ప్రముఖ సామాజిక మాధ్యమం ఇన్‌స్టాగ్రామ్ (Instagram) టీన్ అకౌంట్స్ సదుపాయాన్ని భారత్‌లో కూడా అందుబాటులోకి తెచ్చింది. పిల్లలపై సోషల్‌మీడియా ప్రభావంపై పెరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో, మెటా ఈ కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. 🔹 టీన్ అకౌంట్స్ ప్రత్యేకతలు:✅ డిఫాల్ట్‌గా ప్రైవేట్ అకౌంట్లు – కొత్త టీన్ ఖాతాలు ఆటోమేటిక్‌గా ప్రైవేట్‌గా ఉంటాయి.✅ సురక్షిత సందేశాలు – టీన్ యూజర్లు ఫాలో/ కనెక్ట్ అయిన వారినుండే సందేశాలు అందుకోగలరు.✅ ట్యాగింగ్ నియంత్రణ – అనుమతించిన వ్యక్తులు మాత్రమే టీన్ అకౌంట్లను ట్యాగ్ చేయగలరు.✅ సెన్సిటివ్ కంటెంట్ ఫిల్టర్ – 16 ఏళ్ల లోపు పిల్లలకు అశ్లీల/ అభ్యంతరకర కంటెంట్ కనపడకుండా నియంత్రణ ఉంటుంది.✅ తల్లిదండ్రుల నియంత్రణ – 16 ఏళ్ల లోపు పిల్లలు డిఫాల్ట్ సెట్టింగులను మార్చాలంటే తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి. 🔹 వాడకంపై నియంత్రణ:🔸 రోజుకు 60 నిమిషాల వాడకం దాటితే నోటిఫికేషన్🔸 రాత్రి 10PM – ఉదయం 7AM వరకు “స్లీప్ మోడ్” – ఆ సమయంలో నోటిఫికేషన్లు రావు.🔸 అసభ్య పదజాలాన్ని ఆటోమేటిక్ ఫిల్టర్ – కామెంట్లు, మెసేజ్‌లు స్కాన్ చేసి ఫిల్టర్ చేస్తుంది.🔸 పేరెంట్స్‌కు అదనపు నియంత్రణ – పిల్లల యూజేజ్ తనిఖీ, సందేశాలను యాక్సెస్, అవసరమైతే ఇన్‌స్టా బ్లాక్ చేయడం కూడా వీలుగా ఉంది. ఈ కొత్త ఫీచర్ ద్వారా, భారతదేశంలో యువత సోషల్ మీడియాను మరింత బాధ్యతాయుతంగా వినియోగించుకునే అవకాశం లభించనుంది! 🚀
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా ఐదో రోజు భారీ నష్టాలు చవిచూశాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్టీల్, అల్యూమినియం దిగుమతులపై 25% టారిఫ్ విధిస్తానని ప్రకటించడంతో, అంతర్జాతీయ మార్కెట్లలో వాణిజ్య యుద్ధ భయాలు పెరిగాయి. ఈ ప్రభావంతో మన మార్కెట్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ భారీ పతనం మదుపర్లకు భారీ నష్టం నష్టాలకు ప్రధాన కారణాలు అంతర్జాతీయ పరిస్థితేంటీ? మొత్తంగా, అంతర్జాతీయ వాణిజ్య ఒత్తిడులు, విదేశీ అమ్మకాలు, రూపాయి బలహీనత స్టాక్ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపాయి.
టేకులపల్లి మండలంలో జరిగిన మీడియా సమావేశంలో సేవాలాల్ సేన రాష్ట్ర ఉపాధ్యక్షులు రవి రాథోడ్ మాట్లాడుతూ, రాష్ట్రంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికల్లో గిరిజనులకు 10% రిజర్వేషన్ కల్పించాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేశారు. రాజ్యాంగబద్ధంగా గిరిజనులకు రిజర్వేషన్ అమలు చేయాల్సినప్పటికీ, స్వతంత్రం వచ్చి 80 సంవత్సరాలు గడిచినా ఇప్పటికీ అన్యాయం జరుగుతోందని ఆయన ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తితెలంగాణలో కొత్త జిల్లాలు ఏర్పడి 11 సంవత్సరాలు అయినప్పటికీ, గిరిజనులకు రిజర్వేషన్ కచ్చితంగా అమలు చేయలేదని రవి రాథోడ్ విమర్శించారు. రాష్ట్రంలో గిరిజనులు అధికంగా ఉన్న జిల్లాల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో 10% రిజర్వేషన్ అమలు చేయాలని, గిరిజన లంబాడి సామాజిక వర్గానికి న్యాయం చేయాలని కోరారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రత్యేక రిజర్వేషన్రాష్ట్రంలోని అన్ని ఏజెన్సీ మండలాల్లో జడ్పీటీసీ స్థానాలను ST రిజర్వ్ చేయాలని, రూల్ ఆఫ్ రిజర్వేషన్‌ను కచ్చితంగా అన్ని శాఖల్లో అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. గిరిజనుల హక్కులను కాపాడే దిశగా రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని రవి రాథోడ్ డిమాండ్ చేశారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో శనివారం జరిగిన దారుణ ఘటనలో, కరకగూడెం గ్రామానికి చెందిన యువతి కిడ్నాప్‌కు గురై, లైంగిక దాడి యత్నం నుండి తప్పించుకుంది. ఈ ఘటనలో నిందితుడు ఆటో డ్రైవర్ గుగులోత్ కుమార్‌ను పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు: యువతి, తన బంధువు జానకి ఇంటికి వెళ్లేందుకు మధ్యాహ్నం 12 గంటలకు కొత్తగూడెం బస్టాండ్‌కు చేరుకుంది. ఆమె మాటలు స్పష్టంగా రాకపోవడంతో, అడ్రస్‌ను తెలుసుకోవడానికి మరో ఆటో డ్రైవర్ ఆమె వద్ద ఉన్న సెల్ నంబర్‌కు ఫోన్ చేసి, గుగులోత్ కుమార్‌కు వివరించాడు. కుమార్, యువతి మరియు మరో వ్యక్తిని ఆటోలో ఎక్కించుకొని, ఆమె చెప్పిన అడ్రస్‌కు కాకుండా, హేమచంద్రాపురం రోడ్డులోని రైల్వే గేట్ పక్కన ఉన్న అటవీ ప్రాంతానికి తీసుకెళ్లాడు. అనుమానం వచ్చిన అంజలి, “ఎక్కడికి తీసుకెళ్తున్నారు?” అని ప్రశ్నించగా, కుమార్ మరియు అతని సహచరుడు ఆమెపై లైంగిక దాడి యత్నం చేశారు. యువతి వెంటనే ఆటో నుండి దిగిపోయి, రైల్వే గేట్ వైపు పరుగెత్తి, అక్కడ డ్యూటీలో ఉన్న ఉద్యోగికి విషయం చెప్పింది. పరిస్థితిని గమనించిన నిందితులు అక్కడి నుండి పారిపోయారు. రైల్వే ఉద్యోగి, యువతి వద్ద ఉన్న నంబర్‌కు ఫోన్ చేసి, విషయం తెలియజేశాడు. గంట సేపు అయినా యువతి రాకపోవడంతో, ఆందోళన చెందిన జానకి బస్టాండ్‌కు వచ్చి వెదుకులాట ప్రారంభించింది. ఈ సమయంలో రైల్వే ఉద్యోగి నుండి ఫోన్ రావడంతో, జానకి వచ్చి యువతిని తీసుకెళ్లింది. తర్వాత, కొత్తగూడెం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. జానకి, తన భర్త ఆదర్శ్‌తో పాటు బంధువుల సాయంతో బస్టాండ్ ప్రాంతంలోని సీసీ కెమెరాలను పరిశీలించి, నిందితుడి ఆటో ఆనవాళ్లు గుర్తించారు. అడ్రస్ కోసం మొదట ఫోన్ చేసిన ఆటో డ్రైవర్‌కు ఫోన్ చేసి, నిందితుడి ఆటో వివరాలు తెలుసుకొని, పట్టణంలో వెతుకులాట ప్రారంభించారు. ఈ క్రమంలో, సూపర్‌బజార్ నుండి మెయిన్ హాస్పిటల్ వెళ్లే దారిలో ఎన్టీఆర్ విగ్రహం ప్రాంతంలో ఆటోను గుర్తించిన జానకి, అతడిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. కుమార్ పారిపోయే క్రమంలో, ఎదురుగా వస్తున్న రెండు కార్లు, మరో ఆటోను ఢీకొని ఆగిపోయాడు. తర్వాత, స్థానికులతో పాటు జానకి కలిసి కుమార్‌ను పట్టుకొని, పోలీసులకు అప్పగించారు. పోలీసులు, నిందితుడిని అరెస్టు చేసి, కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
రేటింగ్: ⭐⭐☆☆☆ (1.75/5)తమిళ దర్శకుడు విష్ణువర్ధన్, స్టైలిష్ మేకింగ్‌కి పేరొందినప్పటికీ, ‘ప్రేమిస్తావా’తో మరోసారి అదే సమస్యను ఎదుర్కొన్నాడు—కథనం ఆకట్టుకోలేకపోవడం.కథ:అర్జున్ (ఆకాశ్ మురళి) కాలేజ్ అమ్మాయి దియా (అదితి శంకర్)ని ప్రేమిస్తాడు. మొదట ఆమె నిరాకరించినా, తర్వాత తన పాస్ట్ గురించి చెప్పి ప్రేమలో పడుతుంది. ఇద్దరూ లివింగ్ రిలేషన్‌షిప్‌లో ఉంటారు, కానీ మనస్పర్థలతో దియా అర్జున్‌ని వదిలేస్తుంది. అనుకోకుండా ఓ మర్డర్ కేసులో దియా ఇరుక్కుంటుంది. అర్జున్ ఆమెను కాపాడగలిగాడా? అసలు హత్య వెనుకున్న నిజమెవరో తెలియాలంటే సినిమా చూడాలి.విశ్లేషణ:సాధారణ ప్రేమకథకి క్రైమ్ టచ్ ఇవ్వడం కొత్త కాదు. కానీ, ‘ప్రేమిస్తావా’లో కథాంశం ఎక్కడో విన్నట్టు అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్‌లో కొన్ని మంచి సీన్లు ఉన్నా, కథనం కనెక్ట్ అవ్వడం కష్టమే. సెకండ్ హాఫ్, ప్రీ-క్లైమాక్స్‌లో ఆసక్తి పెరుగుతుందనుకున్నా, చివరికి డైల్యూషన్ అయ్యేలా సాగుతుంది.నటీనటుల ప్రదర్శన: అదితి శంకర్‌కి స్కోప్ ఉన్న పాత్ర దొరికింది, ఆమె లుక్స్, ఎక్స్‌ప్రెషన్స్ బాగున్నాయి.ఆకాష్ మురళి నటన పరంగా బాగున్నా, పాత్రలో బలహీనత ఉంది.శరత్‌కుమార్, ఖుష్బూ, కల్కి పాత్రలు ఓకే అనిపించేలా ఉన్నాయి. టెక్నికల్ అస్పెక్ట్స్:✔ ప్లస్ పాయింట్స్: స్టోరీ లైన్యువన్ శంకర్ రాజా మ్యూజిక్ఎరిక్ బ్రైసన్ సినిమాటోగ్రఫీ ❌ మైనస్ పాయింట్స్: డైరెక్షన్‌లో లోపంఅనవసరమైన ల్యాగ్ ఫైనల్ వెర్డిక్ట్:‘ప్రేమిస్తావా’ యూత్‌ని టార్గెట్ చేసినప్పటికీ, కథనంలో స్పష్టత లేకపోవడంతో విసుగొచ్చేలా చేస్తుంది. నిలబడటం కష్టమే!
సింగరేణి ఆర్థిక పరిస్థితిపై తక్షణమే శ్వేతపత్రం విడుదల చేయాలని కొత్తగూడెం ఎమ్మెల్యే, సీపీఐ స్టేట్ సెక్రటరీ కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. చుంచుపల్లి మండలంలోని సీపీఐ ఆఫీస్‌లో గురువారం జరిగిన సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ సెంట్రల్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో సింగరేణికి భారీగా పెండింగ్ బకాయిలు ఉండగా, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వాటిని చెల్లించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. సింగరేణికి దాదాపు రూ. 25 వేల కోట్లు బకాయిలుగా ఉంటే, వ్యాపార విస్తరణపై మాత్రం ప్రభుత్వం, యాజమాన్యం దృష్టిసారించలేదని ఆరోపించారు. కేవలం లాభాలకే ఆసక్తి చూపుతూ, కొత్త గనుల అభివృద్ధిని నిర్లక్ష్యం చేస్తే, భవిష్యత్తులో సింగరేణి మూసివేయాల్సిన పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. సింగరేణి పరిరక్షణకు ఉద్యమం చేపట్టాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. జీవో నం. 22ను సింగరేణిలో అమలు చేసి కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం ఇవ్వాలని, అలాగే ఇల్లెందు, కొత్తగూడెం ప్రాంతాల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ సమావేశంలో వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, నేతలు మిర్యాల రంగయ్య, కె. సారయ్య, వంగా వెంకట్, రమణమూర్తి పాల్గొన్నారు.
ప్రభుత్వ టెలికం ఆపరేటర్ బీఎస్‌ఎన్‌ఎల్ తన కస్టమర్ల కోసం ప్రత్యేక ప్రీపెయిడ్ రీచార్జ్ ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. రూ.797 ప్రీపెయిడ్ ప్లాన్‌తో 300 రోజుల వరకు సిమ్ యాక్టివ్‌గా ఉంచుకోవచ్చు. ఈ ప్లాన్ ద్వారా మొదటి 60 రోజుల పాటు అన్ని నెట్‌వర్క్‌లకు అన్లిమిటెడ్ కాల్స్, రోజుకు 2జీబీ చొప్పున మొత్తం 120జీబీ డేటా, రోజుకు 100 SMS లభిస్తాయి. అయితే 60 రోజుల తర్వాత డేటా, కాలింగ్ ప్రయోజనాలు ముగుస్తాయి, కానీ సిమ్ మొత్తం 300 రోజులు యాక్టివ్‌గా ఉంటుంది. ఈ ప్లాన్ పరిమిత కాలం మాత్రమే అందుబాటులో ఉండగా, ఫిబ్రవరి 10లోగా రీచార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. అంతేకాదు, బీఎస్‌ఎన్‌ఎల్ ఓటీటీ ప్లేతో కలిసి లాంచ్ చేసిన బీటీవీ ప్లాట్‌ఫామ్ ద్వారా 450కి పైగా లైవ్ టీవీ ఛానళ్లను అదనపు ఖర్చు లేకుండా చూడొచ్చు. డేటా అవసరం లేకుండానే దేశవ్యాప్తంగా ఈ D2M (Direct-to-Mobile) సేవ అందుబాటులో ఉంది.
అమెరికా లో అక్రమంగా ప్రవేశించేవారిలో ఎక్కువ మంది వెళ్ళేది… “గాడిద మార్గం”ఎల్ బుర్రో అనే స్పానిష్ మాటకు అర్థం గాడిద .గాడిదలా బరువులు మోసుకొంటూ అడ్డదిడ్డంగా వెళ్లడం అనే భావాన్నుంచి ఇది పుట్టింది. గాడిద మార్గం రహదారి కాదు .ఎన్నెన్నో దొంగ మార్గాలు .ఇందులో ఒకటి… దరియెన్ ఖాళీ స్థలం .అతి భయంకరమయిన కీకారణ్యం .. చిత్తడి నేల.పొడవు 97 కిలోమీటర్లు .పనామా… కొలంబియా మధ్య వుంది.విష పాములు , చిరుతలు, విష కీటకాలు ఇక్కడ లెక్కకు మించి ఉంటాయి .ఎప్పుడూ వర్షం .. దానితో పాటే ఎండ .. వేడి .. చెమటలు కారి పోతాయి . అసలు సమస్య ఇక్కడ వున్న డ్రగ్ మాఫియా లతో .ఆడవాసన కనబడితే వదిలిపెట్టరు .ఈ మార్గం లో వెళ్లేవారికి ఏజెంట్స్ ముందుగానే కండోమ్లు ఇస్తారు .డ్రగ్ కేటుగాళ్లతో సంభోగానికి ఒప్పుకోవాలి .లేకపోతె చిత్ర హింసలు పెట్టి రేప్ చేసి చంపేస్తారు .ఇవన్నీ లేకుండా ముందుగానే ఒప్పుకొంటే ప్రాణం దక్కుతుంది .ఎయిడ్స్ సోకకుండా రబ్బరు తొడుగు .వారు అడిగితే చేతిలో ఉన్న డబ్బు మొత్తం ఇచ్చేయాలి . రోజుకు ఒక చిన్న బ్రెడ్ ముక్క .. రెండు బిస్కెట్లు .తాగు నీరు పెద్దగా అందుబాటులో ఉండదు . దరియెన్ గాప్ ప్రయాణం వారం నుంచి 15 రోజులు పడుతుంది .అదేంటి కేవలం 97 కిలోమీటర్స్ కదా?.. అనుకొంటున్నారా ?కొండలు గుట్టలు .. బురద .. చెట్లు చేమలు .. పాములు .. దోమలు .. అడుగు తీసి అడుగు వెయ్యాలనుంటే నరకం .అక్కడ ఖాయిలా పడితే అంతే సంగతి .ఖాయిలా మనిషిని అక్కడే వదిలేసి బృందం ముందుకు వెళ్ళిపోతుంది .అంటే అక్కడే తిండి లేకుండా చచ్చి పోతారు .జనాలు వెళుతుంటే దారిలో శవాలు ఆస్తి పంజరాలు కనిపిస్తాయి.ఇంతటి దారుణమయిన మార్గం లో ఎవరు వెళుతారు అనుకొంటున్నారా ?2023 లో మొత్తం అయిదు లక్షల మంది వెళ్లారు . అంతకు ముందు సంవత్సరం కంటే ఇది డబల్ . విమానం లో ఎక్కించినా బేడీలు ఎందుకు ? భయం .. బయపెట్టడం .” మా దేశానికి అక్రమమార్గం లో వస్తే పర్యవసానాలు ఇలా ఉంటాయి!” అని అందరికీ హెచ్చరిక .సైకలాజికల్ వార్నింగ్ .అందుకే అమృత్సర్ ప్రయాణీకుల సంకెళ్ళ వీడియో ను వారి ప్రభుత్వం అధికారికంగా పెట్టింది .” దరియెన్ గ్యాప్ లో ఎన్నో కష్టాలు పడి మా దేశం లో దూరినా .. పట్టుకొంటాము. చీకటి గదుల్లో బందిస్తాము . అవమానకర రీతిలో చేతులకు కాళ్లకు బేడీలు వేసి గెంటేస్తాము “అని వారు అధికారికంగా చెబుతున్నారు . { గెంటేస్తాము అనే మాట వారు వాడింది } శిక్షించవచ్చు కదా ? టైటిల్ 8 సెక్షన్ 1325 .. us కోడ్ ప్రకారం ఆ దేశం లో అక్రమమగా చొరబడితే రెండేళ్లు జైలు .. రెండు లక్షల యాభై వేల డాలర్స్ అపరాధం .ఇప్పుడు గెంటివేయబడ్డ వారు ఇటీవలే వెళ్ళినవారు . వీరిలో చాలా మంది బోర్డర్ లోనే పట్టుబడి ఇన్నాళ్లు జైళ్లలో ఉన్నవాళ్లే . ఆస్తి మొత్తం అమ్మి ఏజెంట్స్ కు అప్పచెప్పి అమెరికా లో చొరబడి … అప్పుడే పట్టుబడితే వారి దగ్గర ఏమి ఉంటుంది ? ఇరవై లక్షలు కట్టగలరా ? అందుకే పంపేస్తున్నారు.ఇది వరకే అక్కడ చొరబడి కాస్తో కూస్తో డబ్బు సంపాదించిన వారితో ఎలా వ్యవహరిస్తారో చూడాలి . విద్యార్థుల సంగతి ఏంటి ?స్టడీ వీసా పై వెళ్లిన వారు క్యాంపస్ బయట ఉద్యోగాలు చేయకూడదు .ఇన్నాళ్లు సాగింది .ఇప్పుడు… పట్టుబడిపోతాము అని భయం తో టెక్సాస్ లాంటి చోట్ల ఎవరూ బయట ఉద్యోగాలకు వెళ్లడం లేదు .వీరు వెళ్లినా పార్ట్ టైం ఉద్యోగాలు ఇవ్వడానికి వారు రెడీగా లేరు.పరిస్థితి దారుణంగా వుంది .ఆయనకో షాప్ వుంది . వ్యాపారం వారి కుల వృత్తి . కొడుకును అరవై లక్షల అప్పు చేసి అమెరికా పంపించాడు . అటు పై మరో ఇరవై లక్షల అప్పు . వడ్డీ కట్టలేక మొన్న ఆత్మ హత్య చేసుకొన్నాడు .కొడుకు బంగారు భవిత కోసం ప్రాణం విడిచిన తండ్రి . ఎవరిదీ పాపం ? ఇంతజరిగినా జనాలకు ఇప్పటికీ సరైన సమాచారం ఇచ్చేవారు లేరు .”పక్క వాళ్ళు వెళ్లారు .. మనం కూడా వెళ్ళాలి” అనే తపనే .గాడిద మార్గం లో ప్రాక్సీ మార్గం లో అమెరికా కు పంపే ఏజెంట్స్ కోటీశ్వరులు అయిపోయారు .అమెరికా లో కేసినోలలో ఒక రాత్రి పూట వారు పందెం కాచే డబ్బు చూసి అమెరికా సంపన్నులే కళ్ళు తేలేస్తున్నారు .నాశనం అయిపోతోంది మనోళ్లే .. దోచుకొంటోంది మనోళ్లే ..మొసలి కన్నీరు కురుస్తోంది మనోళ్లే .డాలర్ డ్రమ్స్ కాస్తా… డాలర్ నైట్ మెర్ అయ్యిందిబహుశా మరో రెండేళ్లకు ప్రతిభ వున్నవారికి ఇండియా లో ఫ్లైట్ ఎక్కేముందే గ్రీన్ కార్డు చేతిలో పెట్టి మేళతాళాలతో అమెరికా ఆహ్వానించవచ్చు . రహదారికు .. అడ్డదారి కి తేడా ఇప్పటికైనా తెలుసుకొంటే అందరూ బాగుపడతారు .ధన్యవాదములు 🙏మీ నవీన్ నడిమింటి
రాజ్యాంగ స్ఫూర్తిని, ప్రాతినిధ్య అసలు ఉద్దేశాన్ని మరియు శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం ఆర్టికల్ – 341(1) చే పార్లమెంటు గుర్తించిన ఉమ్మడి జాబితా యొక్క విస్తృత పరిధి, గుర్తింపు, గౌరవం సహా విలువ, గొప్పతనం, ఔన్నత్యం, ప్రాధాన్యత మరియు ప్రాముఖ్యతతో పాటు సమభావం, సమదృష్టి, దృక్పథం, ఆలోచన ఎలాగూ అర్థం చేసుకోలేరు. కనీసం, మీ అభీష్టం మేరకు వెలువరించిన సుప్రీంకోర్టు యొక్క తీర్పు “స్పూర్తినైనా” గుర్తించేందుకు, గౌరవించేందుకు మరియు అర్థం చేసుకునేందుకు ప్రయత్నించండి.కమీషన్ నివేదిక తెలంగాణ మంత్రివర్గ ఉప సంఘానికి సమర్పించిన అనంతరం.. సదరు నివేదికను శాసన మండలిలో ప్రవేశపెట్టిన సందర్భంగా సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో పాత్రికేయ మిత్రులను ఉద్దేశించి సోదరుడు మందకృష్ణ స్పందించిన, మాట్లాడిన తీరుపై.. ప్రతిస్పందనగా ఈ పోస్టును పెట్టడం జరిగింది.ఇతను మందకృష్ణది.. తెలియనితనం, అమాయకత్వం అనాలా.. విడ్డూరం, వితండవాదం అనాలా.. అనాలోచిత, అస్తవ్యస్త, అసంబద్ధ ధోరణి అనాలా.. అనుభవారాహిత్యం, అవగాహనారాహిత్యం అనాలా.. పరిణతిచెందని, పరిపక్వతలేదని అనాలా.. ఇంగిత, సమూహ, సమాజ, లోకఙ్ఞానంలేదని అనాలా.. పరిశీలన, పరిశోధక, శాస్త్రీయ, హేతుబద్ధ ఙ్ఞానంలేదని అనాలా.. చిన్నపిల్లవాడి వ్యక్తిత్వం, మనస్తత్వం అనాలా.. ఇంతకూ ఏమనాలి, ఏమనుకోవాలో? తెలియని, అర్థంకాని పరిస్థితి. గత సంవత్సరం 01 ఆగస్టు 2024న దేవేంద్ర సింగ్ V/S పంజాబ్ కేసుకు సంబంధించి.. భారత ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని 7 మంది సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం 6:1 నిష్పత్తిలో వెలువరించిన తప్పనిసరికాని మెజారిటీ తీర్పు, ఆదేశం, అభిప్రాయం మరియు మార్గదర్శకం అనుసరించి.. దేశంలో ఎక్కడెగాని పట్టించుకోని, చెత్తబుట్టలో వేసిన, వేయడానికి 100 శాతం అర్హత, యోగ్యత కలిగిన SC, ST ఉపతరగతి మరియు క్రిమీలేయర్/SC, ST Sub Classification అంశానికి సంబంధించి.. తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే అమలుకు నడుంబిగించి.. బ్లూ ప్రింటు, రోడ్ మ్యాప్, అమలు ప్రణాళిక మరియు విధివిధానాలు సిద్ధం చేసుకొని.. ఇరు రాష్ట్రాలు పోటిబడి ఏకసభ్య కమిషన్లను కూడా నియమించుకొని.. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా, వాటి పనిని ప్రారంభించి.. ఆ మేరకు, మొదటగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.. కమీషన్ నివేదికను ఆగమేఘాలపై మంత్రివర్గ ఉపసంఘానికి, అటునుంచి ముఖ్యమంత్రి గారికి.. అలాగే, రాష్ట్ర మంత్రి మండలిలో సంయుక్త ఆమోదంపొంది.. తదనంతరం సంబంధిత శాసనమండలి మరియు శాసనసభలో ఉభయ సభలలో చర్చచేసి.. చర్చల్లో ఇంకా ఏవైనా మెరుగైన సలహాలు, సూచనలు మరియు అభిప్రాయాలు ఉంటే.. వాటిని కూడా సుప్రీంకోర్టు యొక్క మార్గదర్శకాలను అనుసరించి, కమీషన్ నివేదికలో ఏవైనా మార్పులు, చేర్పులు చేసి.. సదరు ఉభయ సభల ఆమోదంతో చట్టంగా మార్చి.. సంబంధిత గవర్నర్ల ద్వారా ఆమోదంపొంది “”రాజముద్ర/గెజిట్” రూపంలో అమలుకు ప్రయత్నించడం. అలాగే రెండో కోణం నుంచి చూచినట్లయితే.. అటునుంచి కేంద్రప్రభుత్వానికి పంపి.. లాకమీషన్, Research Analysis Wing (RAW) సంయుక్త పరిశీలన అనంతరం.. నేరుగా “”తాత్కాలిక కార్యనిర్వహక ఉత్తర్వు కోసం రాష్ట్రపతికి పంపడం లేదా శాశ్వత ఉత్తర్వు”” కోసం న్యాయ మంత్రిత్వశాఖ ద్వారా, పార్లమెంటు వ్యవహారాల మంత్రిత్వశాఖకు చేరుకొని.. పార్లమెంటులో ముసాయిదా బిల్లుపెట్టడం.. సదరుబిల్లు రాజ్యాంగ సూత్రాలకు, నిబంధనలకు అనుగుణంగా ప్రవేశపెట్టి, చర్చచేసి.. అక్కడకూడా ఏవైనా మార్పులు, చేర్పులు చేసి.. ఉభయసభల ఆమోదంతో.. తిరిగి రాష్ట్రపతికి చేరుకొని.. “రాజపత్రం/గెజిట్” రూపంలో అధికారిక ప్రకటన వెలువడడం అన్నది శాసన, కార్యనిర్వహక పక్రియాలో భాగం. అక్కడ నుంచి.. సంబంధిత గవర్నర్ల ద్వారా ప్రభుత్వాలకు చేరుకొని.. సంపూర్ణ మరియు పరిపూర్ణ అమలుకు శ్రీకారం చుట్టడం అన్నది.. ఎక్కడైనా ప్రజాస్వామ్యంలో జరుగుతుంది.ఇది రాజ్యాంగ, ప్రజాస్వామ్య పక్రియ. సుప్రీంకోర్టు ముందుగానే చెప్పింది.. ఇందులో ఎక్కడైనా “”రాజకీయ దురుద్దేశం, కోణం””ఉంటే.. శాస్త్రీయంగా, హేతుబద్ధంగా లేకుంటే.. తిరిగి న్యాయ సమీక్షకు/Judicial Review కి రావచ్చని. ఇప్పుడు మీరు ఆరోపిస్తున్న ప్రకారం మాకు 11 శాతం రావాల్సి ఉంటే.. మాకు కేవలం 9 శాతమే కేటాయించారు.. మాకు “”అన్యాయం చేశారు, కుట్రచేశారు”” అని అంటున్నావు. నిజంగా బుర్ర, బుద్ధి మరియు సోయి ఉన్నోడివే అయితే.. ఈమాట అనే నైతికహక్కు, అర్హత నీకెక్కడిదిబై? రాష్ట్ర ప్రభుత్వాలకు ఇస్తే ఇలాంటి పరిస్థితులు, గందరగోళాలు, పైరవీలు ఉంటాయనే కదా! మాలాంటివాళ్ళం మొదటినుంచి మొత్తుకుంటున్నది. ఇప్పుడన్నా అర్థమైందా? ఎందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వకూడదో. సరే, అధి అటుంచితే.. ఏ రకంగా 11 శాతం వస్తాయని అనుకుంటావు? ఈ నిష్పత్తి ఎప్పుడు నిచ్చయించింది? అప్పుడెప్పుడు 1950 దశకంలో. ఇప్పుడు పరిగణలోకి తీసుకున్న జనాభా ఏ సంవత్సరంది 2011 ది.మరి ఏరకంగా 11 శాతం వస్తుంది. సుప్రీంతీర్పులో వర్గీకరణ అనే ప్రసక్తేలేదు. కులాల, ఉపకులాల ప్రసక్తి కూడా లేదు. నిర్ధిష్ట “”అనుభావిక/Eperical”” డేటాను అనుసరించి ముందుకెళ్లమని చెప్పింది. అది ఎవరి ద్వారా అధీకృతం చేసింది. కేంద్ర ప్రభుత్వ పరిధిలో పనిచేసే జాతీయ జనగణన నమోదు శాఖ/Registration of National Census Department వారి ద్వారా సేకరించబడే కులగణన లెక్కలే ప్రామాణికం, కొలమానం.ఇప్పుడు చెప్పండి.. అప్పుడెప్పుడో 1931 లో కుల గణన జరిగింది. ఇంతవరకు కులగణన జరగలేదు. తెలంగాణ ప్రభుత్వం సేకరించిన “”కుల మరియు ప్రయోజన లెక్కలు””.. ఏవిధంగా అంగీకరించబడతాయి, ఆమోదించబడతాయి?. ఈ అసంబద్ధ, అశాస్త్రీయ, ఆహేతుక విధానం.. ఏ విధంగా సమర్థనీయం? వ్యక్తుల ప్రాతిపదికన మాట్లాడకూడదు అన్న కనీస ఇంగితజ్ఞానంలేకుండా.. ఘంటా చక్రపాణి, గద్దర్ కుటుంబం, తదితర పేర్లను ప్రస్తావించడం.. ఏపాటి సభ్యత, సంస్కారం? వారు అభివృద్ధి చెందితే.. వారి కుల సమూహాలు మొత్తం అభివృద్ధి చెందినట్లా? ఉదాహరణకు మీరు మందకృష్ణ అభివృద్ధి చెందాడు అనుకోండి.. మందకృష్ణ కుల సమూహాలు మొత్తం అభివృద్ధి చెందినట్లా? అసలు ప్రాతినిధ్య ఫలాలకు, అవకాశాలకు మరియు ప్రయోజనాలకు అర్థం తెలుసా? విద్యా, ఉద్యోగ మరియు రాజకీయ ప్రాతినిధ్య ఫలాలను, ప్రయోజనాలను అభివృద్ధి నమూనాలో భాగంచేయరాదు, చూడరాదు, పరిగణించరాదన్న సోయి, సంగతి తెలుసా?. అంతేకాకుండా.. ఇప్పుడిప్పుడే పాతజ్ఞాపకాలను, గాయాలను మరిచి, రెండుతెలుగు రాష్ట్రాలు అన్నదమ్ములవలే తిరిగి మసులుకుంటుంటే.. వీల్లమధ్య విభేదాలు, విద్వేషాలు మరియు భావోద్వేగాలు చెలరేగేలా మరియు సృష్టించేలా.. ఖమ్మం జిల్లా భద్రాచలం పరిధిలోని పోలవరం 200 సమీప గ్రామాలు, 7 మండలాలు ఆంధ్రావాల్లు లాక్కున్నారు, గుంజుకున్నారు అని అర్థం వచ్చేలా నిస్సిగ్గుగా అవగాహనలేని, అర్థపర్థంలేని, అసంబద్ధ వ్యాఖ్యలు చేస్తున్నావు, మాట్లాడుతున్నావు. చట్టప్రకారం, గౌరవంగా, హుందాగా ఎందుకు తీసుకున్నారో తెలిస్తే?.. ఈమాట మాట్లాడేవాడివికాదు. పోలవరం ప్రాజెక్టు ద్వారా మునకకుగురై.. తీవ్ర ఇబ్బందులుపడే ప్రమాదం, అవకాశం ఉందన్న కారణంగా.. ఆ గ్రామాలకు, మండలాలకు కూడా.. మిగతా గ్రామాల, మండలాలవలే.. అన్నిరకాల సౌకర్యాలు, పాలనా సదుపాయాలు కల్పించాలన్న భావనతో మంచిఉద్దేశంతో.. ఇరు రాష్ట్రాల పాలకులు తమ విజ్ఞతను, వివేకాన్ని, మానవీయకోణాన్ని మరియు రాజనీతినీ ప్రదర్శించి.. వాటిని ఆంధ్రప్రదేశ్ లో పరస్పర చట్టసమ్మతంతో కలుపుకోవడం జరిగిందన్న విషయం.. మీకు తెలియకపోవడం నిజంగా విడ్డూరం, దురదృష్టకరం.దీనినిబట్టి చూస్తే.. ఈ సమస్య ఇంకొన్ని సంవత్సరాలు ఉండివుంటే బాగుండు.. ఈ సమస్య పరిష్కరించబడుతుందేనన్న మనోవేదనతో, బాధతో నోటికి ఏదోస్తే, ఎంతొస్తే అంత మాట్లాడుతున్నావని స్పష్టంగా తెలుస్తోంది. ఈ సమస్య ఏదోరకంగా కొద్దిగా అటోఇటో హుందాగా, గౌరవంగా పరిష్కరించబడిందన్న గొప్ప భావన, ఆలోచన మీలో ఇసుమంతైనా లేకపోవడం.. ఉన్న గుర్తింపు, గౌరవం కోల్పోవడం, పోగొట్టుకోవడమే అవుతుందని తెలియజేస్తూ.. ఉన్న సామూహిక రాజ్యాంగ వనరును.. 3 గ్రూపులుగా వెనుకబాటు, దామాషా నిష్పత్తి లేదా ఇతర ఏదేని ప్రతిపాదికలను పరిగణలోకి తీసుకొని చేశారన్న సంతోషం, ఆనందం మరియు సంతృప్తి మీలో లేకపోతే జీవితానికి ఒక “”అర్థం మరియు పరమార్థం”” లేకుండా.. నిత్యం అసంతృప్తివాదిగా, నిరాశవాదిగా చరిత్రలో మిగిలిపోకతప్పదని.. ఈ సందర్భంగా నిర్మాణాత్మకమైన సూచనచేస్తూ, హితవుపలుకుతూ.. యావన్నంది ప్రజలు, ప్రజాస్వామికవాదులు మరియు జాతి ముద్దుబిడ్డలకు ఉన్న వాస్తవ విషయాన్ని తెలియజేస్తున్నా రండి.. నిన్నటికంటే నేడుమేలు.. ఉన్నదానికంటే ఎంతోకొంతమేలు అన్న చందంగా.. సంతృప్తికర, సంతోషకర మరియు ఆనందకర ఆశావహ దృక్పథ జీవితాలను జీవిద్దాం.. ఇక కోపతాపాలకు, ఈర్షద్వేషాలకు, రాగద్వేషాలకు తావులేకుండా.. అన్నిటికి స్వస్తిపలికి.. ఒక పెద్ద సమూహంలో నుంచి.. చిన్నచిన్న గ్రూపులుగా విడిపోయినా.. సోదరులంగా కలిసి.. బలమైన రాజ్యాంగ స్ఫూర్తిని, ప్రాతినిధ్య ఉద్దేశాన్ని మరియు పార్లమెంటు గుర్తించిన ఉమ్మడి జాబితా ఆలోచనలను, ఆకాంక్షలను గుర్తించి, గౌరవించి మరియు అర్థం చేసుకొని.. మిగిలిపోయిన బలమైన మరియు ఘనమైన ఉమ్మడి లక్ష్యాలను సాధించేందుకు మహోన్నతంగా ప్రయత్నిద్దాం.. ఇక చిన్నదానికి, పెద్దదానికి.. అయినదానికి , కానిదానికి కలహించుకోకుండా, తగవుపడకుండా.. ఇది నల్లా, తెల్లా అని సంకుచితంగా ఆలోచించకుండా, నడుచుకోకుండా, మరియు వ్యవహరించకుండా.. జరిగిందంతా ఒక పీడకలలెక్క ఇరువురు పరస్పరం మరిచిపోయి.. మన భావితరాల బంగారు భవిష్యత్తుకు బలమైన పునాదులు కలిసికట్టుగా, ఐక్యంగా, సమిష్టిగా మరియు సంఘటితంగా వేద్దామని ఈ సందర్భంగా పిలుపునిద్దాం, విజ్ఞప్తిచేద్దాం మరియు మనవికూడాచేద్దాం…. నూతన ప్రజాస్వామిక విప్లవ జైభీములు మరియు బుద్ధవందనాలతో…. (సంగటి మనోహర్ మహాజన్)వ్యవస్థాపక జాతీయ సమన్వయకర్త,మహాజన సమన్వయ సమితి/Mahajan Coordination Committee (MCC);వ్యవస్థాపక జాతీయ కన్వీనర్,రాజ్యాంగ హక్కుల పరిరక్షణ సమితి/Constitutional Rights Protection Committee (CRPC);వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు,Mahajana Rajyam Party (MRP);కడప, ఆంధ్రప్రదేశ్, ఇండియా – 9849509416:
ఎస్సీ వర్గీకరణ మంత్రి మండలి ఆమోదం తెలపడంనీ, అసెంబ్లీలో శమిమ్ అక్తర్ కమిటీ నివేదికను ప్రవేశ పెట్టడాన్ని నిరసిస్తూ నిజామాబాద్ జిల్లాలోని మాల సంఘాల జే ఏ సి ఆధ్వర్యంలో గురువారం కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మలు దగ్ధం చేయడం జరిగింది. ఈ సందర్భంగా అల్ మాల స్టూడెంట్ అసోసియేషన్ ( ఆంసా) రాష్ట్ర అధ్యక్షుడు అంగరి ప్రదీప్ మాట్లాడుతూ గతంలో ఆరు శాతం మాలలకు రిజర్వేషన్ ఉంటే ఇప్పుడు దానిని 5 శాతానికి తగ్గించడం పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు. అలాగే మోడీ కనుసన్నల్లో పని చేస్తున్న కాంగ్రెస్ ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి ఉప వర్గీకరణను చేస్తున్నారని అన్నారు. మాలల భవిష్యత్తును అందకరంలోకి నెడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరును నిరసిస్తూ రాబోయే ఎమ్మెల్సీ ఉపాద్యాయ, గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో, స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పని చేసి కాంగ్రెస్ ఓటమి కోసం మాలలు పని చేయాలని కోరారు. మాల జాతి ద్వారా రాజకీయ చేస్తున్న ఉప ముఖ్య మంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీ లో నోరు విప్పక పోవడ్డాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు. మాల ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు వర్గీకరణకు వ్యతిరేకంగా తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మాల మహానాడు జిల్లా అధ్యక్షులు ఎల్లయ్య మాట్లాడుతూ మాలలు వర్గీకరణకు వ్యతిరేకంగా ఉద్యమించాలని పిలుపు నిచ్చారు. ప్రతి కార్యకర్త కాంగ్రెస్ పార్టీకి స్వచ్ఛందంగా రాజీనామా చేసి బయటకు వచ్చి నిరసన తెలపాలని కోరారు. అనంతం తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆఫ్ మాల (టీమ్) నాయకులు అలుక కిషన్ దేవదాస్ లు మాట్లాడారు. అంతకు ముందే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మలు దగ్ధం చేసి నిరసన తెలిపారు. అరగంట పాటు రాస్తారోకో చేసారు