📰
PRESS MEET App తెలుగు వార్తలు చదవండి · Free Download
▶ Install App
March 10, 2026
🔴 BREAKING
🗞 తాజా వార్తలు
National • Oct 17, 2024

సుప్రీంకోర్టులో కొత్త న్యాయదేవత విగ్రహం కళ్లకు గంతలు తొలగింపు

సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల లైబ్రరీలో ఏర్పాటు చేసిన న్యాయదేవత విగ్రహం ప్రస్తుతం విశేషంగా చర్చనీయాంశమైంది. సంప్రదాయంగా న్యాయదేవత విగ్రహాన్ని కళ్లకు గంతలు కట్టిన రూపంలో చూసి ఉంటాం, అది “చట్టం గుడ్డిది” అనే భావనను ప్రతిబింబిస్తుంది, అంటే చట్టం ముందుకు ఎవరైనా సమానమే అనే సిద్ధాంతం. అయితే, సుప్రీం కోర్టు తాజా విగ్రహంలో న్యాయదేవత కళ్లకు ఉన్న గంతలు తొలగించి, ఆమె ఎడమ చేతిలో ఖడ్గానికి బదులుగా భారత రాజ్యాంగాన్ని ఉంచారు. ఈ మార్పులు చట్టానికి కొత్త వర్ణనను అందిస్తోందని, “చట్టం గుడ్డిది కాదు” అనే భావనను స్పష్టంగా తెలియజేస్తున్నాయని అనుకుంటున్నారు. చట్టం కేవలం న్యాయం మాత్రమే కాకుండా, రాజ్యాంగపరమైన విలువలను, నియమాలను అనుసరించే సామర్థ్యం కలిగి ఉందనే సందేశం ఈ విగ్రహం ద్వారా అందిస్తున్నట్టు భావిస్తున్నారు. ఈ ప్రతిష్ఠాపనపై విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు, కొందరు ఈ మార్పు ద్వారా చట్టం సరైనంగా కళ్లుచూడగలదని, రాజ్యాంగం ఆధారంగా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరాన్ని సూచిస్తుందని సంతోషిస్తున్నారు. మరోవైపు, చట్టం సమానత్వానికి ప్రతీక అయిన గంతలు తొలగించడంపై కొందరు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.

Loading

📅 October 17, 2024🏷 National
Andhra • Oct 17, 2024

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి మంజూరైన 7 జాతీయ రహదారులు

భారతమాల పరియోజన ప్రథమ దశలో రాష్ట్రానికి మంజూరైన 7 జాతీయ రహదారుల నిర్మాణానికి కేంద్ర రహదారులు, రవాణా శాఖ తాజాగా పచ్చజెండా ఊపింది. ఈ ప్రాజెక్టులు గతంలోనే మంజూరైనా, టెండర్ ప్రక్రియకు బ్రేక్ పడింది. ప్రస్తుతం, మొత్తం ప్రాజెక్టులు ఏకకాలంలో ప్రారంభించేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది. రాష్ట్ర రహదారులు, భవనాలశాఖ కార్యదర్శికి ఈ మేరకు లేఖ పంపింది. ఈ ప్రాజెక్టులు మొత్తం 384 కిలోమీటర్ల పొడవున నిర్మించబడుతుండగా, ఖర్చు మొదట రూ. 6,646 కోట్లుగా అంచనా వేయగా, ఇప్పుడు దాన్ని రూ. 6,280 కోట్లకు తగ్గించారు.

Loading

📅 October 17, 2024🏷 Andhra
Telangana • Oct 16, 2024

హన్మకొండలో మాల ఉద్యోగుల, ఆత్మీయుల సమ్మేళనం

తేదీ: 20/10/2024 (ఆదివారం)సమయం: ఉదయం 10:30 నుండి సాయంత్రం 5:00 గంటల వరకు సమ్మేళనంలో ముఖ్య అతిధులుగా పాల్గొనే వారు: మాల మరియు మాల ఉపకులాల ప్రజలు, ఉద్యోగులందరూ రాజకీయాలకు అతీతంగా సమ్మేళనంలో పాల్గొనాల్సిన అవసరం ఉంది. మన సమాజంలో ఉన్న సంక్షోభాలను అధిగమించేందుకు మరియు మాల ఉద్యోగుల హక్కుల కోసం అండగా నిలబడేందుకు ఇది ఒక అవకాశం. రాజకీయ విభజనల బారిన పడకుండా, సామూహిక బంధాలు మరియు సహకారం ప్రాధాన్యతను ఇవ్వడం ముఖ్యమైంది. ఈ సమ్మేళనంలో ఉద్యోగుల సమస్యలు, సాధనాలు, మరియు అభివృద్ధి పట్ల దృష్టి సారించాలి. మనం కలసి చేరి, ఒక శక్తివంతమైన బృందంగా పనిచేస్తే, మన హక్కుల కోసం సమర్థంగా పోరాడవచ్చు. అందుకే, ఈ సమ్మేళనంలో రాజకీయాలకు అతీతంగా అందరూ పాల్గొని, సాధికారత పై చర్చించి, కలిసి ముందుకు సాగాలి. ప్రతి ఒక్కరికీ తమ అభిప్రాయాలను వ్యక్తం చేయడానికి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. ఈ సభలో పాల్గొని ప్రసంగించడానికి మాల సంఘాల ప్రతినిధులు మరియు ఉద్యోగ సంఘాల సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేయాలని ఆహ్వానం తెలియజేశారు. లంచ్ : 1:00 గంటకు 2nd సెషన్ 1:30 నుండి సాయంత్రం 5:00 గంటల వరకుస్థలం :KLN ఫంక్షన్ హాల్ లక్ష్మిచింతగట్టు కెనాల్ దగ్గర, హన్మకొండ. ఆర్గనైజడ్ బై తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్ అఫ్ మాల. (TEAM ). వరంగల్

Loading

📅 October 16, 2024🏷 Telangana
Telangana • Oct 12, 2024

CM రేవంత్ తన స్వగ్రామం కొండారెడ్డిపల్లిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన

దసరా పండుగ శుభ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన స్వగ్రామం కొండారెడ్డిపల్లిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి కొండారెడ్డిపల్లికి చేరుకున్న సందర్భంగా ఘన స్వాగతం లభించింది. డప్పు దరువులు, కోలాటాలు, పూల జల్లులతో గ్రామస్తులు పెద్దఎత్తున హాజరై స్వాగతం పలికారు. అనంతరం ముఖ్యమంత్రి గారు శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ☑️గ్రామంలో రూ.72 లక్షల వ్యయంతో నిర్మించిన మోడల్ గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. గ్రామ పంచాయతీ భవనం ఎదుట మామిడి మొక్కను నాటారు. ☑️రూ. 55 లక్షలు వెచ్చించి అత్యాధునిక సదుపాయాలతో నిర్మించిన మోడల్ గ్రంథాలయ భవనాన్ని ప్రారంభించారు. ☑️రూ. 18 లక్షల వ్యయంతో అత్యాధునిక సదుపాయాలతో నిర్మించనున్న ఎస్సీ కమ్యూనిటీ భవనానికి శంకుస్థాపన చేశారు. ☑️రూ.18 కోట్లతో చేపట్టే భూగర్భ మురుగు నీటి పైప్ లైన్ నిర్మాణం, మురుగునీటి శుద్ధి కేంద్రం, అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ☑️రూ. 64 లక్షలతో అత్యాధునిక ప్రయాణ ప్రాంగణ నిర్మాణం, ప్రధాన రహదారి గుండా విద్యుత్ దీపాలంకరణ పనులకు శంకుస్థాపన చేశారు. ☑️రూ. 32 లక్షల వ్యయంతో చిల్డ్రన్స్ పార్క్, వ్యాయామశాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ☑️రూ.70 లక్షలతో అధునాతన సదుపాయాలతో కమ్యూనిటీ భవనం, ప్రహరీ గోడ నిర్మాణ పనులను ప్రారంభించారు. ☑️ముఖ్యమంత్రి వెంట నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లు రవి, శాసనసభ్యులు చిక్కుడు వంశీకృష్ణ, కసిరెడ్డి నారాయణ రెడ్డి, కూచుకుళ్ల రాజేశ్ రెడ్డితో పాటు ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

Loading

📅 October 12, 2024🏷 Telangana
Crime • Oct 11, 2024

బంజారాహిల్స్‌లో జ్యువెలరీ షాప్‌లో రూ.6 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు అపహరణ; షాప్ మేనేజర్ అదృశ్యం

హైదరాబాద్: బంజారాహిల్స్‌లోని ఓ జ్యువెలరీ షాప్‌లో రూ.6 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు అపహరణకు గురయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించారు. గత రాత్రి చోటు చేసుకున్న ఈ ఘటనలో, షాప్ మేనేజర్ సుకేతు షా అదృశ్యం అయ్యాడు, అతని జాడ తెలియలేదు.జ్యువెలరీ షాప్ వద్ద ఉన్న సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా, ముఠా సభ్యులు ఎలా ప్రవేశించి ఆభరణాలను అపహరించారో పోలీసులు పరిశీలిస్తున్నారు. సుకేతు అకస్మాత్తుగా కన్పించకపోవడం అనుమానాలను కలిగిస్తోంది. అతని గృహంలో కూడా అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు.

Loading

📅 October 11, 2024🏷 Crime
Telangana • Oct 4, 2024

అక్టోబర్ 25న మాల మహాపాదయాత్ర ను విజయవంతం చేయండి : జాతీయ మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్

హైదరాబాదులో మాల మహానాడు రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సమావేశం 👉ఎస్సీ వర్గీకరణ ప్రయత్నాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ… జాతీయ మాల మహానాడు ఆధ్వర్యంలో అక్టోబర్ 25 నుండి డిసెంబర్ 1 తారీకు వరకు మాలల మహాపాదయాత్రను నిర్వహిస్తున్నాము ఈ పాదయాత్రకు ప్రజలు ప్రజాస్వామిక వాదులు మాల ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొని సంఘీభావం తెలపాలని కోరడమైనది. 👉భద్రాచలం నుండి హైదరాబాద్ వరకు ఈ పాదయాత్ర కొనసాగుతుంది 👉1000 కిలోమీటర్లు👉16 జిల్లాలు👉ఉమ్మడి పాత 7 జిల్లాలు👉45 నియోజకవర్గాలలో ఈ పాదయాత్ర కొనసాగుతుంది. వర్గీకరణ ప్రయత్నాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విరమించుకోవాలిఉత్తమ్ కుమార్ రెడ్డి కమిటీని రద్దు చేయాలిమాలలమీద మందకృష్ణ విషం చిమ్మడం మానుకోవాలి పాదయాత్ర షెడ్యూల్:▪️▪️▪️▪️▪️▪️▪️▪️భద్రాచలం (25-10-2024), మొరంపల్లి బంజర, పెద్దమ్మ గుడి, పాల్వంచ, కొత్తగూడెం టేకులపల్లి, ఇల్లెందు, లింగాల, ఖానాపురం, ఖమ్మం, తిరుమలాయపాలెం, మరిపెడ, ఎడ్జెర్ల,చింతపల్లి, కురవి, అప్పరాజుపల్లి, గూడూరు, మంగళవారిపేట,ఖానాపురం, నర్సంపేట, గిర్నిబావి, గీసుకొండ, ధర్మారం, వరంగల్, హనుమకొండ, హసన్ పర్తి, ఎల్కతుర్తి, హుజురాబాద్,కేశవపట్నం, మానకొండూరు, కరీంనగర్, సుల్తానాబాద్, పెద్దపల్లి, బసంత్ నగర్, రామగుండం, ఇందారం, మంచిర్యాల, హాజీపూర్,లక్షెట్టిపేట, రాయపట్నం, ధర్మపురి, జగిత్యాల, కోడిమెల, పజిల్, వట్టెముల, సాత్రాజుపల్లి, వేములవాడ, సిరిసిల్ల, జక్కాపూర్, దుబ్బాక, బొంపల్లి, మెదక్ జిల్లా రామాయంపేట, చేగుంట, తూఫ్రాన్, కాలెకల్,మనోహరాబాద్,మేడ్చల్, శామిర్ పేట్, ఘట్ కేసర్, ఉప్పల్, హైదరాబాద్ ట్యాంక్ బండ్ విగ్రహం( ముగింపు1-12-2024) రవీంద్రభారతి లో ముగింపు సభ ఈ సమావేశంలో జాతీయ ప్రదానకార్యదర్శి భైరి రమేష్, జాతీయ కమిటి సభ్యులు గోలి సైదులు, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చిప్పల నర్సింగరావు, రాష్ట్ర క్రమశిక్షణ కమిటి చైర్మైన్ ఉదండపురం సత్యనారాయణ, రాష్ట్ర పొలిట్ బ్యూరో చైర్మైన్ ర్యాకం శ్రీరాములు, రాష్ట్ర కో. ఆర్డినేటర్ బ్యాగరి వెంకటస్వామి, రాష్ట్ర మహిళ కన్వీనర్ ఇందిర ప్రియదర్శిని,ఉపాద్యక్షులు నాయకోటి రవికాంత్, సామల అశోక్,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెన్నరాజు, వాసుమళ్ళ సుందర్ రావు, రాష్ట్ర కార్యదర్శి బోగరి విజయ్, రమణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

Loading

📅 October 4, 2024🏷 Telangana
Khammam • Oct 4, 2024

భద్రాచలం రామాలయం అభివృద్ధి ప్రణాళిక : కలెక్టర్ జితేశ్ వి. పాటిల్

భద్రాచలం రామాలయం అభివృద్ధి కోసం ప్రభుత్వం బృహత్తర ప్రణాళికను అమలు చేయనుందని, అవసరమైన స్థలాన్ని సేకరించాలని జిల్లా కలెక్టర్ జితేశ్ వి. పాటిల్ సూచించారు. స్థల సేకరణ ప్రభుత్వం విడుదల చేసిన నిధులు నిర్మాణ పనుల సమీక్ష కార్యాచరణపై దృష్టి

Loading

📅 October 4, 2024🏷 Khammam
Warangal • Oct 3, 2024

తెలంగాణ రైల్వే ఎంప్లాయిస్ JAC ఆధ్వర్యంలో లాల్ బహదూర్ శాస్త్రి జయంతి కార్యక్రమం

తెలంగాణ రైల్వే ఎంప్లాయిస్ JAC ఆధ్వర్యంలో కాజిపేట ELS రైల్వే కాలనీ కూడలిలో భారతదేశ మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి గారి 120 వ,, జయంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది,ముందుగా వారి విగ్రహానికి పూలమాలవేసి వారి పాదాలచెంత విడిపూలను సమర్పించిన వారి జయంతి ని పురస్కరించుకొని వక్తలు శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి గారు భారతదేశ ప్రధమ రైల్వే శాఖమంత్రిగా ఉన్న ఒకానొక సమయంలో రైలు ప్రమాదం జరిగినపుడు వారు రైల్వే మంత్రిత్వశాఖకు బాధ్యత వహిస్తూ మంత్రిపదవికి రాజీనామ చేసారని…! భారతదేశ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో దేశంలో ఆహరకొరత ఏర్పడినపుడు ఇతర దేశాలలో నుండి ఆహారదాన్యాలను దిగుమతి చేసి దేశ ప్రజలకు ఆహారాన్ని అందించడమే కాక దేశానికి వెన్నముఖ రైతేనని దేశ రక్షణకు జవాన్ కాపలా ఉంటే… దేశ ప్రజలకు కడుపునింపేవాడు కిసాన్ అని జై జవాన్…! జై కిసాన్…!! నినాదం ఇచ్చారాని… ఇతరదేశాలు భారతదేశానికి ఒక పొట్టివాడు చేతకాని ప్రధానిని ఎన్నుకున్నారని హేళన చేసినా వారు దానిని చిరున్నావ్వుతో సమాధానం ఇచ్చి పాకిస్తాన్ తో యుద్ధం వస్తే కాశ్మీర్ బాడర్లో మీలాటరీ టెంట్ల కింద ఉంది యుద్ధం పూర్తి అయ్యేవరకు అక్కడే ఉండి మనదేశ మీలాటరీ సైన్యానికి దైర్యం గా నిలబడి యుద్ధంలో గెలిచి పొట్టివాన్ని కాదు గట్టివాన్ని అని సరైన సమాధానం ఇచ్చిన మహానుభావుడు అని భారతదేశానికి ప్రధాన మంత్రి గా చేసినప్పటికి… ఒక స్వంత ఇళ్ళుకూడ లేని నిజాతి పరుడని అలాంటి నిజాయితీ పరులగురించి ఈ తరాలకు తెలియచేయాలనీ వారి మార్గంలో అందరూ నడవాళని అన్నారు, ఈ కార్యక్రమం లో తెలంగాణ రైల్వే ఎంప్లాయిస్ JAC కన్వీనర్ : దేవులపల్లి రాఘవేందర్, చైర్మన్ : కోండ్ర నర్సింఘారావు, రిటైర్డ్ రైల్వే పెన్షనర్స్ అసోసియేషన్ సెక్రెటరీ : గుర్రపు సుధాకర్, M.K. మూర్తి, A. శ్రీనివాస్,వి. నాగేష్, P.రవీందర్, వి. తిరుపతి, D. రవీందర్, P. రమేష్, ఎప్నేజర్, G. రాజలింగం, T. సారయ్య, B. శివ, కరుణాకరా చారీ, నాగపూరి రాజయ్య, D. వెంకట్, అమరనాథ్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.

Loading

📅 October 3, 2024🏷 Warangal
National • Oct 1, 2024

వయసు మళ్లిన వారిలో ఒంటరిగా నివసించే ధోరణి దేశంలో పెరుగుదల

తాజా అధ్యయనం ప్రకారం, వయసు మళ్లిన వారిలో ఒంటరిగా నివసించే ధోరణి దేశంలో పెరుగుతోంది. ఆర్థిక, సామాజిక స్వతంత్రత దీనికి ప్రధాన కారణమని ‘ఏజ్‌వెల్‌ ఫౌండేషన్‌’ సెప్టెంబరులో నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. 10,000 మందిలో 14.3% మంది ఒంటరిగా నివసిస్తుండగా, పట్టణాల్లో 15%, గ్రామీణ ప్రాంతాల్లో 13.4% ఉంది. ఒంటరిగా ఉన్నవారిలో 46.5% మహిళలు, 41.9% ఐదేళ్లకు పైగా వేరుగా ఉంటున్నారు. 46.9% సంతోషంగా ఉన్నారని, 41.5% అసంతృప్తిగా ఉన్నారని పేర్కొన్నారు.

Loading

📅 October 1, 2024🏷 National
National • Oct 1, 2024

అక్టోబర్ ఒకటి నుండి ఈ మార్పులు గమనించారా..

అక్టోబర్ 1వ తేదీ నుండి దేశంలో అనేక కీలక మార్పులు జరుగనున్నాయి. రోజువారీ అంశాలకు తోడు ఆర్థిక సంబంధిత విషయాలు మరియు కొన్ని ప్రభుత్వ పథకాలలో మార్పులు వస్తున్నాయి. బ్యాంకుల క్రెడిట్ కార్డ్ నిబంధనలు, ఎల్పీజీ సిలిండర్ ధరలు, సుకన్య సమృద్ధి యోజన (SSY), పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF), ఆధార్ కార్డ్ వంటి పొదుపు పథకాలతో సంబంధించిన అంశాలలో మార్పులు ఉంటాయి. ఈ నెల ముగింపు నేపథ్యంలో రేపటి నుంచి జరిగే మార్పుల గురించి తెలుసుకుందాం. ఎల్పీజీ గాస్ సిలిండర్ ధర: ప్రతి నెలా ఒకటో తేదీన చమురు మార్కెటింగ్ కంపెనీలు గ్యాస్ సిలిండర్ ధరలను సవరించే ప్రక్రియ జరుగుతుంది. అక్టోబర్ 2024 కొరకు సవరించిన ధరలను అక్టోబర్ 1 ఉదయం 6 గంటలకు ప్రకటించనున్నారు. 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధరలు తరచూ మారుతున్నప్పటికీ, 14 కిలోల డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ ధరలు స్థిరంగా ఉన్నాయి. ఎన్నికలు మరియు ఇతర రాజకీయ కారణాల దృష్ట్యా వంట గ్యాస్ ధరలను పెంచడానికి ఆయిల్ కంపెనీలు హెచ్చుకోలేదు. ఆధార్ కార్డు నిబంధనల మార్పు: ఆధార్ నంబర్ స్థానంలో ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ ఐడిని ఉపయోగించడం అనుమతించే నిబంధనను కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిలిపివేసింది. ఈ నిర్ణయం అక్టోబర్ 1 నుండి అమల్లోకి రానుంది. ఇకపై పర్మినెంట్ అకౌంట్ నెంబర్ (పాన్ కార్డ్) సంబంధిత పత్రాలలో ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ ఐడీని చూపించాల్సిన అవసరం లేదు. పీపీఎఫ్ నియమం మార్పు: అక్టోబర్ 1, 2024 నుండి తప్పు వివరాలతో ఉన్న పీపీఎఫ్ ఖాతాలు మరియు ఇతర చిన్న పొదుపు పథకాల క్రమబద్ధీకరణకు సంబంధించిన కొత్త నియమాలు అమల్లోకి రానున్నాయి. ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటన ప్రకారం, మైనర్‌ల పేరుతో తెరిచిన ఖాతాలను, బహుళ పీపీఎఫ్ ఖాతాలను మరియు ఎన్ఆర్ఐ పీపీఎఫ్ ఖాతాలను క్రమబద్ధీకరించేందుకు అవకాశం లభిస్తుంది. ఇన్‌కమ్ ట్యాక్స్ నిబంధనల మార్పులు: కేంద్ర బడ్జెట్ 2024లో ఇన్‌కమ్ ట్యాక్స్‌కు సంబంధించి ముఖ్యమైన మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ మార్పుల్లో కొన్ని అక్టోబర్ 1 నుండి అమలులోకి రానున్నాయి. టీడీఎస్‌లో గణనీయమైన మార్పు మంగళవారం నుంచి జరుగుతుంది. కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్ నియమాల ప్రకారం, నిర్దిష్ట కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ బాండ్లపై 10% టీడీఎస్ వర్తించనుంది. అదనంగా, జీవిత బీమా పాలసీ, ఇంటి అద్దె చెల్లింపు వంటి వాటికి సంబంధించిన టీడీఎస్ చెల్లింపులు కూడా మార్చబడతాయి. HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ నిబంధనల మార్పు: స్మార్ట్ బై ప్లాట్‌ఫారమ్‌లో ప్రతి త్రైమాసికంలో యాపిల్ ఉత్పత్తుల కోసం రివార్డ్ పాయింట్ల రిడెంప్షన్‌ను హెచ్డీఎఫ్సీ బ్యాంక్ పరిమితం చేసింది.

Loading

📅 October 1, 2024🏷 National
error: Content is protected !!