అనంతపురం-గుంటూరు మధ్య రోడ్డు ప్రయాణం మరింత సులభం కాబోతోంది. కేంద్రం ఎన్‌హెచ్-544డి విస్తరణకు ఆమోదం తెలిపింది. రూ.5,417 కోట్ల వ్యయంతో 219.8 కి.మీ మేరను 21 బైపాస్‌లతో కలిపి నాలుగు లేన్ల రహదారిగా విస్తరించనున్నారు. బుగ్గ నుంచి గిద్దలూరు వరకు 135 కి.మీ, వినుకొండ నుంచి గుంటూరు వరకు 84.8 కి.మీ మేర 4 లేన్ల రహదారులు నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టు ఆర్థిక అభివృద్ధికి దోహదపడడంతోపాటు ప్రయాణదూరాన్ని గణనీయంగా తగ్గించనుంది.
తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ అంశం ప్రస్తుతం పునరాలోచన అవసరాన్ని తెరపైకి తెస్తోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2021లో రిటైర్మెంట్ వయస్సును 58 నుండి 61 ఏళ్లకు పెంచడం ద్వారా తాత్కాలికంగా భారం తప్పించుకుంది. అయితే ఈ నిర్ణయానికి దీర్ఘకాలిక ఆర్థిక ప్రభావం పలు విధాలుగా వెల్లడవుతోంది. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం భారీ రిటైర్మెంట్ బెనిఫిట్లతో పాటు పెన్షన్ చెల్లింపుల భారం ఎదుర్కొంటోంది. గత ఏడాది ఏప్రిల్ నుండి ప్రారంభమైన రిటైర్మెంట్ ప్రక్రియలో 8,000 మంది ఉద్యోగులు పదవీ విరమణ చేయగా, వచ్చే ఐదేళ్లలో 50,000 మందికిపైగా రిటైర్ కానున్నారు. వీరి బెనిఫిట్లకు ప్రభుత్వం సుమారు ₹40,000 కోట్ల అదనపు ఖర్చు వెచ్చించాల్సి ఉంటుంది. ఇప్పటికే జీతాలు, పెన్షన్లపై రాష్ట్ర ఆదాయంలో 35% వినియోగిస్తున్న ప్రభుత్వం, ఈ అదనపు భారం మోయడానికి ఆర్థిక సర్దుబాట్లు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. కానీ, రిటైర్మెంట్ వయసు పెంపు గురించి జరుగుతున్న ప్రచారాలను ప్రభుత్వం ఖండించింది. రిటైర్మెంట్ వయస్సును పెంచడం వల్ల ప్రమోషన్లు నిలిచిపోవడం, జాబ్ క్యాలెండర్‌కు ఆటంకం కలగడం వంటి సమస్యలు ఉత్పన్నం కావచ్చనే భావనతో ఈ ప్రతిపాదనను పక్కన పెట్టినట్టు తెలుస్తోంది. రాష్ట్రం ముందుకుసాగేందుకు తగిన ఆర్థిక ప్రణాళికలు అవసరం. కొత్త ఉద్యోగాల భర్తీ, డీఏ పెంపు, మెడికల్ బిల్లుల చెల్లింపుల వంటి అంశాల్లో సమతుల్యత సాధించడం ప్రస్తుతం కీలకం. ప్రభుత్వానికి నిరంతర ఆదాయ వనరులపైనే , సంక్షేమ పథకాలకు మద్ధతు కొనసాగిస్తూ, ఉద్యోగుల కోసం సమగ్ర వ్యూహాన్ని రూపొందించడం అవసరం.
2009 విద్యా హక్కు చట్టం ప్రకారం, ప్రైవేట్ పాఠశాలల్లో 25% సీట్లు పేదలకు ఉచితంగా కేటాయించాల్సి ఉన్నా, తెలంగాణలో ఈ నిబంధన ఇప్పటి వరకు అమలు కాలేదు. దీనిపై హైకోర్టు మధ్యస్తం చేయగా, ప్రభుత్వం 2025-26 నుంచి అమలుకు సిద్ధమని హామీ ఇచ్చింది. ఈ నిబంధన ప్రీ ప్రైమరీ, ఒకటో తరగతులకి వర్తిస్తుండగా, 1 కిలోమీటర్‌లో ప్రాథమిక పాఠశాల లేదా 3 కిలోమీటర్లలో అప్పర్ ప్రైమరీ పాఠశాల లేనప్పుడు మాత్రమే అమలవుతుంది. తెలంగాణలో 12,126 ప్రైవేట్ పాఠశాలలు ఉండగా, 38 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. ఈ నిబంధన అమలుతో ఫీజులను ప్రభుత్వం రీయింబర్స్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇప్పటికే ఉన్నతవిద్య ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద రూ. 5,700 కోట్లు బకాయి ఉంది. సీట్ల కేటాయింపు అనాథలు, దివ్యాంగులు: 5% ఎస్టీలు: 4% ఎస్సీలు: 10% బీసీ, మైనార్టీలు: 6%మొత్తం: 25% ఇతర రాష్ట్రాల్లో స్థితి:దేశంలోని ఐదారు రాష్ట్రాల్లో తప్ప, మిగతా అన్నింటిలో ఈ నిబంధన అమలు అవుతోంది. పశ్చిమ బెంగాల్, తెలంగాణ, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో ఇది ఇంకా అమలు కాలేదు. కొందరు ఈ నిబంధనను ప్రతీ ప్రైవేట్ స్కూల్‌లో అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
2008 జనవరి 24 వ తేదీ నుండి ప్రతి సంవత్సరం ఒక థీమ్ తో బాలికా దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈ సంవత్సరం “ఉజ్వల భవిష్యత్తు కోసం బాలికలకు సాధికారత” మన దేశంలో బాలికలు ఎదుర్కొంటున్న సమస్యలు, వారి హక్కులు,విద్య, వైద్యం, పోషకాహారం,లింగ వివక్ష మొదలగు వాటిపై అవగాహన కల్పించేందుకు మహిళా శిశు సంక్షేమ శాఖ ఈ జాతియ బాలికా దినోత్సవం జరుపుతున్నది. లింగ వివక్ష తల్లి గర్భం నుండి ప్రారంభం అవుతుంది,ఫలితం భ్రూణ హత్యలు.అమ్మాయి పుట్టిన తర్వాత భారంగా భావించడం, చిన్న చూపు, విద్య విషయంలో అబ్బాయికి ఒకరకమైన విద్య అంటే ప్రైవేటు/ కాన్వెంటుకు పంపించడం, అమ్మాయిలను ప్రభుత్వ పాఠశాలల్లో చదివించడం లేదా బడికి పంపించకపోవడం, అమ్మాయిలు చదవడం వృధా అనే భావన. మనం ఎంత అభివృద్ధి చెందినా అమ్మాయి అనగానే అన్ని రకాలుగా చిన్న చూపు. విద్యకు దూరం చేసి బాల్య వివాహాలు చేయటం. ప్రపంచంలో అధిక బాల్య వివాహాలు జరిగే దేశాల్లో భారతదేశం మూడో స్థానం ఉంది. తెలంగాణాలో సగటున రోజుకు మూడు బాల్య వివాహాలు అవుతున్నాయి. తెలంగాణలో బాలికలపై లైంగిక దాడులు అధికం, నిరుడు పోక్సోకేసులు 2434 నమోదు. పిల్లల అక్రమ రవాణాలో 80% బాలికలే ఉన్నారు. ప్రతి సంవత్సరం జాతీయ బాలికా దినోత్సవం జరుపుకొంటున్నాం. ఎన్నో నిర్ణయాలు తీసుకుంటున్నాం, కానీ అవి ఏవి అమలు కావటం లేదు, ఎలాంటి మార్పు కనిపించటం లేదు. ఆడ పిల్లలను పుట్టనిద్దాం, స్వేచ్ఛగా బతుకనిద్దాం, ఎదగనిద్దాం,చదవనిద్దాం. వారి కలలను సాకారం చేసుకోవడానికి మనం మన వంతు చేయూతనిద్దాం,వాళ్ళు అన్ని రంగాల్లో ముందు ఉంటారు. అనురాధరావు ప్రెసిడెంట్ బాలాల హక్కుల సంఘం
ప్రపంచ చరిత్రలో ఒక దేశ రాజ్యాంగ హక్కులను కాపాడుకునేందుకు, ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించుకునేందుకు అధికారిక వ్యవస్థలే కాకుండా.. “”పౌర మరియు గౌరవ”” సమాజం నుంచి కూడా.. ఒక స్వతంత్ర “”వేదిక/సంస్థ”” ఏర్పాటు చేయడం అన్నది.. మాకుతెలిసి ప్రపంచంలోఎక్కడేగాని లేదని.. ఇది నిజంగా జాతి ముద్దుబిడ్డల, భారతీయుల మహత్తరమైన, మహోన్నతమైన అత్యంత అరుదైన చారిత్రక ఘట్టం మరియు ప్రయత్నమని భావించక మరియు పేర్కొనక తప్పదు.ఈ నేపధ్యంలో.. సదరు స్పూర్తిని, గొప్పతనాన్ని, ఔన్నత్యాన్ని, ప్రాశస్త్యాన్ని, వైభవాన్ని, ప్రాధాన్యతను మరియు ప్రాముఖ్యతను.. నిర్దేశించుకున్న మేరకు లక్ష్యం దిశగా కొనసాగించే మరియు సాధించే ప్రయత్నంలో… రాజ్యాంగ హక్కులను కాపాడుకుందాం, ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించుకుందాం అనే ట్యాగ్ లైన్ తో.. జై భారత రాజ్యాంగం, జైజై భారత రాజ్యాంగం అన్న నినాదంతో.. రాజ్యాంగబద్ధంగా నడుచుకుందాం, ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరిద్ధాం అన్న అర్థవంతమైన ప్రజాస్వామిక పిలుపుతో.. పార్లమెంటరీ ప్రాతినిధ్య ప్రజాస్వామ్య స్పూర్తిని, గౌరవాన్ని నిలపడం, చాటడం, కాపాడడం మరియు పరిరక్షించడమే ప్రధాన ఉద్దేశం, లక్ష్యం మరియు ఆశయంగా పనిచేయసంకల్పించి.. ఆ మేరకు మహనీయుల కలలను సాకారం చేయడం కోసం, వారి వాద, నినాద, ఎజెండా సహా ఆలోచనా విధానం, భావజాలం మరియు సిద్ధాంతంతో.. ప్రజల, ప్రజాస్వామికవాదుల మరియు జాతి ముద్ధుబిడ్డల ఆశలు, ఆకాంక్షలు మరియు మనోభావాలకు అనుగుణంగా.. వారి సహకారం, సమన్వయం మరియు భాగస్వామ్యంతో పనిచేసేందుకు ఉద్ధేశించి స్థాపించబడిన, నెలకొల్పబడిన “రాజ్యాంగ హక్కుల పరిరక్షణ సమితి/Constitutional Rights Protection Committee (CRPC)” అనే గొప్ప విలువలు కలిగిన కుటుంబంలో, మహాకుటుంబంలో.. సాధారణ, క్రియాశీలక మరియు అత్యంత క్రియాశీలక కుటుంబ సభ్యులుగా, బంధువులుగా, స్నేహితులుగా, రక్తసంబంధికులుగా, అప్తులుగా, హితులుగా, సన్నిహితులుగా మరియు శ్రేయోభిలాషులుగా చేరండి.మరింత గుర్తింపు, గౌరవం సహా విలువ, అధిక ప్రాధాన్యత మరియు ప్రాముఖ్యతను పెంపొందించుకొండి. అంతేకాకుండా.. తరతరాల అస్పృశ్యత, అంటరానితనం, వివక్షత, బానిసత్వం మరియు అనేకరకాల రుగ్మతలు, దోపిడి, పీడనల నుంచి విముక్తిని కూడా పొందండి. ఇప్పుడున్న భయానక వాతావరణం మరియు పరిస్థితులలో బలమైన, స్థిరమైన, శాశ్వతమైన మరియు నిత్యనూతనమైన ఉన్నత, అత్యున్నత మరియు మహోన్నత “”విలువలు, ఆదర్శాల””తో కూడిన గొప్ప వేదిక దొరకడం చాలా అత్యంత అరుదు మరియు కష్టం. ఈ వేదిక సమీప భవిష్యత్తులో ప్రజలు, ప్రజాస్వామికవాదులు మరియు జాతి ముద్దుబిడ్డలు ఆశించిన, కాంక్షించిన మరియు వాంచించిన ప్రకారం.. అద్భుతాలు, అత్యద్భుతాలు మరియు మహాద్భుతాలు సృష్టించే వేదికగా.. ముందే గుర్తించి, గ్రహించి ఆదరించండి, అక్కునచేర్చుకోండి, బలపర్చండి మరియు అన్నివిధాల బలపడండని ఈ సందర్భంగా యావన్మంది నూటికి 90 శాతంగా, 95 శాతంగా మరియు 98 శాతంగా వుంటున్న నిజమైన మరియు స్వచ్చమైన భారతీయులు సహా “మహాజన సమూహం, శూద్ర సమాజం”తో పాటు అన్ని కులాల, మతాల, ప్రాంతాల.. వర్ణాల, వర్గాల అభ్యుదయ, ప్రగతిశీల, ప్రజాస్వామికవాద భావజాల వ్యక్తులు, శక్తులు మరియు జాతి ముద్దుబిడ్డలకు పిలుపునిస్తున్నా, విన్నవిస్తున్న మరియు విజ్ఞప్తికూడా చేస్తున్నాం. త్వరలోనే మొదటి దశలో (Faced Maner) రెండు తెలుగు రాష్ట్రాల్లో నిర్ధిష్టకాలపరిమితి సూచించే, నిర్దేశించే “తాత్కాలిక మరియు శాశ్వత” ప్రాతిపదికన అన్ని రకాల సంపూర్ణ మరియు పరిపూర్ణ కమిటీలు మొదట ఆంధ్రప్రదేశ్ లో మొదలు పెట్టి, మన తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో కొనసాగించి.. సౌత్ ఇండియా సహా భారతదేశం మొత్తం ఇందులో కనపరిచిన, పేర్కొన్న వివిధ హోదాలతో బాధ్యతలు కట్టబెట్టడం జరుగుతుంది. తాత్కాలిక మరియు శాశ్వత కమిటీల కూర్పు:•••••••••••••••••••••••••••••••••••••అన్నిస్థాయిల్లో తాత్కాలిక మరియు శాశ్వత ప్రతిపాదికన నిర్ధిష్ట కాలపరిమితిని సూచించే మరియు నిర్దేశించే కమిటీలను ఈ కింది విధంగా ఎన్నిక మరియు ఎంపిక చేయడం జరుగుతుంది. దయచేసి గుర్తించగలరు మరియు గమనించగలరు. అదేవిధంగా…. (a) జిల్లా సమన్వయకర్తలు (b) ప్రాంతీయ, ఉపప్రాంతీయ సమన్వయకర్తలు మరియు (c) రాష్ట్ర సమన్వయకర్తలు.. అలాగే…. (A) జిల్లా కన్వీనర్లు, ఉప కన్వీనర్లు మరియు మెంబర్ కన్వీనర్లు.. (B) ఉపప్రాంతీయ కన్వీనర్లు (C) రాష్ట్ర కన్వీనర్లు ఇలా అన్ని వైపుల, విభాగాలలో పూర్తిస్థాయిలో కమిటీలు సంస్థాగత ఏర్పాటుకు కృషిచేసి, ప్రయత్నించి.. తదనంతరం వాటిలో ఏవైనా ఒకటిఅర చిన్నపాటి మార్పులు, చేర్పులు ఉంటే సరిచేసి.. వాటినే పూర్తిస్థాయి శాశ్వత ప్రాతిపదికన పనిచేసే “”కమిటీలు””గా జిల్లా మరియు రాష్ట్ర, రాష్ట్రాల “”సభలలో, మహాసభల””లో గుర్తించి ప్రకటించడం జరుగుతుందని తెలియజేస్తున్నాం.కావున.. సంఘం, సమాజం మరియు దేశం పట్ల శ్రద్ధాసక్తి, గురుతర బాధ్యత మరియు కర్తవ్యం కలిగి.. ఉన్నతంగా, అత్యున్నతంగా మరియు మహోన్నతంగా.. ఆలోచించి పనిచేయాలన్న నిరంతర తపన, తృష్ణ వున్న నిజమైన, స్వచ్చమైన మరియు నిస్వార్థ ఔత్సాహికులు.. ముఖ్యంగా…. (A) బుద్ధిజీవులు, మేధావులు, విద్యావంతులు, కవులు, కళాకారులు, స్పృహ, అవగాహన మరియు చైతన్యంగల అన్ని రంగాల, వర్గాల ప్రజలు మరియు ప్రముఖులు. (B) న్యాయవాదులు/న్యాయవిద్య అభ్యసించిన. (C) రాజకియశాస్త్రం/రాజకీయవిద్య అభ్యసించిన. (D) సామాజిక హక్కుల, మానవ హక్కుల, పౌర హక్కుల మరియు రాజ్యాంగ హక్కుల ఉద్యమ కార్యకర్తలు సుదీర్ఘ అనుభవంగలవారు. (F) ఇతర అన్ని రంగాల, వర్గాల ప్రముఖులు మరియు ఆశావాహులు సహా..తదితర వారికందరికీ “మొదటి/ప్రధమ” ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. ఈ గొప్ప సదవకాశాన్ని, భాగ్యాన్ని, ధన్యతను మరియు ఆధిక్యతను ఉపయోగించుకొని, “సరికొత్త నూతన సమాజం మరియు భారతదేశం” నిర్మించేందుకు మరియు ఏర్పడేందుకు నిజాయితీగా, నిస్వార్థంగా ప్రయత్నిస్తున్న “మాతో” జతకట్టమని, కలవమని, నడవమని, సాధించమని మరియు అనుభవించమని ఈ సందర్భంగా హృదయపూర్వక జైభీములు మరియు బుద్ధవందనాలతో మనవిచేస్తున్నాం. మనసు, హృదయం మరియు మెదడుపెట్టి ఆలోచించండి:~~~రండి.. ఇప్పుడున్న పరిస్థితుల్లో, వాతావరణంలో ఒక మహత్తరమైన, మహోన్నతమైన సమగ్ర రూపాన్ని సంతరింపచేసే “”సంస్థ”” దొరకడం చాలా అరుదు. ఇప్పుడున్న పరిస్థితులకు కరెక్టుగా సరిపోయే అధ్భుతమైన, అర్థవంతమైన.. సరిగ్గా, ఈ కాలానికి సరిపడే వేదికను రాజ్యాంగ హక్కుల పరిరక్షణ సమితి/Constitutional Rights Protection Committee (CRPC) రూపంలో స్థాపించడం, నిర్మించడం మరియు ఏర్పాటుచేయడం జరిగింది. చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే గొప్ప వేదికను, అకుంఠిత దీక్షాదక్షత, మొండిపట్టుదల, అనుకున్నది సాధించేవరకు వెనుకాడే నైజం, వ్యక్తిత్వం, మనస్తత్వంకాని నాయకత్వాన్ని.. మన జాతి ప్రయోజనాలతో పాటు దేశ విశాలప్రయోజనాల కోసం నిర్మించడం జరిగింది. ఈ వేదికను ఇప్పుడే, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా.. విలువైన సమయాన్ని, ధనాన్ని, ప్రతిభను మరియు జ్ఞానాన్ని వృధా చేయకుండా.. మనతో పాటు మన బిడ్డల బంగారు భవిష్యత్తు కోసం వేంటనే సొంతం చేసుకుందాం మరియు ఉపయోగపెట్టుకుందాం. సంప్రదించాల్సిన సంబంధిత వ్యక్తుల పేర్లను, వారి మొబైల్ నెంబర్లతో సహా కింద పేర్కొనడం జరిగిందని తెలియజేయుటకు ఎంతగానో సంతోషిస్తున్నాం మరియు ఆనందిస్తున్నాం నూతన ప్రజాస్వామిక విప్లవ జైభీములు మరియు బుద్ధవందనాలతో…. (సంగటి మనోహర్ మహాజన్)వ్యవస్థాపక జాతీయ కన్వీనర్,రాజ్యాంగ హక్కుల పరిరక్షణ సమితి/Constitutional Rights Protection Committee (CRPC);(రాజ్యాంగ హక్కులను కాపాడుకుందాం, ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించుకుందాం):కడప, అంధ్రప్రదేశ్, ఇండియా – 9849509416. (షేక్ అమీన్ పీరాన్/AMEEN PEERAN SHAIK)కేంద్రకమిటీ సభ్యులు, జాతీయ సమన్వయకర్తమరియు హైకోర్టు న్యాయవాది,రాజ్యాంగ హక్కుల పరిరక్షణ సమితి/Constitutional Rights Protection Committee (CRPC); 9346407720. (శ్రీమతి షేక్ హుమేర/HUMERA SHAIK)కేంద్రకమిటీ సభ్యురాలు మరియు రాష్ట్ర సమన్వయకర్త,రాజ్యాంగ హక్కుల పరిరక్షణ సమితి/Constitutional Rights Protection Committee (CRPC); (శ్రీమతి సావంత్ చంద్రకళ బాయి/ CHANDRAKALA BAI SAVANTH)కేంద్రకమిటీ సభ్యురాలు,రాజ్యాంగ హక్కుల పరిరక్షణ సమితి/Constitutional Rights Protection Committee (CRPC);
ట్రాయ్ కొత్త రూల్: కేవలం రూ.20 రీఛార్జితో సిమ్ కార్డును యాక్టివ్‌గా ఉంచుకోండి ఇప్పటికే డ్యూయల్ సిమ్ వినియోగదారులకు ఓ పెద్ద గుడ్‌న్యూస్. ట్రాయ్ తీసుకొచ్చిన కొత్త నిబంధన ప్రకారం, మీ సిమ్‌కార్డును యాక్టివ్‌గా ఉంచుకోవడానికి కేవలం రూ.20 రీఛార్జి చెల్లిస్తే సరిపోతుంది. 90 రోజుల అవాంఛనీయ డిస్కనెక్షన్‌ను నివారించుకోండిసాధారణంగా, సిమ్‌కార్డు కాల్స్, ఎస్సెమ్మెస్‌లు, డేటా వినియోగం లేకుండా 90 రోజుల పాటు వాడకంలో లేకపోతే, ఆ సిమ్ డిస్‌కనెక్ట్ అయిపోతుంది. ఆ సమయంలో ఆ సిమ్‌ను డీరిజిస్టర్ చేసి వేరొకరికి కేటాయిస్తారు. అయితే, ఈ సిమ్ కార్డు మీ పేరుమీద కొనసాగాలంటే, రూ.20 రీఛార్జి చెల్లించడం ద్వారా అది యాక్టివ్‌గా ఉంచుకోవచ్చు. రీఛార్జి ప్లాన్ మరియు గ్రేస్ పీరియడ్మీరు 90 రోజుల పాటు సిమ్ వాడకంలో లేకపోతే, మీ ప్రీపెయిడ్ బ్యాలెన్స్ నుంచి రూ.20 తీసుకోవడంవల్ల 30 రోజుల గడువు పొందవచ్చు. ప్రతి నెలా రూ.20 రీఛార్జి చేసుకుంటే మీ సిమ్ కార్డు ఎప్పటికీ యాక్టివ్‌గా ఉంటుంది. అయితే, ఒక నెలలో రూ.20 రీఛార్జి చేయకపోతే, 15 రోజుల గ్రేస్ పీరియడ్ ఇవ్వబడుతుంది. ఆ సమయం లోపు మీరు మీ ఖాతాలో బ్యాలెన్స్ మెయింటెయిన్ చేసుకుంటే సరిపోతుంది. లేకపోతే, సిమ్ కార్డు కోల్పోవాల్సి వస్తుంది. వినియోగదారులకు గమనికఈ సదుపాయం కేవలం సిమ్ కార్డును మీ పేరుమీద యాక్టివ్‌గా ఉంచేందుకు సంబంధించింది. అదే సమయంలో, మీ సిమ్ ద్వారా కాల్స్, ఎస్సెమ్మెస్‌లు లేదా డేటా వినియోగం చేసుకోవాలంటే, మీరు టెలికాం కంపెనీల నిర్ణయించిన ప్లాన్ల ప్రకారం రీఛార్జి చేయాల్సి ఉంటుంది. ఈ సదుపాయం అందుబాటులో ఉన్న టెలికాం కంపెనీలుజియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా, బీఎస్‌ఎన్‌ఎల్ వినియోగదారులు ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవచ్చు. ఈ కొత్త నిబంధనతో, వినియోగదారులు వారి రెండో సిమ్ కార్డుల కోసం ఎక్కువ మొత్తంలో రీఛార్జి చేయాల్సిన అవసరం లేకుండా యాక్టివ్‌గా ఉంచుకునేందుకు ఇది చాలా సహాయకరంగా మారింది.
రాజ్యాంగ స్పూర్తికి, ప్రాతినిధ్య అసలు ఉద్దేశానికి మరియు ఉమ్మడి కేంద్ర జాబితా యొక్క ఆలోచనలకు వర్గీకరణ అన్నది వ్యతిరేకం. కావున, వర్గీకరణను మాలలు వ్యతికిస్తున్నారు. వర్గీకరణ అన్నది అశాస్త్రీయం, అహేతుకం మరియు అసంబద్ధం. బలమైన “ఉద్దేశాలు మరియు లక్ష్యాలు” సాధించేందుకు వర్గీకరణ అన్నది అడ్డుగోడలాంటిది, గొడ్డలిపెట్టులాంటిది. ముందు రాజ్యాంగ అసలు ఉద్దేశాలు, లక్ష్యాలు, ధ్యేయాలు మరియు ఆశయాలు నెరవేర్చుకున్న తరువాత.. అప్పటికీ అంతరాలు, అసమానతలు, వెనుకుబాటుతనం, తగినంత ప్రాతినిధ్యంలేకుంటే.. అప్పుడు “”కొసరు”” ఉద్దేశాల, లక్ష్యాల గురించి ఆలోచించాలి. అంతేతప్పా, “”అసలు”” ఉద్దేశాలను మరుగుపరిచి, పక్కనబెట్టి.. కొసరు ఉద్దేశాల జోలికివెళ్ళడం అంటే.. అజ్ఞానం, అవివేకం మరియు మూర్ఖత్వమే అవుతుంది. SC సమూహాలకు అన్యాయం ఏరూపంలో జరిగింది, ఎందుకు జరిగింది, ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది మరియు ఎలా జరిగింది? అన్న విషయాలను లోతుగా చర్చించి, తెలుసుకొని.. వెనుకబాటుతనానికి కారణాలు, కారకులు ఎవరు? తగినంత ప్రాతినిధ్య ఫలాలు ఎందుకు అందుకోలేక, పొందలేకపోతున్నారు? నిజానికి వర్గీకరణ శాశ్వత పరిష్కారం చూపుతుందా? లేక? ఒక చిన్న సమస్యను పరిష్కరించబోయి.. ఒక పెద్ద సమస్యను సృష్టించుకోవడం అవుతుందా? ఇదే వర్గీకరణ పరిష్కారం అనుకుంటే.. దేశంలో మెజారిటీ రాష్ట్రాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? ఇత్యాది మౌలికమైన ప్రశ్నలు మనముందరవున్నాయని తెలియజేయకతప్పదు. సుప్రీంకోర్టు భారత ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని 7 గురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం మెజారిటీ తీర్పుప్రకారం.. మాలలకే కాకుండా, మాదిగలకు, దేశంలోని 1263 కులాలకు కూడా నష్టదాయకమే. మాదిగలు వాంచించిన, కాంక్షించిన మరియు కోరుకున్న ప్రకారం ఈ తీర్పుతో వర్గీకరణ కల నెరవేరదు మరియు జరగదు. మాదిగలు కోరుకుంటున్నది.. మాలలతో 26 కులాలతో కూడిన సమూహంతో సంబంధం లేకుండా.. మమ్ములను మాత్రమే 18 కులాలతో కూడిన సమూహంతో ప్రత్యేక గ్రూపుగా, తరగతిగా చేయమని, ఉంచమని మరియు పెట్టమని కోరుతున్నారు. ఈ తీర్పు ప్రకారం అలా కుదరదన్న సంగతి తెలుసుకుంటే మంచిది.ఎవరైతే నిజంగా “”వెనుకబాటుకు గురైనారో, అన్యాయం జరిగిందో మరియు తగినంత ప్రాతినిధ్యం””లేదో.. వారిని నిర్ధిష్ట వాస్తవిక గణాంకాలు, లెక్కలు కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని జనగణనశాఖ నివేదికల ఆధారంగా.. రాష్ట్రాలు ముందుకుపోవచ్చు అని, తన అభిప్రాయాన్ని తప్పనిసరికాని అదేశాల రూపంలో ఇచ్చింది. ఇందులో మరో ప్రమాదకర అభిప్రాయాన్ని కూడా క్రిమిలేయర్ రూపంలో 4 గురు మెజారిటీ సభ్యుల అభిప్రాయాన్ని వెల్లడించడం జరిగింది. ఇప్పుడు చెప్పండి.. ఈ తీర్పు మాదిగలకు న్యాయం చేకూరుస్తుందని ఇప్పటికీ చెప్పగలరా, నమ్మగలరా? నిజంగా మాదిగ సోదరులకు గానీ, ఉత్తరాదిలో ఇక్కడి మాల సమాంతర కులాలకు గానీ అన్యాయం జరిగిందని వాస్తవిక లెక్కలు సంబంధిత శాఖలు బయటపెట్టి.. స్వతంత్ర రాజ్యాంగ సంస్థ (Independent Body) జాతీయ SC కమీషన్ చే ధృవీకరించబడిన తరువాత.. ఉషా మెహ్రా కమిషన్ “”కంక్లూజన్/ముగింపు”” అభిప్రాయంలో పేర్కొన్న ప్రకారం.. ఆర్టికల్ – 341కు క్లాజ్ 3ని చేర్చుకుని పార్లమెంటులో ఆర్టికల్ – 368 ప్రకారం రాజ్యాంగ సవరణ ద్వారా ముందుకెళ్ళచ్చు. అప్పుడు దానిని అమలు చేయమని అడగడం సరైనది. అంతేతప్పా.. అంతకుమించి వేరేమార్గమేలేదని నా జాతి ముద్దుబిడ్డలకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అర్థం పర్థంలేని, అశాస్త్రీయ, అహేతుక మరియు అసంబద్ధ.. రాజ్యాంగ స్పూర్తికి, ప్రాతినిధ్య అసలు ఉద్దేశానికి మరియు ఉమ్మడి కేంద్ర జాబితా యొక్క మహత్తరమైన, మహోన్నతమైన ఆలోచనలు సహా గుర్తింపు, గౌరవం.. విలువ, ప్రాధాన్యత మరియు ప్రాముఖ్యతకు వ్యతిరేకమైనది. అంతేకాకుండా.. బలమైన “రాజ్యాంగ మరియు రాజ్యాధికార” లక్ష్యాలకు, కాంక్ష మరియు వాంఛకు వ్యతిరేకమైన, అడ్డుగోడలాంటి, గొడ్డలిపెట్టులాంటి వర్గీకరణను.. నిర్ద్వందంగా, మూకుమ్మడిగా వ్యతిరేకిద్దాం, అడ్డుకుందాం.. మేధావుల ముసుగులో ఇరు సమూహాలను రెచ్చగొట్టి, తమ పబ్బం గడుపుకొనచూస్తున్న స్వయం ప్రకటిత, కుహానా, కురస మరియు సంకుచిత మేధావులకు సైతం తగిన”బుధ్ధి మరియు గుణపాఠం” చెపుదాం.. ఒకే సజాతి సమూహాలుగా వెలుగొందుదాం. అంతేకాకుండా, భారత జాతి ముద్దుబిడ్డలంగా, నిజమైన మరియు స్వచ్చమైన భారతీయులంగా మరియు ఒకే ప్రజలంగా అందరితో కలిసి ఒక ముద్దగా, పిడికిలిగా మరియు సంఘటిత శక్తిగా శాశ్వతంగా, నిత్యనూతనంగా నిలుద్దాం మరియు వర్ధిల్లుదాం. సంగటి మనోహర్ మహాజన్వ్యవస్థాపక అధ్యక్షులు,మహాజన రాజ్యం పార్టీ & రాజ్యాంగ హక్కుల పరిరక్షణ సమితి 9849509416
సింగపూర్‌లో పర్యటిస్తున్న సీఎం ఎ.రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందం ఆ దేశ పర్యావరణ శాఖ మంత్రి గ్రేస్ ఫూ హైయిన్‌తో భేటీ అయ్యారు. తెలంగాణలో పెట్టుబడుల అవకాశాలు, భాగస్వామ్యాలపై విస్తృత చర్చలు జరిగాయి. పట్టణాభివృద్ధి, మౌలిక సదుపాయాలు, నీటి వనరుల నిర్వహణ, నైపుణ్యాల అభివృద్ధి, సెమీ కండక్టర్లు, పర్యావరణం, సాంకేతికత వంటి రంగాల్లో తెలంగాణ లక్ష్యాలు సింగపూర్ మంత్రిని ఆకర్షించాయి. నెట్ జీరో ఫ్యూచర్ సిటీ, మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు, నీటి నిర్వహణలో ఉమ్మడి ప్రణాళికలను సింగపూర్ ప్రభుత్వం పరిశీలిస్తుందని హామీ ఇచ్చింది. చర్చల్లో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, భారత డిప్యూటీ హై కమిషనర్ పూజ ఎం.టిల్లు పాల్గొన్నారు. ఇరుపక్షాలు వేగంగా ప్రాజెక్టులను అమలు చేయాలని నిర్ణయించాయి.
నిర్మల్ డిపోకు చెందిన పల్లె వెలుగు బస్సు (టీఎస్ 18 టీ 8485) నిర్మల్ నుండి బైంసాకు రాత్రి 7 గంటలకు బయలుదేరింది. బైంసా మండలం దేగామ్ గ్రామానికి చెందిన ఎల్క బాయి లగేజీతో బస్సులో ఎక్కింది. ఆమె పెద్ద మూటను దారిలో అడ్డంగా ఉంచింది. బస్సు కండక్టర్ డీఆర్ స్వామి లగేజీని దారిలో నుంచి తొలగించాలని, లేదంటే బస్సు దిగిపోవాలని సూచించారు. అయితే, మహిళ “నా మూట నా ఇష్టం, ఇక్కడ్నే పెడతా. కావాలంటే రేవంత్ రెడ్డికి చెప్పుకో” అంటూ ప్రతిస్పందించారు. ఈ సమయంలో కండక్టర్ ఆగ్రహంతో “బస్సు నాదైతే నిన్ను ఇందులో ఎక్కించుకునే వాడిని కాద” అంటూ తీర్పు ఇచ్చాడు. ఇతర ప్రయాణికులు ఈ ఘర్షణను శాంతింపజేయడానికి ప్రయత్నించారు. ఈ ఘటన ప్రయాణికులందరినీ అసౌకర్యానికి గురిచేసింది.
టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ జనవరి చివరిలోపు నామినేటేడ్, కార్పొరేషన్ల చైర్మన్ పోస్టుల భర్తీ చేయనున్నట్లు తెలిపారు. 2025 జనవరి 15న ఢిల్లీలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ నివాసంలో జరిగిన సమావేశంలో టీపీసీసీ భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. 🔹 ఫిబ్రవరి 1వ వారంలో రాహుల్ గాంధీ సభ: సూర్యపేట లేదా ఖమ్మంలో రాహుల్ గాంధీ సభ ఉంటుందని ప్రకటించారు.🔹 కేబినెట్ విస్తరణ త్వరలోనే: సీఎం రేవంత్ రెడ్డి త్వరలో కేబినెట్ విస్తరణపై నిర్ణయం తీసుకుంటారని తెలిపారు.🔹 జీహెచ్ఎంసీ, స్థానిక సంస్థల ఎన్నికలు: పార్టీ గెలుపే లక్ష్యంగా సమర్థవంతమైన వ్యూహాలపై దిశానిర్ధేశం చేశారు.🔹 పీసీసీ కార్యవర్గ కూర్పు: ప్రజాదరణ కలిగిన నేతలకే డీసీసీ పదవులు ఇస్తామని స్పష్టం చేశారు. మహేష్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణలో కాంగ్రెస్ నాయకత్వం ఏడాది పాలన, రాబోయే ఎన్నికల వ్యూహాలపై దృష్టి పెట్టిందన్నారు.