం వచ్చిన భక్తులను పలకరించారు. అధికారులకు అవసరమైన సూచనలు చేశారు. ముఖ్యమంత్రి వెంట పలువురు ప్రజా ప్రతినిధులతో పాటు జీఎహెచ్‌ఎంసీ మేయర్‌, కమిషనర్‌, హైదరాబాద్‌ సిటీ పోలీస్ కమిషనర్‌ ఇతర అధికారులు ఉన్నారు

Loading

📅 September 17, 2024🏷 Uncategorized
National • Sep 17, 2024

దేశవ్యాప్తంగా బుల్డోజర్ యాక్షన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం

దేశవ్యాప్తంగా బుల్డోజర్ యాక్షన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 1 వరకు కూల్చివేతలు చేపట్టవద్దని ఆదేశించింది. సుప్రీం, తదుపరి ఉత్తర్వులు వచ్చినంత వరకు బుల్డోజర్ చర్యలను నిలిపేయాలని స్పష్టం చేసింది. అయితే, ఈ ఆదేశాలు రైల్వే లైన్ల విస్తరణ, జలవనరుల పరిరక్షణ, ఫుట్‌పాత్, రోడ్ల విస్తరణ వంటి ప్రాజెక్టుల కోసం చేపట్టే కూల్చివేతలకు వర్తించవని కోర్టు స్పష్టంచేసింది. ఇటీవల కొన్ని రాష్ట్రాల్లో అనధికార నిర్మాణాలను కూల్చివేయడానికి బుల్డోజర్ చర్యలు ప్రారంభించడంతో పలు పిటిషన్లు సుప్రీంకోర్టులో దాఖలయ్యాయి. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీం, తాత్కాలికంగా ఈ చర్యలను నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది.

Loading

📅 September 17, 2024🏷 National
Uncategorized • Sep 17, 2024

ఎందరో మహనీయుల త్యాగఫలం మన తెలంగాణ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

సెప్టెంబర్‌ 17 తెలంగాణ ప్రస్థానంలో అత్యంత కీలకమైన రోజు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత లోతైన ఆలోచన చేసి ఈ శుభ దినానికి ప్రజా కోణాన్ని జోడిస్తూ ‘‘ప్రజా పాలన దినోత్సవం’’ గా జరపాలని నిర్ణయించినట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ➡️ప్రజా పాలన దినోత్సవం పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం జాతీయ జెండాను ఆవిష్కరించి రాష్ట్ర ప్రజలందరికీ ప్రజా పాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ➡️“ప్రజా పాలన దినోత్సవం.. ఈ నిర్ణయం నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష. వారి ఆలోచన. నాటి తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తి. ఈ నిర్ణయాన్ని ఎవరైనా తప్పుపడితే వారిది స్వార్థ ప్రయోజనమే అవుతుంది తప్ప ప్రజాహితం కాబోదు” అని అన్నారు. ➡️“తెలంగాణ భౌగోళిక స్వరూపం బిగించిన పిడికిలి మాదిరిగా ఉంటుంది. ఆ పిడికిలి పోరాటానికి సంకేతం. తెలంగాణలో అన్ని జాతులు, కులాలు, మతాలు కలిసికట్టుగా ఉంటాయన్న సందేశం అందులో ఇమిడి ఉంది. ఈ ఐక్యతను, ఈ సమైక్యతను దెబ్బతీసే విధంగా సెప్టెంబర్‌ 17 ను కొందరు వివాదాస్పదం చేయడం మంచిది కాదు” అని ముఖ్యమంత్రి హితవు పలికారు. ➡️జయ జయహే తెలంగాణ… గీతాన్ని రాష్ట్ర అధికారిక గీతంగా, సంక్షిప్త నామాన్ని టీజీగా మార్చడం, సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్టకు భూమి పూజ, గద్దర్ పేరిట అవార్డులు, మహిళా విశ్వవిద్యాలయానికి చాకలి ఐలమ్మ పేరును ఖరారు చేయడం వంటి తెలంగాణ సాంస్కృతిక పునరుజ్జీవనానికి చేపట్టిన అనేక చర్యలను ఈ సందర్భంగా సీఎం గుర్తుచేశారు. ➡️“ఎందరో మహనీయుల త్యాగఫలం మన తెలంగాణ. పరిపాలనలో, ప్రతి నిర్ణయం సందర్భంలో వారి త్యాగాలు మాకు గుర్తుంటాయి. నాలుగు కోట్ల ప్రజల సంక్షేమమే గీటురాయిగా పాలన ఉంటుంది. తెలంగాణ ప్రజలే ఈ రాష్ట్ర ప్రస్థానానికి నావికులు. వారి ఆలోచనలే మా ఆచరణ. వారి ఆకాంక్షలే. మా కార్యాచరణ” అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

Loading

📅 September 17, 2024🏷 Uncategorized
National • Sep 17, 2024

నేడు భారత ప్రధాని నరేంద్ర మోడీ 74వ పుట్టిన రోజు

నేడు భారత ప్రధాని నరేంద్ర మోడీ 74వ పుట్టిన రోజు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా బీజేపీ ఆయన పుట్టిన రోజు వేడుకలను “సేవా పర్వ్”గా నిర్వహిస్తోంది. సేవా పర్వ్ కార్యక్రమంలో భాగంగా వివిధ సామాజిక సేవా కార్యక్రమాలు, శ్రామదానం, ఆరోగ్య శిబిరాలు, రక్తదాన శిబిరాలు వంటి సేవా కార్యక్రమాలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. ప్రధాని మోడీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు దేశం నలుమూలల నుంచే కాకుండా, విదేశాల నుంచి కూడా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌కర్, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, ఎన్సీ సీపీ అధినేత శరద్ పవార్ వంటి భారతీయ నేతలు మోడీకి శుభాకాంక్షలు తెలిపారు. అంతేకాదు, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, జపాన్ ప్రధాని ఫుమియో కిషిదా, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మాక్రాన్ సహా ప్రపంచ నేతలు కూడా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ పుట్టిన రోజు సందర్భంగా ప్రధాని మోడీ ప్రజలకు సేవ చేయడంపై తన నిబద్ధతను పునరుద్ధరించారు.

Loading

📅 September 17, 2024🏷 National
Editorial • Sep 12, 2024

ఉపవాసం రకాలు – సంపూర్ణ వివరణ

హిందూ సంప్రదాయంలో ఉపవాసం అంటే ఆధ్యాత్మిక శుద్ధి, శరీర శుద్ధి, మరియు భక్తి వ్యక్తీకరణకు సంబంధించిన ఒక ముఖ్యమైన ఆచారం. పండగలు, ప్రత్యేక రోజుల్లో ఉపవాసం చేయడం వల్ల శరీరం, మనసు శుద్ధి అవుతుందని హిందువులు నమ్ముతారు. పండగల సమయంలో ఉపవాసం చేయడం దైవానికి సమర్పణ, కృతజ్ఞతలను చూపించడానికి ఒక సాధనంగా భావిస్తారు,ఉపవాస ఫలితాలు చూద్దాం. ఉపవాసం చేయడం వలన వివిధ అవయవాలలో కలుగు మార్పులు ఉబ్బసవ్యాధులు కలిగినవారు మొదట నిమ్మరసం తాగుటకు భయపడుతుంటారు. కాని ఉపవాసంలో నిమ్మరసం త్రాగినట్లైనా ఆయాసం పెరగదు సరికదా తగ్గును. అవసరం అయినచో వేడినీటిలో నిమ్మకాయ పిండుకుని ఉదయం , సాయంత్రం వేడివేడిగా తాగవచ్చు . మధ్యహ్నం మాత్రం చన్నీటిలో తాగవలెను . ఫలోపవాసం చేయు విధానం కాళహస్తి వేంకటేశ్వరరావు అనువంశిక ఆయుర్వేద వైద్యులు

Loading

📅 September 12, 2024🏷 Editorial
Uncategorized • Sep 12, 2024

సీతారాం ఏచూరి మరణంపై సీఎం రేవంత్ రెడ్డి సంతాపం

TG: వామపక్ష యోధుడు, సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ సీతారాం ఏచూరి మరణం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తెలుగు జాతికి సీతారాం గారి ప్రస్థానం ప్రత్యేకమని, నాలుగు దశాబ్ధాల ప్రజా జీవితంలో వారు చేసిన పోరాటాలు స్ఫూర్తిదాయకమని సీఎం అభిప్రాయపడ్డారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసిన ముఖ్యమంత్రి, ఏచూరి గారి మరణం దేశ రాజకీయాలకు తీరని లోటని పేర్కొన్నారు.

Loading

📅 September 12, 2024🏷 Uncategorized
Uncategorized • Sep 12, 2024

ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పై దాడి అరికెపూడి గాంధీ పై జాయింట్ సీపీకి ఫిర్యాదు

TG: ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పై దాడి చేసిన ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ మరియు కాంగ్రెస్ అనుచరులపై జాయింట్ సీపీకి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు చేసిన వారిలో మాజీ మంత్రులు హరీష్ రావు, వేముల శాంత్ రెడ్డి, సబితా ఇంద్ర రెడ్డి, ఇతర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మరియు బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. దాడికి సంబంధించి కౌశిక్ రెడ్డికి వైద్య పరీక్షలు నిర్వహించబడ్డాయి, మరియు పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Loading

📅 September 12, 2024🏷 Uncategorized
Uncategorized • Sep 12, 2024

తాండూర్ పోలీస్ స్టేషన్ లో నాగుపాము కలకలం

TG: వికారాబాద్ జిల్లా తాండూరు పీ ఎస్ లో నాగుపాము కలకం రేపింది. పట్టణ పోలీస్ స్టేషన్లో ఓ నాగుపాము దూరింది. స్టేషన్లో ఉన్న సిబ్బంది నాగుపామును గమనించి వెంటనే స్నేక్ స్నాచర్కు సమాచారం అందించారు. సొసైటీవారు పామును రెస్క్యూ చేశారు. దీంతో అంత ఊపిరి పీల్చుకున్నారు

Loading

📅 September 12, 2024🏷 Uncategorized
Crime • Sep 12, 2024

ఆసుపత్రి బాత్రూంలో అబార్షన్ అయింది అని నమ్మించిన మహిళా

TG: జనగామ జిల్లా పాలకుర్తి మండలంలోని ధరావత్ పల్లవి అనే వివాహిత 9 నెలలుగా గర్భవతి అని కుటుంబ సభ్యులు, సమాజాన్ని నమ్మించి మోసం చేసింది. జనగామ MCH ఆసుపత్రిలో నొప్పులు వస్తున్నాయంటూ చేరి, బాత్రూంలో అబార్షన్ అయిందని, బాబు డ్రైనేజీలో పడిపోయాడని చెప్పింది. ఆసుపత్రి సిబ్బంది అనుమానంతో పరీక్షలు చేయగా ఆమె గర్భవతే కాదని తేలింది. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఆమెను విచారిస్తున్నారు.

Loading

📅 September 12, 2024🏷 Crime
error: Content is protected !!