📰
PRESS MEET App తెలుగు వార్తలు చదవండి · Free Download
▶ Install App
March 10, 2026
🔴 BREAKING
🗞 తాజా వార్తలు
Khammam • Sep 28, 2024

పదవి విరమణ పొందుతున్న వారికి సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న వైస్ ప్రెసిడెంట్ ఎండి రజాక్

సింగరేణి కొత్తగూడెం ఏరియాలోని జి.ఎం ఆఫీస్ నందు ఏరియా ఇంజనీర్ గా విధులు నిర్వహిస్తూ, ఈనెల 30 సోమవారం రోజున పదవి విరమణ చేయుచున్న శ్రీ వల్లూరి.వెంకట.దుర్గాప్రసాద్, సింగరేణి సంస్థ యందు 36 సంవత్సరాలు వివిధ హోదాలో ఉద్యోగం నిర్వహించి, పదవి విరమణ పొందుతున్నoదున వారికి ఏరియా వర్క్ షాప్ నందు వర్క్ షాప్ హెచ్.ఓ.డి, టి. శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించడమైనది, ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ ఎండి రజాక్, వర్క్ షాప్ ఇంజనీర్స్,బి.శంకర్, టి అనిల్, ఏ. ఉపేందర్ బాబు,ఐఎన్టియుసి కార్యదర్శి ఎండి సత్తార్ పాష,ఏఐటీయూసీ ఫిట్ కార్యదర్శి మధు కృష్ణ, ఎలక్ట్రికల్ మెకానికల్ ఫోర్ మెన్స్,యు.రమేష్ బాబు,డి.భానుచందర్, ఎస్.డి.యాకుబుద్దీన్, పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏ.జి.యం మాట్లాడుతూ,కొత్తగూడెం ఏరియాలోనీ ఏరియా వర్క్ షాప్ గుండెకాయ లాంటిది ఏరియా లో ఉన్న ఓపెన్ కాస్ట్, మైన్స్, మరియు డిపార్ట్మెంట్ లలో ఏ అవసరం వచ్చిన ముందుగా వర్క్ షాప్ గుర్తుకువస్తుంది, గేరబాక్స్, పంప్స్, మోటర్స్, ట్రాన్స్ఫార్మర్స్, ప్రతిదీ వర్క్ షాప్ లో రిపేర్ చేసి వెంటనే ఏర్పాటు చేయడంలో వారి నైపుణ్యం,కనుపరుస్తూ శ్రద్దవహించి, ప్రొడక్షన్ ప్రోడక్టివిటీ లో సహయా సహాకారం అందిస్తూ, కొత్తగూడెం ఏరియా ముందు వరసలో ఉందని చెప్పవచ్చు, వర్క్ షాపు నందు కార్మిక నాయకులు, అధికారులు, టెక్నిషన్స్, సూపెర్వైజర్స్, ఉద్యోగుల, కలయిక తో ఇది సాధ్యమవుతుందని వారు, ఈ సందర్బంగా తెలియచేసారు, రజాక్,ఇంజనీర్స్ మాట్లాడుతు ఏ. జి.ఎం, రిటైర్మెంట్ అనంతరం ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యలతో,కుటుంబ సభ్యులతో సుఖంగా ఉండాలని,, ఈ సందర్బంగా తెలియచేసారు.

Loading

📅 September 28, 2024🏷 Khammam
Khammam • Sep 28, 2024

సీనియర్ సిటిజన్స్ డే వారోత్సవాలు: హక్కులు, సేవలపై అవగాహన సదస్సు

ఈరోజు 28-09-2024 శనివారం ఉదయం 10:30 గం:లకు తెలంగాణ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ భవనం, విద్యానగర్ కాలనీ, కొత్తగూడెం లో జిల్లా మహిళా,శిశు,దివ్యాంగుల, వృద్ధుల సంక్షేమ శాఖ వారు 25-09-2024 నుండి 01-10-2024 సీనియర్ సిటిజన్స్ డే వారోత్సవాలు లో భాగంగా అవగాహన సదస్సు నిర్వహించడం జరిగిందిఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ శాఖ తరపున శ్రీ నరేష్ మాట్లాడుతూ సీనియర్ సిటిజన్స్ హక్కులు వివరించారు. ఎవరైనా సీనియర్ సిటిజన్స్ ను కుటుంబ సభ్యులు నిర్లక్ష్యం చేస్తే సంక్షేమశాఖ దృష్టి కి తీసుకొని రావాలి అని వారికి తగిన న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ కొల్లు నాగేశ్వరరావు మాట్లాడుతూ సీనియర్ సిటిజన్స్ కు సంబంధించిన అన్ని హక్కులు, వైద్య సేవలు అందించే లా సంక్షేమ శాఖ అధికారులు కృషి చేయాలని తెలిపారు. సెక్రటరీ సురేష్ కుమార్ గారు మాట్లాడుతూ సీనియర్ సిటిజన్స్ కు బ్యాంకుల వద్ద హాస్పిటల్ లలో సీనియర్ సిటిజన్స్ కు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలని కోరారు . సభ్యులు శ్రీ Dr శ్రీ బత్తుల కృష్ణయ్య మాట్లాడుతూ సీనియర్ సిటిజన్స్ శారీరక, మానసిక ఒత్తిడి కి గురి కాకుండా ఆరోగ్యం కాపాడుకోవాలని కోరారు, రిటైర్ ప్రిన్సిపాల్ శ్రీ ప్రసన్న కుమార్ గారు సీనియర్ సిటిజన్స్ కూడా ప్రతి సంవత్సరం ఇన్ కం టాక్స్ పరిధి లో ఉన్న లేకున్నా సబ్మిట్ చేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో రిటైర్ ITI ప్రిన్సిపాల్ శ్రీ సందీప్, శ్రీ నరసింహారావు, సాహితీ,సీనియర్ సిటిజన్స్ సభ్యులు శ్రీ పాండురంగారావు, శివ రామక్రిష్ణ,కామేశ్వరరావు, మైనేని నాగేశ్వరరావు, గురుమూర్తి, రాజేంద్రప్రసాద్,కేశవరావు, ధర్మారావు, మోహన్ లాల్,విజయ మోహన్, నసీరుల్లా RP జోసెఫ్ తదితరులు పాల్గొన్నారు

Loading

📅 September 28, 2024🏷 Khammam
Khammam • Sep 27, 2024

ఆచార్య శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ గారి జయంతి వేడకను నిర్వహించిన కొత్తగూడెం ఏరియా సింగరేణి యామాన్యం

తేదీ. 27.09.2024 న కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ గారి కార్యాలయము నందు స్వర్గీయులు ఆచార్య శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ గారి జయంతి వేడకను నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిఎం గారు మాట్లాడుతూ ఆచార్య శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ గారు తెలంగాణ ఉద్యమ నాయకులలో ప్రముఖుడని అలాగే స్వాతంత్ర ఉద్యమాలలో నిరంకుశ నిజాం వ్యతిరేక ఉద్యమాలలో చురుకుగా పాల్గొన్నారని, తెలంగాణ కోసం మంత్రి పదవిని కూడా తృణపాయంగా వదిలేసి నిబద్ధత కలిగిన రాజకీయవేత్త, రాష్ట్ర చేనేత సహకారం రంగానికి కూడా చేశారని తెలియజేశారు.96 సంవత్సరాల వయసులో కూడా చలిని లెక్క చేయకుండా ఢిల్లీలోని జంతర్ మంతర్ లో తెలంగాణ కోసం దీక్ష చేశారు. ఆయన జీవితం అందరికీ ఆదర్శప్రాయమని తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయడం కొరకు వారు అహర్నిశలు కృషి చేశారని అనేక సమ్మెలలో కూడా పాల్గొన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో జిఎం గారితో పాటు ఎస్ ఓ టు జిఎం జి.వి. కోటి రెడ్డి, ఏఐటియుసి వైస్ ప్రెసిడెంట్ కొత్తగూడెం ఏరియా, కే. రాములు, ఐఎన్ టి యు సి వైస్ ప్రెసిడెంట్ కొత్తగూడెం ఏరియా ఎండి. రజాక్, కొత్తగూడెం ఏరియా అధికారుల సంఘం జనరల్ సెక్రటరీ ఏ ఉపేంద్ర బాబు, ఎజిఎం(ఫైనాన్స్) కే హనా సుమలత, డిజిఎం (పర్సనల్) బి. శివ కేశవరావు, డీజీఎం (ఐఈడి) ఎన్.యోహాన్, ఏరియా సేఫ్టీ ఆఫీసర్ ఏం వెంకటేశ్వరరావు, ఎన్విరాన్మెంట్ ఎస్.ఓ.ఎం టి.సత్యనారాయణ, డివై. పిఎం ఎం. శ్రావణ్ కుమార్, సీనియర్ పిఓ ఎం. మురళి, సీనియర్ ఎస్టేట్స్ ఆఫీసర్ బి. తౌరియా, జిఎం ఆఫీస్ ఫిట్ సెక్రటరీలు కే.సౌజన్య, సిహెచ్ సాగర్ మరియు జిఎం కార్యాలయంలోని ఇతర ఉద్యోగులు, అధికారులు పాల్గొన్నారు. డిజిఎం (పర్సనల్), కొత్తగూడెం ఏరియా.

Loading

📅 September 27, 2024🏷 Khammam
Khammam • Sep 27, 2024

తెలంగాణ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కొత్తగూడెంలో ర్యాలీ

ఈరోజు 27-09-2024 శుక్రవారం ఉదయం 10:30 గం:లకు (01-10-2024) అంతర్జాతీయ సీనియర్ సిటిజన్స్ డే సందర్భంగా జిల్లా మహిళా,శిశు, వికలాంగుల, వృద్ధుల సంక్షేమ శాఖ వారు వరప్రసాద్, నరేష్ గార్ల ఆధ్వర్యంలో జరిగిన వారోత్సవాళ్ళో భాగంగా కొత్తగూడెం ,పోస్టాఫీసు సెంటర్ నుండి బస్టాండ్ వరకు తెలంగాణ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్, విద్యానగర్, మరియు వివిధ ఆర్గనైజేషన్లతో ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ కొల్లు నాగేశ్వరరావు మాట్లాడుతూ… దేశవ్యాప్తంగా ఉన్న సీనియర్ సిటిజన్స్ అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు అని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు సహాయం చేయాలని, ఉచితంగా వైద్య సేవలు, బస్సులు, రైల్వే లలో యాభై శాతం రాయితీ ఇవ్వాలని, మరియు లక్షా యాభై వేల రూపాయల లోపు ఆదాయం వున్న సీనియర్ సిటిజన్స్ కు ఆసరా పెన్షన్ లు మంజూరు చేయాలని కోరారు. ఈ అసోసియేషన్ సభ్యులు శ్రీ సురేష్ కుమార్,T పాండురంగారావు, శివరామక్రిష్ణ, Dr బత్తుల కృష్ణయ్య, ధర్మారావు, మైనేని నాగేశ్వరరావు, మోహన్ లాల్ కేశవరావు, కామేశ్వరరావు, జోసెఫ్, రాజేంద్రప్రసాద్, గురుమూర్తి, కేశవర్ధన్ నసీరుల్లా, అంజనానందం, తోట సమ్మయ్య, తదితరులు పాల్గొన్నారు.

Loading

📅 September 27, 2024🏷 Khammam
Khammam • Sep 26, 2024

రామవరం కమ్యూనిటీ హాల్ రేనోవేషన్ పనులును పర్యవేక్షించిన INTUC కొత్తగూడెం ఏరియా వైస్ ప్రెసిడెంట్ ఎం.డి రజాక్

కార్మిక ప్రాంతమైన రామవరం నందు కమ్యూనిటీ హాల్ లో జరుగుతున్న ఆధునికరణ పనులను పర్యవేక్షించిన కొత్తగూడెం ఏరియా వైస్ ప్రెసిడెంట్ ఎండి రజాక్,మరియు ఐఎన్టియుసి నాయకులు పాల్గొని, ఏదైతే కమ్యూనిటీ హాల్ నందు ఆధునీకరణ పనులను శుభకార్యాలకు అవసరాల నిమిత్తం నిర్మాణం శర వేగంగా జరుగుతున్నాయి, కానీ ఇంకా కొన్ని పనుల ను నిర్మించాల్సిన అవసరం ఉన్నవి, దీని గురించి కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ శాలెం రాజు గారి దృష్టికి తీసుకెళ్లామని ముఖ్యంగా బౌండరీ చుట్టూ వాల్ పై మేష్ ఏర్పాటు చేయాలి, వాష్ బేసిన్ ఏరియాలో ఐరన్ గ్రిల్ ఏర్పాటు చేయాలి, కోతులు రావడానికి అవకాశం ఉంది, అలాగే దొంగలు వాటర్ ట్యాపులు ఎత్తుకుపోయే అవకాశం ఉంది. ఎంట్రన్స్ నందు రెండవ గేట్ ఏర్పాటు చేయాలి, ఆవులు జంతువులు రాకుండా క్యాటిల్ గార్డ్ ఏర్పాటు చేయాలి, కిచెన్ పక్కన స్టోర్ రూమ్ ఏర్పాటు చేయాలి, డైనింగ్ మరియు కిచెన్ మధ్యలో చిన్న బిట్టు ఫ్లోరింగ్ చేయించాలి, ఓపెన్ స్టేజి నందు ఓపెన్ షెడ్ వేయించాలి, స్టేజ్ ముందు రెండు లైటింగ్ కొరకు టవర్స్ ఏర్పాటు చేయాలి, స్టేజ్ ముందున్న ఓపెన్ ప్లేస్ లో లెవెలింగ్ చేయించి మొత్తం ఫ్లోరింగ్ చేయించాలి, అలాగే కమ్యూనిటీ హాల్ నందు ఏ/సీలు ఏర్పాటు చేయాలని, త్వరగా కమ్యూనిటీ హాల్ కార్మిక కుటుంబాలకు అందుబాటులో తేవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఐఎన్టియుసి నాయకులు బూటిక రాజేశ్వరరావు,ఎస్కే గౌస్, ఎండి సత్తార్ పాష, ఏం అశోక్, సిహెచ్ కుమార్, ఎం కొమురయ్య, తిరుపతి, రహీం, బింగి గోపాల్, పూర్ణ, భాను కమల్, జానీ పాషా, ప్రసాద్, మహమ్మద్ జానీ, రాజేందర్, కొండలు, రాంధాని, శ్రీకాంత్ శర్మ, నరేష్, జోగేశ్వరరావు, శేఖర్, మిత్రులు, శ్రేయోభిలాషులు, తదితరులు పాల్గొన్నారు

Loading

📅 September 26, 2024🏷 Khammam
Uncategorized • Sep 26, 2024

ద‌స‌రా పండుగ నాటికి రాష్ట్రంలో ఇందిర‌మ్మ క‌మిటీలు : సీఎం రేవంత్

ద‌స‌రా పండుగ నాటికి రాష్ట్రంలో ఇందిర‌మ్మ క‌మిటీలు ఏర్పాటు చేయాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. అన్ని స్థాయిల్లో క‌మిటీల ఏర్పాటుకు ఒకట్రెండు రోజుల్లో విధివిధినాలు రూపొందించాల‌ని సూచించారు. అర్హులు అందరికీ ఇందిర‌మ్మ ఇళ్లు ద‌క్కాల‌న్నారు. 🔺ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై సచివాలయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఇతర ఉన్నతాధికారులతో సీఎం సమీక్షించారు. 🔺ప్ర‌ధాన‌మంత్రి ఆవాస్ యోజ‌న కింద ఇత‌ర రాష్ట్రాలకు ల‌క్ష‌ల సంఖ్య‌లో ఇళ్లు మంజూరు అవుతుంటే, తెలంగాణకు ఎందుకు ఆ స్థాయిలో కేటాయింపులు జరగడం లేదని అధికారులను ప్రశ్నించారు. కేంద్రం మంజూరు చేసే గృహాల్లో ఈసారి రాష్ట్రానికి గ‌రిష్ట సంఖ్య‌లో సాధించేందుకు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆదేశించారు. 🔺ఇళ్ల విషయంలో కేంద్రానికి ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వాలని, డేటాను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలన్నారు. 🔺రాజీవ్ స్వగృహలో నిర్మించి ఏళ్ల తరబడి వృథాగా ఉన్న బ్లాక్‌లు, ఇళ్లు వేలం వేయాల‌ని ముఖ్య‌మంత్రి అధికారుల‌కు సూచించారు. 🔺డ‌బుల్ బెడ్రూమ్ ఇళ్ల ల‌బ్ధిదారుల ఎంపిక పూర్త‌యినా వాటిని అప్ప‌గించ‌కపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్హుల‌కు ఆ ఇళ్ల‌ను అప్ప‌గించాల‌న్నారు. హైద‌రాబాద్ న‌గ‌రంలో నిర్మించి నిరుప‌యోగంగా ఉన్న బ్లాక్‌ల‌కు మౌలిక వ‌స‌తులు క‌ల్పించి, అర్హులైన ల‌బ్ధిదారుల‌కు అప్ప‌గించాల‌ని చెప్పారు.

Loading

📅 September 26, 2024🏷 Uncategorized
Khammam • Sep 25, 2024

కొత్తగూడెం ఏరియాలో జరిగిన గేట్ మీటింగ్ లో పాల్గొన్న ఐఎన్టీయూసీ జనరల్ సెక్రెటరీ త్యాగరాజు ,వైస్ ప్రెసిడెంట్ ఎండి రజాక్

బుధవారం రోజున కొత్తగూడెం ఏరియాలోని ఏరియా వర్క్ షాప్ నందు ఫిట్ కార్యదర్శి ఎం.డి సత్తార్ పాష ఆధ్వర్యంలో ఏరియా వైస్ ప్రెసిడెంట్ ఎం.డి రజాక్ అధ్యక్షతన జరిగిన గేట్ మీటింగ్లో ముఖ్య అతిధిగా జనరల్ సెక్రెటరీ త్యాగరాజు పాల్గొన్నారు, త్యాగరాజు , రజాక్ మాట్లాడుతూ గడిచిన 2023- 24 వార్షిక సంవత్సరముల లాభాల వాటను 33% గా సింగరేణి కార్మికులకు ఇచ్చే విధంగా ప్రకటించిన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి, వారితోపాటు ఉప ముఖ్యమంత్రి శ్రీ మల్లు భట్టి విక్రమార్క, రెవెన్యూ శాఖ మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరావు, ఐటీ శాఖ మంత్రి శ్రీ దుద్దిల శ్రీధర్ బాబు, సీ.ఎన్.ఎండి ఎన్.బలరాం నాయక్, ఐఎన్టియుసి సెక్రటరీ జనరల్ శ్రీ జనక్ ప్రసాద్, కోల్ బెల్ట్ శాసన సభ్యులు అలాగే గుర్తింపు సంఘం నాయకులు పాల్గొన్నారు, గత ప్రభుత్వం సింగరేణి లాభాల వాటాను కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి లాభాలను కార్మికులకు గతంలో ఎప్పుడూ లేని విధంగా 33% బోనస్ పెంచడంతోపాటు మిగతా లాభాలను కార్మిక కుటుంబాల కోసం సింగరేణి విస్తరణ కోసం ప్లాన్ చేస్తున్నది,లాభాలను శ్వేత పత్రం వలె క్లియర్ గా అందరికి అర్థమయ్యేలా వివరించడం జరిగింది, అలాగే అవుట్సోర్సింగ్ కార్మికులకు 25 వేల పైచిలుకు మందికి 5000 చొప్పున లాభాల వాటా ప్రకటించడం శుభ పరిణామం అని అందుకు కృషి చేసిన ఐఎన్టీయూసీ సెక్రెటరీ జనరల్ శ్రీ జనక్ ప్రసాద్ కు ఔట్సోర్సింగ్ కార్మికులు అభినందనలు తెలియజేశారు, సింగరేణి లాభాల తర్వాత తీసుకుంటున్న చర్యలు ఆ కంపెనీ భవిష్యత్తుకు బాటలు వేయాలని భావిస్తున్నది సింగరేణి పరిరక్షణతో పాటు కార్మిక సంక్షేమం కోసం ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా చర్యలు తీసుకోనున్నది, మిగతా లాభాలను గత సర్కారుకు భిన్నంగా మళ్ళీ కార్మిక సంక్షేమం కోసమే ఖర్చు చేయడంలో భాగంగా సింగరేణి బొగ్గు ఉత్పత్తి విస్తరణకు వినియోగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం సంస్థ అభివృద్ధి లక్ష్యంగా ముందుకెళ్తున్నదని, సెక్రెటరీ జనరల్ జన ప్రసాద్ ప్రెస్ మీట్ లో కూడా వివరంగా తెలియజేయడం జరిగింది, అదేవిధంగా వి కే ఓ సి పి అతి త్వరలో వస్తుందని, ఆశాభవాన్ని వ్యక్తం చేస్తూనే , కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా,కార్మికుల హక్కుల పై రాజీలేని పోరాటం చేస్తున్న యూనియన్ ఐ ఎన్ టి యుసి అని , మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ మెంబర్ ఆల్బర్ట్, బూటుక రాజేశ్వరరావు, జిదుల రాజేశ్వరరావు, చీఫ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎస్కే గౌస్, స్టోర్ ఫిట్ కార్యదర్శి కే నట్రాజ్, బ్రాంచ్ కార్యదర్శి ఎం.అశోక్, ఆర్గానిక్ సెక్రెటరీ ఐమన్స్, బిక్షపతి, తిరుపతి, అసిస్టెంట్ సెక్రటరీ చందులాల్, యాకువుద్దీన్,సముద్రాల శ్రీనివాస్, దుర్గా ప్రసాద్, రహీం,గోగ్గల శ్రీనివాస్, గోవర్ధన్, చంద్ర శేఖర్, బింగి గోపాల్, కాజా పాషా, ప్రవీణ్ కుమార్, మహేశ్వరరావు, బండి సంపత్, చంద్రశేఖర్, ప్రభాకర్, ఎండి గౌస్, అంకుష్, కృష్ణ, వేణు, టిఆర్ఎస్ రాజు ,సముద్రాల శ్రీనివాస్ ,సలిగంటి శ్రీనివాస్, శ్రీకాంత్ శర్మ, నరేష్, సమ్మయ్య, జివెల్ శ్రీనివాస్, హరీష్, నర్సింగరావు నర్సింగరావు, కళ్యాణ్, బాబర్ భాష, ఎల్లయ్య, కనకయ్య,రామకృష్ణ, పద్మావతి, స్పందన, వాసంతిక,నాయకులు కార్యకర్తలు, ఉద్యోగులు,మిత్రులు శ్రేయోభిలాషులు సానుభూతిపరులు తదితరులు పాల్గొన్నారు*

Loading

📅 September 25, 2024🏷 Khammam
Uncategorized • Sep 18, 2024

ఎంఎస్‌ఎంఈ పరిశ్రమలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ఎంఎస్‌ఎంఈ పరిశ్రమలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంఎస్‌ఎంఈ పాలసీ-2024ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్‌బాబు పాల్గొన్నారు. భట్టి విక్రమార్క మాట్లాడుతూ, సూక్ష్మ, చిన్న పరిశ్రమలను పటిష్టం చేయడం ఆర్థిక వ్యవస్థకు కీలకమని, రాహుల్‌ గాంధీ ఆలోచనలను అనుసరిస్తూ సీఎం రేవంత్‌రెడ్డి ఈ కొత్త పాలసీని ప్రవేశపెట్టారని అన్నారు. భారీ పరిశ్రమలతో పాటు సూక్ష్మ, చిన్న పరిశ్రమలు కూడా సమానంగా అభివృద్ధి చెందడం అవసరమని ఆయన వెల్లడించారు.

Loading

📅 September 18, 2024🏷 Uncategorized
National • Sep 18, 2024

రాహుల్ గాంధీ హత్యకు కుట్ర జరుగుతోంది : కాంగ్రెస్ పార్టీ

కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ భద్రతకు ముప్పు ఉందని ఆ పార్టీ అధికారికంగా ఫిర్యాదు చేసింది. కాంగ్రెస్ సీనియర్‌ నేత అజయ్ మాకెన్ దిల్లీలోని తుగ్లక్‌ రోడ్ పోలీస్ స్టేషన్‌లో రాహుల్ హత్యకు కుట్ర జరుగుతోందంటూ ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులో రాహుల్‌ గాంధీని లక్ష్యంగా చేసుకొని ఆయనకు ప్రాణ హాని కలిగించే కుట్ర జరుగుతోందని పేర్కొన్నారు. మాకెన్ ఈ ఫిర్యాదును కేవలం పోలీసులకు మాత్రమే కాకుండా కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా పంపించారు. రాహుల్ గాంధీ ప్రస్తుతం కాంగ్రెస్‌ పార్టీ పునర్‌వ్యవస్థీకరణలో కీలక పాత్ర పోషిస్తున్న తరుణంలో, ఈ సవాలు ముందుకు రావడం ఆందోళన కలిగించే అంశమని నేతలు అభిప్రాయపడుతున్నారు.రాహుల్ గాంధీ తన “భారత్‌ జోడో యాత్ర” మరియు వివిధ రాష్ట్రాల్లోని పర్యటనల సమయంలో భారీ ప్రజాసమూహాన్ని ఆకర్షిస్తున్నప్పటికీ, ఈ భద్రతా ముప్పు నేపథ్యంలో కాంగ్రెస్‌ నాయకత్వం రాహుల్ భద్రతకు మరింత జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులను కోరింది.

Loading

📅 September 18, 2024🏷 National
error: Content is protected !!