పశ్చిమాసియా యుద్ధం: భారతీయుల కోసం హెల్ప్‌లైన్


ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ఐదో రోజుకు చేరి ఉద్రిక్తతలు పెరగడంతో అక్కడ చిక్కుకున్న భారతీయుల రక్షణ కోసం విదేశాంగ శాఖ ప్రత్యేక కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసింది. ఢిల్లీలోని కంట్రోల్ రూమ్ కోసం టోల్ ఫ్రీ నంబర్ 1800118797తో పాటు ఇతర ఎమర్జెన్సీ నంబర్లను అందుబాటులోకి తెచ్చారు. ఇజ్రాయెల్ (+972 547520711), ఇరాన్ (+98 9128109115) సహా పలు అరబ్ దేశాల్లోని రాయబార కార్యాలయాలు కూడా సహాయక నంబర్లను విడుదల చేశాయి. అణు కేంద్రాలపై దాడుల నేపథ్యంలో పౌరులు అప్రమత్తంగా ఉంటూ ఎంబసీ సూచనలు పాటించాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.

* 📍 ఢిల్లీ కంట్రోల్ రూమ్: 1800118797
* 🇮🇱 ఇజ్రాయెల్ హెల్ప్‌లైన్: +972 54 7520711
* 🇮🇷 ఇరాన్ హెల్ప్‌లైన్: +98 9128109115
* 🇴🇲 ఒమన్ టోల్ ఫ్రీ: 80071234
* 🇦E యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్: 800 46342
* 🕒 సమయం: ఉదయం 9 నుండి రాత్రి 9 వరకు (ఢిల్లీ సెంటర్)

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!