📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Wednesday, August 26, 2026
Visitors: 1,677,503  |  1236 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుఆగస్టు 31న 'ఛలో సెక్రటేరియట్': మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్ పిలుపుదిల్లీలో 2,308కు చేరిన H1N1 కేసులు60 ఏళ్లు దాటిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం : యోగి ఆదిత్యనాథ్‌వివాహేతర సంబంధం.. భర్త హత్యవిమెన్‌ ఆంధ్రా ప్రీమియర్‌ లీగ్‌కు రంగం సిద్ధంLatest Breaking News from PressMeetతాజా వార్తలుఆగస్టు 31న 'ఛలో సెక్రటేరియట్': మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్ పిలుపుదిల్లీలో 2,308కు చేరిన H1N1 కేసులు60 ఏళ్లు దాటిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం : యోగి ఆదిత్యనాథ్‌వివాహేతర సంబంధం.. భర్త హత్యవిమెన్‌ ఆంధ్రా ప్రీమియర్‌ లీగ్‌కు రంగం సిద్ధం
National ⚡ AMP

సీబీఎస్‌ఈ 12వ తరగతి రీవ్యాల్యుయేషన్ పోర్టల్‌ను తిరిగి తెరవలేం: సుప్రీం కోర్టు కీలక తీర్పు

August 25, 2026 11 hr ago 0 Views
SHARE: Share Tweet WhatsApp Telegram

సీబీఎస్‌ఈ (CBSE) 12వ తరగతి జవాబు పత్రాల పునఃసమీక్ష (Re-evaluation) కోర్సుల ప్రవేశాలపై సుప్రీం కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఫలితాల పునఃసమీక్ష కోసం ఆన్‌లైన్ పోర్టల్‌ను మళ్లీ ప్రారంభించేలా సీబీఎస్‌ఈని ఆదేశించాలని దాఖలైన పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది.

గడువు ముగిసాక మళ్లీ విండో తెరవడం కుదరదు

విద్యార్థులకు దరఖాస్తు చేసుకోవడానికి ఇప్పటికే తగిన సమయం ఇచ్చారని, ఇప్పుడు మళ్లీ పోర్టల్‌ను తెరిస్తే మొత్తం కళాశాల ప్రవేశాల ప్రక్రియపై తీవ్ర ప్రభావం పడుతుందని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం వ్యాఖ్యానించింది. “బస్సు అందుబాటులో ఉన్నప్పుడు ఎక్కకుండా, దానిని మిస్ చేసుకుంటే ఎవరైనా ఏం చేయగలరు?” అని వ్యాఖ్యానిస్తూ, నిర్ణీత గడువులోగా దరఖాస్తు చేసుకోని వారికి మళ్లీ అవకాశం ఇవ్వలేమని స్పష్టం చేసింది.

1.68 లక్షల మంది దరఖాస్తు:

ఇప్పటికే నిర్ణీత గడువులోగా సుమారు 1.68 లక్షల మంది విద్యార్థులు రీవ్యాల్యుయేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నారని కేంద్ర ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. సీబీఎస్‌ఈ మార్కులు ప్రవేశ పరీక్షలు, ఉన్నత చదువుల అడ్మిషన్లతో ముడిపడి ఉన్నందున ఈ దశలో మళ్లీ పోర్టల్ తెరవడం సాధ్యం కాదని స్పష్టం చేయడంతో సుప్రీం కోర్టు ఈ పిటిషన్‌ను కొట్టివేసింది.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!